ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2021 అక్టోబర్ 24 వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’)కార్యక్రమం 82 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగంపాఠం

Posted On: 24 OCT 2021 11:49AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారం.. శత కోటి నమస్కారాలు. 100 కోట్ల వాక్సీన్ డోజుల ను ఇప్పించడం పూర్తి చేసిన తరువాత, దేశం ఒక కొత్త ఉత్సహం తో, ఒక కొత్త శక్తి తో ముందుకు కదులుతున్న నేపథ్యం లో, మరి ఈ కారణం గా కూడా నేను కోటి కోటి నమస్కారాలు అని అంటున్నాను. మన టీకాకరణ కార్యక్రమం యొక్క సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతున్నది, అది ‘సబ్ కే ప్రయాస్’ (అందరి ప్రయత్నాల) తాలూకు శక్తి ని కూడా తెలియజేస్తున్నది.

సహచరులారా,, 100 కోట్ల వాక్సీన్ డోజు లు అనేటటువంటి సంఖ్య తప్పక చాలా పెద్ద విషయమే, అయితే దీనితో లక్షల కొద్దీ చిన్న చిన్న ప్రేరణల ను అందించే, అలాగే గర్వం కలిగించేటటువంటి నేక అనుభవాలు, అనేక ఉదాహరణ లు ముడిపడి ఉన్నాయి. టీకామందు ను ఇవ్వడం మొదలుపెట్టిన రోజుననే ఈ ఉద్యమానికి ఇంత పెద్ద సఫలత లభిస్తుందన్న విశ్వాసం నాకు ఎలాగ కలిగింది? అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ నాకు లేఖల ను వ్రాసి పంపారు. నాకు అంతటి నమ్మకం ఎందుకు కలిగిందంటే, నాకు నా దేశం యొక్క, నా దేశ ప్రజల యొక్క శక్తి సామర్ధ్యాల ను గురించి చాలా బాగా తెలుసు కనుక. మన హెల్థ్ వర్కర్ లు దేశవాసులందరికీ టీకామందు ను ఇచ్చే ప్రయత్నం లో ఎలాంటి లోపం చెయ్యరు అనే పూర్తి నమ్మకం నాలో ఉంది. మన హెల్థ్ వర్కర్ లు పూర్తి స్థాయి అంకిత భావం తో, ఓ సత్సంకల్పం తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. వాళ్లంతా ఓ వినూత్న సంకల్పం తో, అంకిత భావంతో వారి శక్తి కి మించి చాలా కష్టపడ్డారు . ధృఢ నిశ్చయం తో, మానవత భావన తో, సేవ దృక్పథం తో ముందుకు సాగి ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. దానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అనేక రకాలైన ఇబ్బందులను, సవాళ్ల ను అధిగమించి వారు ఏ విధం గా అయితే దేశ ప్రజలందరికీ ఒక సురక్ష కవచాన్ని ఏర్పాటు చేశారో దానిని గురించిన ఉదాహరణ లు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ సఫలత ను సాధించడానికి వారు ఎంతగా కష్టపడ్డారో, ఎన్ని శ్రమలకు ఓర్చుకొన్నారో మనం అనేక పత్రికల లో వచ్చిన కథనాల ను మనం చదివాం, బయట కూడా విన్నాం. ఒకరి ని మించి ఒకరు గా అనేక రకాలైన ప్రేరణ లు మన ఎదుట ఉన్నాయి. నేను ఈ రోజు న మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) లో ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ ప్రాంతాని కి చెందిన ఓ హెల్థ్ వర్కర్ పూనమ్ నౌటియాల్ గారి ని మీకు పరిచయం చేయాలనుకొంటున్నాను. సహచరులారా, దేశం లో నూటి కి నూరు శాతం ఒకటో డోజు ను వేయించే పని ని పూర్తి చేసిన ఉత్తరా ఖండ్ కు చెందిన ఒక ప్రాంతమే బాగేశ్వర్. దీనికి గాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం అభినందన కు పాత్రురాలు. ఎందుకంటే, అది అత్యంత దుర్గమం అయినటువంటి, కఠినమైన ప్రదేశం కాబట్టి. అదే విధం గా, హిమాచల్ ప్రదేశ్ కూడా ఇటువంటి అనేక విధాలైన ఇబ్బందులలోనూ నూటి కి నూరు శాతం డోజు ను ఇప్పించే కార్యాన్ని నెరవేర్చింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం పూనమ్ గారు ఆవిడ ఉన్న ప్రాంతం లోని వారు అందరికీ టీకామందు లభించేటట్లుగా పగలనక, రాత్రనక శ్రమించారన్న సంగతి నా దృష్టి కి తీసుకురావడమైంది.

ప్రధాన మంత్రి : పూనమ్ గారు నమస్తే.

పూనమ్ నౌటియాల్ : సర్ ప్రణామాలు.

ప్రధాన మంత్రి : పూనమ్ గారు దేశ వాసులందరికీ కాస్త మీ గురించి చెబుతారా.

పూనమ్ నౌటియాల్ : సర్ నా పేరు పూనమ్ నౌటియాల్. సర్ నేను ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లా లో గల చానీ కోరాలీ సెంటర్ లో విధులు నిర్వర్తిస్తున్నాను. నేను ఒక ఎన్ఎమ్ ని సర్.

ప్రధాన మంత్రి : పూనమ్ గారు, నాకు బాగేశ్వర్ ను సందర్శించే అవకాశం లభించింది. అది నా సౌభాగ్యం. అది ఒక విధం గా తీర్థ క్షేత్రం గా ఉంది. అక్కడ ప్రాచీనమైన మందిరం వగైరా లు ఉన్నాయి. ఆ మందిరాన్ని ఎన్నో శతాబ్దాల కిందటే జనం ఎలా నిర్మించారో కదా అని నేను చాలా ప్రభావితుడి ని అయ్యాను.

పూనమ్ నౌటియాల్ : అవును సర్.

ప్రధాన మంత్రి : పూనమ్ గారు, మీరు మీ ప్రాంతాల లో అందరికీ టీకామందు వేయడాన్ని పూర్తి చేశారా ?

పూనమ్ నౌటియాల్ : అవును సర్, మొత్తం అందరికీ టీకా వేయడం పూర్తయిపోయింది.

ప్రధాన మంత్రి : మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ని అయినా ఎదుర్కోవలసి వచ్చిందంటారా ?

పూనమ్ నౌటియాల్ : అవును సర్. ఎప్పుడైతే వర్షం పడేదో అక్కడ రహదారి బ్లాకయిపోయేది. సర్, మేం నది ని దాటుకొని వెళ్లాం. మరి సర్, ఇంటింటి కి వెళ్లాం: ఎన్ హెచ్ సివిసి లో భాగం గా మేం కేంద్రానికి రాలేకపోయిన అటువంటి వారి ఇళ్ల కు వెళ్లిన మాదిరిగానే వెళ్లాం. వయోవృద్ధులు, దివ్యాంగ జనులు, గర్భవతులు, పసిపాపల కు స్తన్యమిచ్చే బాలింత లు.. వారి కోసం సర్.

ప్రధాన మంత్రి : కానీ, అక్కడయితే కొండ ల మీద ఇళ్లు కూడా చాలా దూర దూరం గా ఉంటాయే.

పూనమ్ నౌటియాల్ : అవునండి.

ప్రధాన మంత్రి : మరి అయితే ఒక రోజు లో ఎంత వరకు వెళ్లగలిగే వారు మీరు.

పూనమ్ నౌటియాల్ : సర్ కిలోమీటర్ల లెక్కన చూస్తే - రోజు కు పది కిలోమీటర్లు, ఒక్కొక్క రోజు న ఎనిమిది కిలోమీటర్లు.

ప్రధాన మంత్రి : కానీ ఈ తరాయిల లో ఉండే వాళ్లకు 8-10 కిలోమీటర్లు అంటే ఏమిటో అర్థం కాదు. నాకు తెలుసు, పర్వతం లో 8-10 కిలోమీటర్లు వెళ్లడం అంటే, దానికి రోజంతా పట్టేస్తుంది అని.

పూనమ్ నౌటియాల్ : అవునండి..

ప్రధాన మంత్రి : కానీ ఒక్కరోజు లో అంటే ఇది చాలా కష్టమైన పని కదూ. అదీ కాక వాక్సినేశన్ తాలూకు సామానులన్నిటిని మోసుకు పోవలసివుంటుంది. మీకు తోడు గా ఎవరైనా సహాయకులు అంటూ ఉండే వారా, లేదా ?

పూనమ్ నౌటియాల్ : అవునండి. టీమ్ మెంబరు, మేం ఐదుగురం ఉంటాం గా సర్.

పూనమ్ నౌటియాల్ : అలాగా.

పూనమ్ నౌటియాల్ : మరి అందులో ఓ డాక్టరు, ఓ ఎఎన్ఎమ్, ఇంకా ఓ ఫార్మసిస్టు, ఎఎస్ హెచ్ ఎ, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఉంటారు.

ప్రధాన మంత్రి : ఆహాఁ, అయితే ఆ డేటా ఎంట్రీ కి అక్కడ కనెక్టివిటీ దొరికేదా లేకపోతే బాగేశ్వర్ కి తిరిగివచ్చాక చేసే వారా ?

పూనమ్ నౌటియాల్ : సర్.. అక్కడక్కడా దొరికేది, కొన్ని చోట్ల మాత్రం బాగేశ్వర్ కి తిరిగివచ్చిన తరువాతే (డేటా ఎంట్రీ) చేసేవాళ్లం, మేం.

ప్రధాన మంత్రి : మంచిది. పూనమ్ గారు మీరయితే నేరు గా వెళ్లి జనాని కి టీకా వేసే వారని నాతో చెప్పడం జరిగింది. ఎలా మీకు ఆ ఆలోచన వచ్చింది, మీ మనస్సు లో ఎలాంటి అభిప్రాయం జనించింది, మరి మీరు ఎలా ముందుకెళ్లారు ?

పూనమ్ నౌటియాల్ : మేం, పూర్తి టీమ్ సభ్యులం, ఒక్క వ్యక్తి కూడా టీకా వేయించుకోకుండా మిగిలిపో కూడదు అని సంకల్పించుకొన్నాం. కరోనా మహమ్మారి మన దేశానికి దూరం గా పరుగెత్తిపోవాలి. నేను మరియు ఎఎస్ హెచ్ ఎ కలసి గ్రామం వారీ గా ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు డ్యూ లిస్ట్ ను తయారు చేశాం. తరువాత ఆ లెక్క న ఎవరైతే సెంటర్ కు వచ్చారో వారికి సెంటర్ లోనే (టీకా) వేశాం. ఆనక మేం ఇంటింటికి వెళ్లాం. సర్, ఆ పైన, మిగిలిపోయినవాళ్ల కి, సెంటర్ కు రాలేకపోయిన వాళ్లని గుర్తించాం.

ప్రధాన మంత్రి : ఆహాఁ, జనాలకి అర్థం అయ్యేటట్టు చెప్పవలసి వచ్చేదా ?

పూనమ్ నౌటియాల్ : అవునండి, నచ్చజెప్పాం.

ప్రధాన మంత్రి : ఇప్పుడు కూడా టీకామందు ను వేయించుకోవాలనే ఉత్సాహం జనానికి ఉందంటారా ?

పూనమ్ నౌటియాల్ : అవునండి సర్, అవును. ఇప్పుడు అందరూ అర్థం చేసుకొన్నారు. మొదట్లో అయితే చాలా సమస్య అయింది మాకు. ఈ వాక్సీన్ సురక్షితం, ప్రభావవంతమైంది, మేం కూడా దీనిని వేయించుకొన్నాం, మరి మేం బాగానే ఉన్నాం, మీ ముందుకు వచ్చి పని చేస్తున్నాం, మరి మా సిబ్బంది అందరం టీకా వేయించుకొన్నాం, మేం బాగున్నాం అంటూ జనాని కి అర్థం అయ్యేటట్లు చెప్పవలసి వచ్చేది.

ప్రధాన మంత్రి : ఎక్కడైనా వాక్సీన్ వేయించకొన్న తరువాత ఎవరైనా ఫిర్యాదు చేశారా ?

పూనమ్ నౌటియాల్ : లేదు లేదు సర్. అలాంటిదేం జరుగలేదు.

ప్రధాన మంత్రి : ఏమీ కాలేదా

పూనమ్ నౌటియాల్ : మరేనండి.

ప్రధాన మంత్రి : అందరూ సంతోషం గా ఉన్నారు

పూనమ్ నౌటియాల్ : అవునండి.

ప్రధాన మంత్రి : అంటే బాగానే ఉందన్నమాట.

పూనమ్ నౌటియాల్ : అవును సర్.

ప్రధాన మంత్రి : సరే, మీరు చాలా పెద్ద పని ని చేశారు. మరి నేను ఎరుగుదును, ఈ ప్రాంతం అంతా, ఎంత కఠినమైందో. అక్కడంతాను కాలినడకన కొండను ఎక్కి, మళ్లీ కిందికి దిగి, మళ్లీ ఇంకో కొండమీదకు పోవడం; ఇళ్లు కూడా దూర దూరం గా ఉంటాయి, మీరు, ఇంత గొప్ప పని ని చేశారు.

పూనమ్ నైటియాల్ : ధన్యవాదాలు సర్, మీతో నేను మాట్లాడడం నా అదృష్టం.

ప్రధాన మంత్రి : మీ వంటి లక్షల కొద్దీ హెల్థ్ వర్కర్ లు వారి పరిశ్రమ తోనే భారతదేశం లో వంద కోట్ల వాక్సీన్ డోజు మైలురాయి ని అధిగమించగలిగింది. నేను ఈ రోజు న ఒక్క మీకు మాత్రమే కాకుండా ‘సబ్ కో వాక్సీన్ ముఫ్త్ వాక్సీన్’ (అందరికీ టీకామందు, ఉచితం గా టీకామందు) ఉద్యమానికి ఇంతటి శిఖరస్థాయి ని ఇచ్చినటువంటి, సఫలత ను అందించినటువంటి భారతదేశం లోని ప్రతి ఒక్క పౌరురాలి కి, భారతదేశం లోని ప్రతి ఒక్క పౌరుని కి కూడా ను కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా, మీకు తెలుసును, తరువాతి ఆదివారం, అక్టోబర్ 31 న సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ గారి జయంతి ఉందన్న విషయం. మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) యొక్క ప్రతి ఒక్క శ్రోత పక్షాన, నా పక్షాన, లోహపురుషుని కి నేను నమస్కరిస్తున్నాను. సహచరులారా, అక్టోబర్ 31 ని మనం రాష్ట్రీయ ఏకత దినం గా జరుపుకొంటాం. ఏకత్వానికి సంబంధించిన ఏ విధానం లేదా ప్రక్రియ తో అయినా సరే మనందరం అనుబంధాన్ని పెంచుకోవడం మన ధర్మం. మీరు చూసే ఉంటారు గుజరాత్ పోలీసులు కచ్ఛ్ లోని లఖ్ పత్ కోట నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు బైక్ ర్యాలీ ని నిర్వహించారు. త్రిపుర పోలీసులు ఏకత దివస్ ని జరుపుకొనే సందర్భం లో త్రిపుర నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీ ని నిర్వహిస్తున్నారు. అంటే తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిశ వరకు దేశాన్ని ఏకం చేస్తున్నారు. జమ్మూ- కశ్మీర్ పోలీసులు కూడా ఉరీ నుంచి పఠాన్ కోట్ దాకా అటువంటి బైక్ ర్యాలీ ని నిర్వహించి దేశం లో ఏకత్వ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. నేను ఆ జవానులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. జమ్మూ- కశ్మీర్ లోని కుప్ వాడా జిల్లా లోని అనేక మంది సోదరీమణుల గురించి కూడా నాకు తెలిసింది. ఆ ఆడపడుచులంతా కశ్మీర్ లోని సైన్యాని కి సంబంధించిన కార్యాలయాల కోసం, ప్రభుత్వ కార్యాలయాల కోసం మువ్వన్నెల జెండాల ను కుట్టే పని లో నిమగ్నం అయ్యారు. పరిపూర్ణమైన దేశ భక్తి తో చేస్తున్న పని అది. నేను ఆ ఆడపడుచు ల ఉద్వేగాన్ని అభినందిస్తున్నాను. మీరు సైతం భారతదేశం ఏకత్వం కోసం, భారతదేశం శ్రేష్ఠత్వం కోసం ఏదో ఒకటి తప్పక చేసి తీరాలి. అప్పుడు చూడండి, మీ మనసు కు ఎంతటి సంతృప్తి లభిస్తుందో.

సహచరులారా, సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ అనేవారు; ఏమనో తెలుసా.. ‘‘మనమందరం కలిసికట్టు గా ఉన్నప్పుడు మాత్రమే దేశాన్ని ప్రగతి పథం లోకి తీసుకుపోగలం. మనలో గనక ఏకత్వం అనేది లేకపోతే మనంతట మనమే కొత్త కొత్త ఆపదల లో చిక్కుకు పోతాం’’ అని. అంటే జాతీయ ఏకత అనేది ఉంటే ఔన్నత్యం, అభివృద్ధి ఉంటాయి అని. మనం సర్ దార్ పటేల్ గారి జీవితం నుంచి, ఆయన ఆలోచనల నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చును. మన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడాను ఈ మధ్యే సర్ దార్ పటేల్ జీవితచరిత్ర పై ఓ పిక్టోరియల్ బయోగ్రఫీ ని ప్రచురించింది. దీనిని మన దేశం లోని యువ సహచరులంతా తప్పక చదవాలి అని నేను కోరుకుంటాను. దాని వల్ల మీకు ఆసక్తిదాయకమైనటువంటి తీరు న సర్ దార్ సాహబ్ ను గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది.

ప్రియమైన సహచరులారా, జీవితం నిరంతరాయం గా ప్రగతి ని కోరుకొంటుంది, అభివృద్ధి ని కోరుకొంటుంది, ఉన్నత శిఖరాల ను అధిగమించాలని కోరుకొంటుంది. విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా సరే, ప్రగతి యొక్క గతి ఎంత వేగం గా ఉన్నా సరే, భవనాలు ఎంత అందం గా నిర్మితం అయినప్పటికీ సరే, జీవనం లో ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. కానీ, దీనిలో ఎప్పుడైతే గీతాలు, సంగీతం, కళలు, నాట్యం, సాహిత్యం జతపడుతుందో, అటువంటప్పుడు జీవనం యొక్క ప్రకాశం, జీవనం యొక్క చైతన్యం, అనేక రెట్లు పెరిగిపోతుంది. ఒక రకంగా జీవనాన్ని సార్థకం చేసుకోవాలి అంటే గనక ఇవి అన్నీ ఉండడం ఎంతో అవసరమవుతుంది. ఈ కారణం గానే అంటారు.. ఇవన్నీ మన జీవనం లో ఒక ఉత్ప్రేరకం వంటి పని ని చేస్తాయి, మన శక్తి ని పెంచేందుకు దోహద పడతాయి అని. మానవుని మనస్సు లోపలి అంతర్ మనస్సు ను వికసింపజేయడం లో, మన అంతర్మనస్సు చేసే యాత్ర కు చక్కటి మార్గాన్ని నిర్మించడం లో సైతం గీతాలకు- సంగీతానికి, ఇంకా వివిధ రకాలైన కళల కు ప్రధాన భూమిక ఉంటుంది. మరి వాటి కి ఒక పెద్ద బలం ఉంటుంది. ఆ బలాన్ని కాలం బంధించజాలదు, ఎల్ల అడ్డుకట్ట వేయజాలదు. మతం- మతాంతరం నిరోధించజాలవు. అమృత్ మహోత్సవ్ లో కూడా మన కళ లు, సంస్కృతి, గీతాలు, సంగీతం ల రంగుల ను తప్పక నింపవలసిందే. నాకు కూడా అనేక మంది వద్ద నుంచి అమృత్ మహోత్సవ్ ను, గీతం, సంగీతం, కళ ల తాలూకు ఈ బలాన్ని జోడించాలి అనే సూచన లు అనేకం అందుతున్నాయి. ఆ సూచన లు, నాకు ఎంతో విలువైనటువంటివి. నేను వాటి ని సంస్కృతి మంత్రిత్వ శాఖ కు అధ్యయనం కోసం పంపించాను. నాకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే సంస్కృతి మంత్రిత్వ శాఖ ఇంత తక్కువ కాలం లో ఈ సూచనల ను గంభీరం గా పట్టించుకోవడమే కాక దీని పైన అధ్యయనాన్ని కూడా చేయడం అనేది. అటువంటి సూచనలలో ఒక సూచనయే దేశ భక్తి గీతాల తో ముడిపడ్డ ఒక పోటీ అనేది. స్వాతంత్ర్య సంగ్రామం లో వేరు వేరు భాష లు, యాసల లో దేశ భక్తి గీతాలు, భజన లు దేశాన్ని ఒక్క తాటి మీద కు తెచ్చాయి. ఇప్పుడు అమృత కాలం లో, మన యువత, అలాంటి దేశ భక్తి గీతాలను వ్రాసి, ఈ పోటీ నిర్వహణ లో మరింత శక్తి ని నింపవచ్చును. దేశ భక్తి తాలూకు ఈ పాట లు మాతృభాష లో ఉండవచ్చును, జాతీయ భాష లో కూడా ఉండవచ్చును, ఇంకా ఇంగ్లిషు లోనూ రూపొందవచ్చును. కానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రచన లు న్యూ ఇండియా కు సంబంధించినటువంటి కొత్త ఆలోచనల తో కూడినవి అయి ఉండాలి; దేశ వర్తమాన సఫలత నుంచి ప్రేరణ ను అందుకొని భవిష్యత్తు కై దేశాన్ని సంకల్పించుకొనేవి గా ఉండాలి. సంస్కృతి మంత్రిత్వ శాఖ సన్నాహాలు తహసీల్ స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకూ దీనితో ముడిపడ్డ పోటీ ని నిర్వహించే దిశ లో ఉన్నాయి.

సహచరులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) తాలూకు ఒక శ్రోత ఏమని సలహా ఇచ్చారు అంటే అది అమృత్ మహాత్సవాన్ని రంగవల్లులు తీర్చే కళ తో జోడించాలి అనేది. మన దేశం లో పండుగ ల రోజుల లో రంగు రంగు ల ముగ్గును వేసే సంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తూ ఉన్నది. వర్ణ వర్ణాల ముగ్గుల లో దేశం యొక్క వైవిధ్యం కానవస్తుంది. వేరు వేరు రాష్ట్రాల లో వేరు వేరు పేరుల తో, వివిధ రకాలైన ఇతివృత్తాలపైన రంగవల్లులను వేయడం జరుగుతుంది. అందుకని, సంస్కృతి మంత్రిత్వ శాఖ దీనితో జతపడ్డ ఒక జాతీయ పోటీ ని నిర్వహించ బోతోంది. మీరే ఆలోచించండి.. స్వాతంత్ర్య సమరాని కి సంబంధించిన ముగ్గులు ఆకృతిని దాల్చాయనుకోండి, జనం వారి వారి వాకిలి ముందు, గోడల మీద స్వాతంత్ర్య ఉద్యమకారుల బొమ్మలను చిత్రీకరించారు అంటే, స్వాతంత్ర్యం తాలూకు ఏదైనా ఘటన ను రంగుల తో ప్రదర్శిస్తే, అమృత్ మహోత్సవ్ యొక్క వన్నె కూడా మరింత హెచ్చుతుంది.

సహచరులారా, మన కు లాలి పాటల ను పాడే ఇంకో కళ ను గురించి కూడా తెలుసు. మన దేశం లో జోల పాట ల ద్వారా చిన్న పిల్లల కు సంస్కారాన్ని నేర్పించడం జరుగుతుంది. సంస్కృతి ని వారికి పరిచయం చేయడం జరుగుతుంది. లాలి పాటల కు కూడా వాటిది అయినటువంటి ఓ వైవిధ్యమంటూ ఉంది. మరి ఎందుకని మనం అమృత కాలం లో ఈ కళ ను తిరిగి బతికించుకో కూడదు ? , దేశ భక్తి కి సంబంధించిన లాలి పాటలను వ్రాయండి; కవితల నో, గేయాల నో, ఏదో ఒకటి జరూరు గా వ్రాయండి, అవి ప్రతి ఇంటిలో తల్లులు వారి చిన్నారి బాలల కు ఇట్టే వినిపించే లాగా ఉండాలి. ఆ లాలిపాటల లో ఆధునిక భారతదేశం సాక్షాత్కరించాలి. ఆ లాలిపాటల లో 21వ శతాబ్దపు భారతదేశం కల లు కనపడాలి. మీ శ్రోతలు అందరు చేసిన సూచనల వల్ల మంత్రిత్వ శాఖ వీటికి సంబంధించిన పోటీలను నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

సహచరులారా, ఈ మూడు పోటీ లు అక్టోబర్ 31 న సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి సందర్భం లో మొదలు కాబోతున్నాయి. రాబోయే రోజుల లో సంస్కృతి మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంది. ఆ సమాచారం మంత్రిత్వ శాఖ యొక్క వెబ్ సైట్ లో ఉంటుంది, సోశల్ మీడియా కు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరంతా ఈ పోటీల లో పాలుపంచుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. మన యువ సహచరులు తప్పక వారి లోని కళ ను, వారి ప్రతిభ ను ప్రదర్శించాలి. దీనితో మీకు మీ ప్రాంతాని కి సంబంధించిన కళలు, సంస్కృతి దేశం లో మూల మూలల దాకా చేరుకోగలదు. మీ కథలను యావత్తు దేశం వింటుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ కాలం లో మనం అమృత్ మహోత్సవ్ లో దేశ వీరపుత్రులను, వీర పుత్రికలను వారి మహనీయ పుణ్య ఆత్మలను స్మరించుకొంటున్నాం. వచ్చే నెల లో, నవంబర్ 15 న మన దేశం యొక్క అటువంటి మహా పురుషులు, వీర యోధుడు భగవాన్ బిర్ సా ముండా గారి జయంతి రానుంది. భగవాన్ బిర్ సా ముండా గారి ని ధర్ తీ ఆభాఅని కూడా కీర్తించడం జరుగుతుంది. దీని అర్థం ఏమిటో మీకు తెలుసా ? దీనికి అర్థం ధరిత్రి పిత అని. భగవాన్ ముండా ఏ రకం గా తన సంస్కృతి, తన అడవి, తన భూమి యొక్క రక్షణ కోసం పోరాటాన్ని చేశారో, ఆ పని ని ధర్ తీ ఆబామాత్రమే చేయగలరు. ఆయన మన కు మన సంస్కృతి ని, దాని మూలాల్నీ చూసి గర్వించడం నేర్పించారు. విదేశీ పాలకులు ఆయనను ఎంతగా బెదరించినా సరే, ఎంతగా ఒత్తిడి ని తీసుకు వచ్చినా కానీ ఆయన మాత్రం ఆదివాసీ సంస్కృతి ని వదలివేయలేదు. ప్రకృతి ని, పర్యావరణాన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలంటే, కచ్చితం గా దానికి భగవాన్ బిర్ సా ముండా మనకు ప్రేరణగా నిలుస్తారు. ఆయన, పర్యావరణానికి హాని కలిగించే విదేశీ పాలనకు సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా సరే తీవ్రం గా వ్యతిరేకించారు. పేదల కు, కష్టాల చేత కమ్ముకోబడ్డ వారి కి సాయపడడానికి ఆయన ఎప్పుడూ ముందు నిలచారు. అనేక రకాలైన సామాజిక దురాచారాల ను అంతం చేయడానికి ఆయన సమాజాన్ని మేల్కొలిపారు. ఉల్ గులాన్ ఉద్యమానికి ఆయన వహించినటువంటి నాయకత్వాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు. ఆ ఉద్యమం ఆంగ్లేయుల కు మనశ్శాంతి కరవయ్యేటట్టు చేసింది. దాని తరువాత ఆంగ్లేయులు భగవాన్ బిర్ సా ముండా ని పట్టించిన వారికి చాలా పెద్ద నగదు బహుమతి ని ప్రకటించారు. బ్రిటిషు ఏలుబడి ఆయనను జైల్లో పెట్టింది. ఆయన్ని ఎంతగా వేధించారంటే పాతికేళ్ల కంటే తక్కువ వయసు లోనే ఆయన మనలపే వదలి వెళ్లిపోయారు. ఆయన మనలను వీడి వెళ్లారు గాని అది కేవలం భౌతికం గానే.

జన హృద‌యాల లో అయితే భగవాన్ బిర్ సా ముండా చిరస్థాయి గా నిలచిపోయారు. జనానికి ఆయన జీవనం ఒక ప్రేరణాత్మక శక్తి గా మారిపోయింది. ఇవ్వాళ్టికి కూడా ఆయన సాహసం, వీరత్వం నిండిన జానపద గీతాలు, కథ లు భారతదేశంలోని మధ్య ప్రాంతం లో ఎంతో ఆదరణ ను పొందుతూ ఉన్నాయి. ధర్ తీ ఆబాభగవాన్ బిర్ సా ముండా కు నేను నమస్కరిస్తున్నాను. ఆయన ను గురించి తెలుసుకోండి అంటూ యువత కు నేను మనవి చేస్తున్నాను. భారతదేశ స్వాతంత్ర్య సమరం లో మన ఆదివాసీ సమూహాల విశిష్టమైనటువంటి తోడ్పాటు ను గురించి మీరు ఎంత గా తెలుసుకొంటే, అంత గౌరవప్రదమైనటువంటి అనుభూతులు కలుగుతాయి.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజు న అక్టోబర్ 24 ను, యుఎన్ డే గా, అంటే ఐక్య రాజ్య సమితి దినం గా జరుపుకొంటాం. ఐక్య రాజ్య సమితి ని ఏర్పాటు చేసిన రోజు ఇది. ఐక్య రాజ్య సమితి ని స్థాపించిన కాలం నుంచే దీని తో భారతదేశం అనుబంధాన్ని కలిగివుంది. భారత దేశం స్వాతంత్ర్యానికి పూర్వం 1945వ సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి చార్టర్ లో సంతకం చేసిందన్న విషయం మీకు తెలుసా ?. ఐక్య రాజ్య సమితి కి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అది ఐక్య రాజ్య సమితి ప్రభావాన్ని, ఇంకా దాని శక్తి ని పెంచడానికి భారతీయ నారీ శక్తి చాలా ముఖ్యమైన భూమిక ను నిర్వహించిందన్నదే. 1947-48 లో యుఎన్ హ్యూమన్ రైట్స్ యూనివర్సల్ డిక్లరేశన్ ను రూపొందించేటప్పుడు అందులో మనుషులు అందరిని సమానం గా సృజించ‌డం జరిగింది’’ అని వ్రాశారు. కానీ భారతదేశాని కి చెందిన ఓ ప్రతినిధి దానికి అభ్యంతరం తెలిపారు. దీనితో మరి, “మానవులందరి ని సమానం గా సృజించ‌డం జరిగింది’’ అని యూనివర్సల్ డిక్లరేశన్ లో పొందుపరచడమైంది. స్త్రీ పురుష సమానత్వం అనే ఈ అంశం భారతదేశం లో శతాబ్దాల క్రితమే అమలు లో ఉంది. శ్రీమతి హంసా మెహతా ఆ ప్రతినిధి అన్న విషయం మీరు ఎరుగుదురా ? ఆవిడ వల్లే ఆ మార్పు సంభవమైంది. అదే కాలం లో మరో ప్రతినిధి శ్రీమతి లక్ష్మీ మీనన్ స్త్రీ పురుష సమానత్వం అంశం పై తన అభిప్రాయాన్ని బలం గా వ్యక్తం చేశారు. అది మాత్రమే కాక, 1953 లో శ్రీమతి విజయలక్ష్మి పండిత్ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ కు ఒకటో మహిళా అధ్యక్ష పదవి ని చేపట్టారు.

సహచరులారా, మనం ఎటువంటి పవిత్రమైన నేల కు చెందినవాళ్లమంటే, ఏమని విశ్వసిస్తాం అంటే, ఏమని ప్రార్థన చేస్తాం అంటే :

ఓం ద్యౌ: శాన్తిరన్తరిక్ష శాన్తిః,

పృధ్వీ శాన్తిరాపః శాంతిరోషధయః శాన్తిః ।

వనస్పతయః శాన్తిర్విశ్వే దేవాః శాన్తిర్బ్రహ్మమ్ శాన్తిః,

సర్వే శాన్తిః, శాన్తిరేవ శాన్తిః, సా మా శాన్తిరేధి

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ।।

భారతదేశం ఎప్పుడూ విశ్వశాంతి కోసం పాటుపడింది. మనం గర్వించదగ్గ విషయం ఏమిటి అంటే భారతదేశం 1950వ దశాబ్దం లో నిరంతరాయం గా ఐక్య రాజ్య సమితి శాంతి మిశన్ లో భాగం గా ఉంది. పేదరికం నిర్మూలన, జలవాయు పరివర్తన, ఇంకా శ్రమికుల కు సంబంధించిన సమస్య ల పరిష్కారం లో భారతదేశం అగ్రగామి భూమిక ను పోషిస్తోంది. దీనికి అదనం గా యోగా ను, ఆయుష్’ ను జనాదరణ పాత్రం గా మలచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ) తో భారతదేశం కలసి పనిచేస్తోంది. 2021వ సంవత్సరం మార్చి నెల లో డబ్ల్యుహెచ్ ఒ భారతదేశం లో సంప్రదాయ చికిత్స ను అందించేందుకు ఒక గ్లోబల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించింది.

సహచరులారా, ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఈ రోజు న అటల్ గారి మాటలు కూడా గుర్తుకు వస్తున్నాయి. 1977వ సంవత్సరం లో ఆయన ఐక్య రాజ్య సమితి లో హిందీ భాష లో ప్రసంగించి చరిత్ర ను సృష్టించారు. ఈ రోజు న నేను మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) శ్రోతల కు, అటల్ గారి ఆ ప్రసంగం లోని ఓ భాగాన్ని వినిపించాలనుకుంటున్నాను.

వినండి, అటల్ గారి ఓజస్సు నిండిన కంఠాన్ని..

ఇక్కడ నేను దేశాల అధికారాన్ని గురించి, గొప్పదనం గురించి ఆలోచించడం లేదు. సామాన్య వ్యక్తి యొక్క ప్రతిష్ఠ, ప్రగతి నాకు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. చివర కు మన సాఫల్యాలు, అసఫలతలు కేవలం ఒకే కొలమానం తో కొలవడం జరగాలి. అది ఏమిటి అంటే- మనం యావత్తు మానవ సమాజాన్ని, వస్తుత: ప్రతి ఒక్క పురుషుని కి, ప్రతి ఒక్క స్త్రీ కి, ప్రతి ఒక్క బాలుని కి లేదా ప్రతి ఒక్క బాలిక కు న్యాయం మరియు గరిమ తాలూకు హామీ ని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నామా- అనేదే.’’

సహచరులారా, అటల్ గారి ఈ మాట లు మనకు ఈ రోజు కు కూడాను దారి ని చూపుతున్నాయి. ఈ భూమి ని ఓ మెరుగైనటువంటి, సురక్షితమైనటువంటి గ్రహం గా తీర్చిదిద్దడం లో భారతదేశం యొక్క తోడ్పాటు, విశ్వం అంతటికీ చాలా గొప్ప ప్రేరణ గా ఉంది.

ప్రియమైన నా దేశ వాసులారా, కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 21 న, మనం పోలీస్ సంస్మరణ దినాన్ని జరుపుకొన్నాం. రక్షకభట దళానికి చెందిన ఏ సహచరులైతే దేశ సేవ లో వారి ప్రాణాల ను సమర్పణం చేసివేశారో, ఈ రోజు న మనం వారందరిని ప్రత్యేక సందర్భం లో స్మరించుకొంటాం. నేను ఈ రోజు న ఈ పోలీస్ సిబ్బంది తో పాటు వారి కుటుంబాలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలని అనుకొంటున్నాను. కుటుంబ సహకారం మరియు కుటుంబ త్యాగం లేనిదే పోలీస్ ఉద్యోగం వంటి కఠినమైన సేవ ను చేయడం చాలా కష్టం. పోలీస్ సేవ కు సంబంధించిన ఇంకో విషయాన్ని నేను మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) శ్రోతల కు చెప్పదలుస్తున్నాను. మొదట్లో అందరూ పోలీస్, సైన్యం లాంటి సర్వీసు లు కేవలం మగవారి కి మాత్రమే అని భావించే వారు. కానీ ఇవ్వాళ పరిస్థితి అలా లేదు. బ్యూరో ఆఫ్ పోలీస్ రిసర్చ్ ఎండ్ డెవలప్ మెంట్ లెక్క ల ప్రకారం గడచిన కొద్ది సంవత్సరాల లో మహిళా పోలీసు ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయింది. 2014 వ సంవత్సరం లో వారి సంఖ్య సుమారు ఒక లక్షా ఐదు వేలు గా ఉండేది. అదే 2020వ సంవత్సరానికల్లా, అది రెట్టింపు కంటే ఎక్కువై రెండు లక్షల పదిహేను వేల వరకూ వచ్చింది.

అంతేకాకుండా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లోనూ గడచిన ఏడు సంవత్సరాల లో మహిళా ఉద్యోగుల సంఖ్య దాదాపు గా రెట్టింపు అయింది. నేను సంఖ్య ను గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ఇప్పుడు మన దేశం లో కుమార్తె లు అత్యంత కఠినమైన విధుల ను కూడా పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలతోను, విశ్వాసం తోను నిర్వర్తిస్తున్నారు. ఉదాహరణ కు చాలా మంది పుత్రిక లు అత్యంత కఠినంగా చెప్పుకొనే శిక్షణల లో ఒకటైన స్పెశలైజ్ డ్ జంగల్ వార్ ఫేర్ కమాండోస్ తాలూకు శిక్షణ ను తీసుకొంటున్నారు. వారు మన కోబ్రా బటాల్యన్ లో భాగం కానున్నారు.

సహచరులారా, ప్రస్తుతం మనం విమానాశ్రయాల కు, మెట్రలో స్టేశన్ లకు వెళ్తేనో, లేదా ప్రభుత్వ కార్యాలయాల కు వెళ్తేనో సిఐఎస్ ఎఫ్ కు చెందిన సాహసిక మహిళ లు ప్రతి ఒక్క సున్నితమైన చోటా కాపలా ఉంటూ కనిపిస్తారు. దీని తాలూకు అన్నిటికంటే సకారాత్మకమైన ప్రభావం మన పోలీసు బలగాల తో పాటు గా సమాజం యొక్క మనోబలం పైన కూడా ప్రసరిస్తున్నది. మహిళా సురక్ష ఉద్యోగుల ఉనికి కారణం గా జనం లో, ప్రత్యేకించి మహిళల లో సహజం గానే ఒక విశ్వాసం జనిస్తుంది. వారు వారితో స్వాభావికం గా తమను జోడించుకొన్నట్లు భావిస్తారు. మహిళల తాలూకు సంవేదనశీలత కారణం గా ప్రజలు వారి పట్ల ఎక్కువ భరోసా ను కలిగి ఉంటారు. మన ఈ మహిళా పోలీస్ ఉద్యోగులు దేశం లోని ఇతర లక్షల కొద్దీ పుత్రికల కు రోల్ మాడల్ గా నిలుస్తున్నారు. బడులు తెరచిన తరువాత మీమీ ప్రాంతాల లో గల పాఠశాలల ను సందర్శించవలసిందని, అక్కడి బాలల తో మాట్లాడమని నేను మహిళా పోలీసు ఉద్యోగులకు సూచిస్తున్నాను. అలా మాట్లాడం వల్ల మన పిల్లల కు ఓ కొత్త స్ఫూర్తి లభిస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను. అది మాత్రమే కాక పోలీసుల మీద జనానికి నమ్మకం కూడా పెరుగుతుంది. ఇకపై కూడా మహిళ లు ఎక్కువ సంఖ్య లో పోలీసు ఉద్యోగాల లో చేరుతారు అని, మన దేశం లో నవ యుగం పోలీసింగ్ కు నేతృత్వం వహిస్తారని ఆశిస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా, గడచిన కొన్ని సంవత్సరాలు గా మన దేశం లో ఆధునిక సాంకేతిక విజ్ఞ‌ానం వినియోగం ఎంత వేగం గా పెరుగుతోంది అంటే, దాని ని గురించి మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) శ్రోత లు నాకు తరచూ వ్రాస్తూ ఉంటారు. అటువంటి ఓ విషయాన్ని గురించి ఈ రోజు న మీతో చర్చించాలని నేను అనుకొంటున్నాను. అది మన దేశం లో, ప్రత్యేకించి యువత లో చిన్న చిన్న పిల్లల లో పాకిపోయింది. అది ఏమిటి అంటే డ్రోన్ స్ ను గురించి, డ్రోన్ టెక్నాలజీ ని గురించి. కొన్నేళ్ల కిందటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా డ్రోన్ అనే మాట వినిపించింది అంటే జనం మనసు లో ఉత్పన్నం అయ్యే మొదటి భావన ఏమిటంటారు ? అది సైన్యం గురించిన, ఆయుధాల ను గురించిన, యుద్ధాన్ని గురించిన భావన. కానీ ప్రస్తుతం మన దగ్గర ఎక్కడైనా పెళ్లి ఊరేగింపు గాని లేదా ఏదైనా ఫంక్శన్ గాని జరిగింది అంటే మనం డ్రోన్ తో ఫోటోల ను, వీడియో ను తీసుకోవడాన్ని చూస్తున్నాం. డ్రోన్ వినియోగం, దాని శక్తి ఇంతటితోనే అయిపోలేదు. గ్రామాల లో భూమి వివరాల ను సేకరించడానికి డ్రోన్ ను వినియోగిస్తున్న దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉంది. భారతదేశం రవాణా కోసం డ్రోన్ ను వినియోగించడం పైన చాలా విస్తృత స్థాయి లో ప్రయత్నిస్తున్నది. అది గ్రామాల లో వ్యవసాయానికి సంబంధించైనా కావచ్చు లేదా ఇంటి సామాను డెలివరీకి అయినా కావచ్చు.. ఆపత్కాలం లో సహాయాన్ని అందించడానికి కావచ్చు లేదా చట్టపరమైన వ్యవస్థ కు సంబంధించి నిఘా పెట్టడానికి కావచ్చు. చాలా కొద్ది సమయం లోనే డ్రోన్ లు మనకు ఈ అవసరాలు అన్నింటికి ఉపయోగపడే రోజు వస్తుంది. వాటిలో చాలా వాటికి ఇప్పటికే డ్రోన్ ల వినియోగం ప్రారంభమైంది. ఎలాగంటే కొద్ది రోజుల కిందట గుజరాత్ లోని భావనగర్ లో డ్రోన్ ద్వారా పొలాల్లో నానో- యూరియా ని చల్లడం జరిగింది. కోవిడ్ వాక్సీన్ ఉద్యమం లో కూడా డ్రోన్ లు వాటి వంతు పాత్ర ను పోషిస్తున్నాయి. దానికి సంబంధించిన ఓ చిత్రం మనకు మణిపుర్ లో కనిపిస్తుంది. అక్కడ ఓ ద్వీపానికి టీకామందు ను డ్రోన్ ద్వారా చేరవేశారు. తెలంగాణలో కూడా డ్రోన్ ద్వారా వాక్సీన్ డెలివరీ కి ట్రయల్స్ వేశారు. ఇంతే కాకుండా, ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన తాలూకు అనేక పెద్ద ప్రాజెక్టుల లో పర్యవేక్షణ కోసం కూడాను డ్రోన్ ని ఉపయోగించడం జరుగుతోంది. డ్రోన్ సాయంతో మత్స్యకారుల జీవనాన్ని రక్షించే కార్యాన్ని నిర్వర్తించిన ఒక యువ విద్యార్థి ని గురించి నేను చదివాను.

సహచరులారా, తొలుత ఈ సెక్టర్ లో ఎన్నో నియమాలు, చట్టాలు, ఇంకా ప్రతిబంధకాలను పెట్టడం జరిగింది. దీనితో డ్రోన్ యొక్క అసలు సామర్థ్యాన్ని వినియోగించుకోవడం కూడా సాధ్యపడేది కాదు. ఏ సాంకేతికత ను అయితే ఒక అవకాశం గా చూసుకోవలసి ఉండిందో, దానిని సంకటం లాగా భావించడమైంది. ఒకవేళ మీరు దేనికోసమైనా సరే డ్రోన్ ని వాడాల్సి వస్తే లైసెన్సు లు, అనుమతులు ఎంత క్లిష్టంగా ఉండేవంటే జనం డ్రోన్ అనే పేరు ను వింటేనే లెంపలు వేసుకొనే వారు. ఈ మనస్తత్వాన్ని మార్చాలి అని, మరి కొత్త ధోరణుల ను స్వీకరించాలి అని మేము నిర్ణయించాం. అందుకే ఈ సంవత్సరం ఆగస్టు 25 న దేశం లో ఓ కొత్త డ్రోన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ విధానం డ్రోన్ కి సంబంధించి వర్తమాన అవకాశాలు మరియు భావి అవకాశాల ప్రకారం రూపొందించినటువంటిది. దీనిలో ఇప్పుడు బోలెడన్ని ఫామ్స్ ను నింపవలసిన బాధ లేదు, ఇంతకు ముందున్నంత రుసుము ను చెల్లించవలసిన అవసరం కూడా లేదు. కొత్త డ్రోన్ విధానం వచ్చిన తరువాత చాలా డ్రోన్స్ స్టార్ట్- అప్స్ లో దేశీ, విదేశీ ఇన్ వెస్టర్ లు పెట్టుబడి పెట్టారు. చాలా కంపెనీ లు తయారీ విభాగాల ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయు సేన లు భారతీయ డ్రోన్ కంపెనీల కు 500 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఆర్డర్ లను కూడా ఇచ్చాయి. మరి ఇది కేవలం ఆరంభమే. ఇక్కడే మనం ఆగిపోరాదు. మనం డ్రోన్ సాంకేతికత లో అగ్ర దేశం గా మారాలి. దాని కోసం ప్రభుత్వం చేతనైన ప్రతి చర్య ను తీసుకొంటున్నది. నేను దేశం లోని యువతీయువకుల తో అంటాను, మీరు డ్రోన్ విధానం వచ్చిన తరువాత ఎదురుపడ్డ అవకాశాల తాలూకు ప్రయోజనాల ను వినియోగించుకోవడాన్ని గురించి తప్పక ఆలోచించండి, ముందుకు రండి అని.

ప్రియమైన నా దేశ వాసులారా, ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ నుంచి ఓ మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) శ్రోత శ్రీమతి ప్రభ శుక్ల స్వచ్ఛత కు సంబంధించిన ఓ లేఖ ను పంపారు. ఆవిడ ఏమని వ్రాశారు అంటే భారతదేశం లో అన్ని పండుగల కు మనం స్వచ్ఛత ను సెలిబ్రేట్ చేసుకుంటాం. అలాగే , ఒకవేళ మనం స్వచ్ఛత ను, ప్రతి రోజూ అలవాటు గా మార్చుకొన్నాంటే గనక యావత్తు దేశం స్వచ్ఛం గా మారిపోతుంది.అని. ప్రభ గారి మాటలు నాకా చాలా బాగా నచ్చాయి. నిజంగానే, ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది; ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సామర్ధ్యం ఉంటుంది; అలాగే ఎక్కడ సామర్ధ్యం ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. అందుకే దేశం లో స్వచ్ఛ్ భారత్ అభియాన్ పైన ఇంత శ్రద్ధ ను వహించడం జరుగుతున్నది.

సహచరులారా, నాకు రాంచీ లోని ఓ గ్రామం సపారోమ్ నయా సరాయ్ గురించి తెలిసి చాలా బాగా అనిపించింది. ఈ గ్రామంలో ఓ చెరువు ఉండేది. కానీ గ్రామస్తులు ఆ చెరువు ఉన్న ప్రాంతాన్ని బహిరంగ మల మూత్రాదుల విసర్జన కు ఉపయోగించడం మొదలుపెట్టారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగం గా ఎప్పుడయితే అందరి ఇళ్ల లో టాయిలెట్ నిర్మాణం జరిగిందో ఆ ఊరి వారంతా కలసి ఆలోచించారు.. మనం ఊరి ని పరిశుభ్రంగాను, సుందరం గాను ఎందుకు తీర్చిదిద్దకూడదు అని. తరువాత ఏం జరిగిందంటే అంతా కలసి ఆ చెరువు ఉన్న ప్రాంతం లో ఓ పార్కు ను నిర్మించేశారు. ప్రస్తుతం ఆ ప్రదేశం జనాని కి, పిల్లల కు చక్కగా సేద తీరే స్థానం లా మారిపోయింది. దాని వల్ల గ్రామ జీవనం లో చాలా పెద్ద మార్పు వచ్చింది. నేను మీకు ఛత్తీస్ గఢ్ లోని దేవుర్ గ్రామాని కి చెందిన మహిళల ను గురించి కూడా చెప్పాలనుకొంటున్నాను. అక్కడి మహిళ లు ఓ స్వయం సహాయ సమూహాన్ని నడుపుతున్నారు. వారు అందరు కలసి గ్రామం లోని కూడళ్లు, వీధులు, మందిరాలను శుభ్రం చేస్తున్నారు.

సహచరులారా, ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఉన్న రామ్ వీర్ తంవర్ గారంటే జనాని కి పాండ్ మన్గానే తెలుసు. రామ్ వీర్ గారు మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన తరువాత ఉద్యోగం చేసేవారు. కానీ ఆయన మనసు లో స్వచ్ఛత కు సంబంధించిన ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే ఆయన ఆ ఉద్యోగాన్ని వదలిపెట్టేసి చెరువులను శుభ్రం చేసే పని లో పడిపోయారు. రామ్ వీర్ గారు ఇప్పటి వరకు ఎన్నో చెరువుల్ని శుభ్రం చేసి, వాటికి పునర్జీవనాన్ని ప్రసాదించారు.

సహచరులారా, స్వచ్ఛత కోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడు సఫలం అవుతాయి అంటే దేశం లోని ప్రతి ఒక్క పౌరుడు, పౌరురాలు స్వచ్ఛత కు సంబంధించి వారి వారి బాధ్యతల ను నిర్వర్తించినప్పుడే. ఇప్పుడు దీపావళి పండుగ కు మనం అందరం మన ఇళ్ల ను శుభ్రం చేసుకొంటాం కదా. ఇప్పుడు మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే మన ఇంటితో పాటుగా మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రం గా ఉంచుకోవడం. మనం మన ఇంటి ని మాత్రమే శుభ్రం చేసుకొని, మన ఇంటి లో ఉన్న చెత్త ను బయట రోడ్ల మీద పడేయకూడదు. ఇంకో విషయం, నేను స్వచ్ఛత ను గురించి మాట్లాడేటప్పుడు మనం ఒకసారి వాడే ప్లాస్టిక్ నుంచి విముక్తి ని పొందే విషయాన్ని మాత్రం మరచిపో కూడదు. రండి, స్వచ్ఛ్ భారత్ అభియాన్ యొక్క ఉత్సాహాన్ని తక్కువ కానివ్వం అంటూ మనం సంకల్పాన్ని తీసుకొందాం. మనం అందరం కలసి మన దేశాన్ని పూర్తి స్థాయి లో స్వచ్ఛం గా మార్చుదాం, మన దేశాన్ని శుభ్రం గా ఉంచుదాం.

ప్రియమైన నా దేశ వాసులారా, అక్టోబర్ నెలంతా పండుగ ల రంగుల తో నిండిపోయింది. మరి ఇప్పటి నుంచి ఇంకా కొన్ని రోజుల తరువాత దీపావళి రానే వస్తోంది. దీపావళి, ఆ తరువాత గోవర్థన పూజ, ఆనక భగినీ హస్త భోజనం.. ఈ మూడు పండుగల ను ఎలాగూ జరుపుకొంటాం. ఇదే కాలం లో ఛఠ్ పూజ కూడా ఉంటుంది. నవంబర్ లోనే గురునానక్ దేవ్ జీ జయంతి కూడా ఉంది. ఇన్ని పండుగ లు ఒకేసారి వచ్చినప్పుడు వాటి కోసం సన్నాహాలు కూడా ఎంతో ముందు నుంచే మొదలయిపోతాయి. మీరు అందరు ఇప్పటి నుంచే కొనుగోళ్ల తాలూకు ప్రణాళిక లు వేసుకొంటూ ఉండి ఉంటారు. కానీ మీకు గుర్తుంది కదూ, కొనడం అంటే అర్థం వోకల్ ఫార్ లోకల్అని. మీరు స్థానిక వస్తువులనే కొనుగోలు చేశారా అంటే గనక మీ పండుగ కూడా అత్యంత మనోహరం గా సాగుతుంది. మీరు చేసే కొనుగోళ్ల ద్వారా ఏ పేద అక్క చెల్లెళ్లో, ఏ చేతి పని వారో, ఏ చేనేత కుటుంబం ఇంట్లోనో కూడాను ప్రకాశం వస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది.. మనం అందరం కలసి ఏదయితే విధానాన్ని ప్రారంభించామో, ఈ సారి పండుగల లో అది మరింత బలవత్తరం గా మారుతుంది అని. మీరు మీ మీ ప్రాంతాల లో స్థానిక వస్తువుల ను కొనగలరు, వాటి ని గురించి సోశల్ మీడియా లో శేర్ చేయగలరు. మీతో పాటు తోటి జనాల కు కూడా తెలియజేయగలరు. వచ్చే నెల లో మనం మళ్లీ కలుసుకొందాం, మరి మళ్లీ ఇలాగే బోలెడన్ని విషయాల ను గురించి మాట్లాడుకొందాం.

మీకు అందరి కి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

***


(Release ID: 1766137) Visitor Counter : 287