కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ ఆఫ్ వే (సవరణ) నిబంధనలు- 2021'ను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం
- డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యు) అనుమతికి సంబంధించిన విధానాలు సడలించబడ్డాయి
- నామమాత్రపు వన్-టైమ్ పరిహారం మరియు ఓవర్‌గ్రౌండ్ టెలిగ్రాఫ్ లైన్ (ఓఎఫ్‌సీ) ఏర్పాటు కోసం ఏకరీతి విధానం అమలు
- డిజిటల్ మౌలిక సదుపాయాలను స్థాపించడం, నిర్వహించడం, పని చేయడం, మరమ్మతు చేయడం, బదిలీ చేయడం లేదా బదిలీ చేయడం కోసం అడ్మినిస్ట్రేటివ్ ఫీజు, పునరుద్ధరణ ఛార్జీలు మినహా ఇతర రుసుము వసూలు చేయబడవు
Posted On:
22 OCT 2021 4:44PM by PIB Hyderabad
'ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ ఆఫ్ వే నిబంధనలు-2016' లోఓవర్‌గ్రౌండ్ టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు కోసం నామమాత్రపు వన్-టైమ్ పరిహారం , ఏకరీతి విధానానికి సంబంధించిన నిబంధనలను చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం 'ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ ఆఫ్ వే (సవరణ) రూల్స్, 2021' భారత ప్రభుత్వం 21 అక్టోబర్ 2021న నోటిఫై చేసింది, తాజాగా ఓవర్‌గ్రౌండ్ టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటుకు ఒక సారి పరిహారం మొత్తం కిలోమీటరుకు గరిష్టంగా వెయ్యి రూపాయలుగాను.. భూగర్భ టెలిగ్రాఫ్ లైన్ కోసం ఆర్ఓడబ్ల్యు అప్లికేషన్ కోసం డాక్యుమెంటేషన్ సరళతరం చేయబడింది. తాజా నిబంధనల ప్రకారం భూగర్భ మరియు ఓవర్‌గ్రౌండ్ టెలిగ్రాఫ్ మౌలిక సదుపాయాలను స్థాపించడం, నిర్వహించడం, పని చేయడం, మరమ్మతులను చేయడం, బదిలీ చేయడం లేదా బదిలీ చేయడం కోసం అడ్మినిస్ట్రేటివ్ ఫీజు, పునరుద్ధరణ ఛార్జీలు మినహా ఇతర రుసుము ఉండదు. తాజా సవరణలు దేశవ్యాప్తంగా డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులను పెంపొందించడానికి వేరేలేటెడ్ పర్మిషన్ విధానాల హక్కును సులభతరం చేస్తాయి. తాజా చర్యలతో దేశ వ్యాప్తంగా బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామీణ-పట్టణ మరియు ధనిక-పేద మధ్య డిజిటల్ విభజనకు ఒక వంతెన ఏర్పాటుగా ఉంటుంది; ఈ-గవర్నెన్స్ మరియు ఆర్థిక చేరిక బలోపేతం అవుతుంది; వ్యాపార నిర్వహిణ మరింతగా సులభం అవుతుంది; పౌరులు మరియు సంస్థల సమాచారం మరియు కమ్యూనికేషన్ అవసరాలు నెరవేరుతాయి; అంతిమంగా భారతదేశం డిజిటల్‌గా సాధికారిత ఆర్థిక వ్యవస్థ మరియు సమాజానికి మారాలనే కల వాస్తవంగా మార్చబడుతుంది.
****
(Release ID: 1765885)
Visitor Counter : 233