ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2021 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 100.59 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 15,786 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.16% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 18,641 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,35,14,449 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.51% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,75,745. ఇది 232 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.31%) గత 119 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.19%) గత 53 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 59.70 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(రిలీజ్ ఐడి: 1765677) సందర్శకుల సూచీ సంఖ్య : : 220
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam