ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

101.30 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 68 లక్షలకుపైగా టీకా డోసులు నిర్వహణ

98.16 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 16,326 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,73,728; ఇది 233 రోజుల కనిష్ట స్థాయి

వారపు పాజిటివిటీ రేటు ‍1.24 శాతం) గత 29 రోజులుగా 2 శాతం కంటే తక్కువ

Posted On: 23 OCT 2021 9:55AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 101.30 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 68,48,417 డోసులతో కలిపి, 101.30 కోట్ల డోసులను (1,01,30,28,411) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,00,29,602 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

 

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,78,004

రెండో డోసు

91,32,055

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,69,012

రెండో డోసు

1,56,73,375

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

40,43,88,714

రెండో డోసు

12,26,54,329

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

17,12,42,361

రెండో డోసు

8,99,14,788

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,77,01,034

రెండో డోసు

6,32,40,508

మొత్తం

1,01,30,28,411

 

గత 24 గంటల్లో 17,677 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,35,32,126 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.16 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 118వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 16,326 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,73,728 గా ఉన్నాయి. ఇది 233 రోజుల కనిష్ట స్థాయి. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.51) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి. 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 13,64,681 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 59.84 కోట్లకు పైగా (59,84,31,162) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉంది. గత 29 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.20 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 19 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 54 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

 

 

****


(Release ID: 1765933) Visitor Counter : 214