నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
సౌర మరియు పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి అందరికీ విద్యుత్‌ను అందుబాటులో ఉంచడానికి కలిసి పనిచేయాలని విద్యుత్ మరియు ఎన్‌ఆర్‌ఈ మంత్రి ప్రపంచానికి పిలుపునిచ్చారు
"విద్యుత్ సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సదుపాయం లేని 800 మిలియన్ల మందికి ఐఎస్‌ఏ విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తుంది"అని శ్రీ ఆర్‌కె సింగ్ చెప్పారు.
అంతర్జాతీయ సోలార్ అలయన్స్ నాల్గవ జనరల్ అసెంబ్లీని శ్రీ సింగ్ ప్రారంభించారు
106 దేశాలు చర్చల్లో పాల్గొంటాయి
Posted On:
20 OCT 2021 4:59PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి మరియు అంతర్జాతీయ సౌర కూటమి అధ్యక్షుడు శ్రీ ఆర్.కె. సింగ్ అంతర్జాతీయ సౌర కూటమి నాల్గవ అసెంబ్లీకి సభ్యులు, సంతకం చేసిన దేశాలు, కాబోయే సభ్య దేశాలు, భాగస్వామి సంస్థలు మరియు ప్రత్యేక ఆహ్వానిత సంస్థలందరికీ స్వాగతం పలికారు. కొవిడ్-19 మహమ్మారి బాధితుల కోసం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని ప్రతినిధులందరినీ ఆయన అభ్యర్థించారు.
106 దేశాలు చర్చల్లో పాల్గొంటున్న ఐఎస్‌ఎ జనరల్ అసెంబ్లీ ప్రారంభ కార్యక్రమంలోని తన ప్రారంభ ప్రసంగంలో శ్రీ సింగ్ గత దశాబ్దం ప్రారంభమైనప్పటి నుండి పునరుత్పాదక ఇంధన స్వీకరణ గణనీయమైన ఊపందుకుందని చెప్పారు. సౌర శక్తి ప్రత్యేకించి ఆఫ్-గ్రిడ్ సొల్యూషన్స్‌కు దాని సరసమైన మరియు అనుకూలత కారణంగా స్థిరమైన ఇంధన శక్తికి సార్వత్రిక అందుబాటును సాధించడానికి ఇప్పుడు అత్యంత ఆచరణీయమైన ఎంపిక. మన ఇంధన రంగాలను వేగంగా డీ-కార్బనైజ్ చేయడానికి ఇది అత్యంత ఆచరణీయమైన ఎంపిక. గత కొన్నేళ్లుగా సౌరశక్తి రంగంలో భారత్ వేగంగా అడుగులు వేసింది మరియు వేగవంతమైన సామర్ధ్యంతో పాటు అదనపు మరియు సరసమైన సౌరశక్తికి భారతదేశం యొక్క నిబద్ధతకు నిదర్శనం. 2030 నాటికి 450 జిడబ్లూ ఆర్‌ఈని చేరుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. మన వద్ద 154 జిడబ్లూ ఇన్‌స్టాల్ చేయబడిన శిలాజ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా మరో 67 జిడబ్లూ నిర్మాణంలో ఉంది. భారతదేశం యొక్క ఎన్‌డిసి కింద 40 % లక్ష్యాన్ని అధిగమించడానికి దేశం యొక్క శిలాజ రహిత ఇంధనం ఆధారిత సామర్థ్యం ట్రాక్‌లో ఉందని ఆయన తెలిపారు.
విద్యుత్ అందుబాటు సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అందుబాటులో లేని 800 మిలియన్ల మందికి ఐఎస్‌ఎ విద్యుత్ అందుబాటులోకి తేగలదని చెప్పారు.
అంతర్జాతీయ సమాజాన్ని ఒకచోట చేర్చేందుకు, అందరి ప్రయత్నాలను సమన్వయపరిచేందుకు, అడ్డంకులను అధిగమించడానికి పరిపూరకరమైన ప్రయోజనాలను పొందేందుకు అంతర్జాతీయ సౌర కూటమి స్థాపించబడిందని ఆయన ఎత్తి చూపారు. అందరికీ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఎస్‌ఏ ప్రాథమిక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ప్రపంచమంతా కలిసి పనిచేయాలని మరియు సౌర మరియు పునరుత్పాదక శక్తిని ఉపయోగించి అందరికీ విద్యుత్‌ను అందుబాటులో ఉంచడానికి ఐఎస్‌ఏతో కలిసిరావాలని శ్రీ సింగ్ పిలుపునిచ్చారు.
అధ్యక్షుడు శ్రీ సింగ్ తమ ప్రారంభ వ్యాఖ్యలను అందించడానికి సహ అధ్యక్షుడిని ఆహ్వానించారు. తదనంతరం అధ్యక్షుడు శ్రీ సింగ్ యునైటెడ్ స్టేట్స్ క్లైమెట్ చేంజ్ ప్రత్యేక అధ్యక్ష ప్రతినిధి హెచ్.ఈ.మిస్టర్ జాన్ కెర్రీని ఐఎస్‌ఎ అసెంబ్లీలో తన ప్రత్యేక ప్రసంగాన్ని అందించడానికి ఆహ్వానించారు.
అంతర్జాతీయ సౌర కూటమిని సెక్రటరీ కెర్రీ ప్రశంసించారు. ప్రపంచ స్వచ్ఛమైన ఇంధన మార్పును ముందుకు తీసుకెళ్లడానికి వారి సహకారంతో భారతదేశం, ఫ్రాన్స్ మరియు ఐఎస్‌ఏ అసెంబ్లీ సభ్య దేశాల నాయకత్వాన్ని ప్రశంసించారు: " భారతదేశం ఐఎస్‌ఏకి నాయకత్వం వహించడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. భారతదేశం సన్నిహిత భాగస్వామి మరియు 2030 నాటికి 450 జిడబ్లూ పునరుత్పాదక శక్తిని చేరుకోవాలన్న భారతదేశం యొక్క లక్ష్యానికి అమెరికా గట్టి మద్దతు ఇస్తుంది. ఇది ఖచ్చితంగా చేయదగినదని మరియు పూర్తి చేయబడుతుందని మేము నమ్ముతున్నాము. 100 జిడబ్లూ పునరుత్పాదక వనరులను చేరుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు భారతదేశం ఇప్పటికే ఒక ఉదాహరణగా నిలిచింది. భారతదేశం తన తక్కువ ధర సౌర వేలం ద్వారా ప్రదర్శించినది మరియు ప్రసార గ్రిడ్‌లు మరియు భారీ సౌర భాగాల కార్యక్రమం మరియు ఇతర వినూత్న విధాన సాధనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబిస్తుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో ఐఎస్‌ఏ కీలకమైనదని మరియు ప్రపంచంలోని బలమైన సూర్యకాంతితో ఆశీర్వదించబడిన సభ్య దేశాలతో సౌర వృద్ధిని వేగవంతం చేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు.
భారతదేశం-యుఎస్ సంబంధాల గురించి ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్‌కు భారతదేశాన్ని పెట్టుబడి గమ్యంగా పేర్కొన్నారు. భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్ వరకు సౌర విద్యుత్ను విస్తరించే ప్రముఖ దేశాలు పునరుత్పాదక మధ్యంతరతను సమతుల్యం చేయడానికి ఇంధన నిల్వ అవసరాన్ని చూస్తున్నాయి. సౌరశక్తి యొక్క పూర్తి విలువను ఉపయోగించుకోవాలంటే దేశాలు నిల్వ, గ్రిడ్ మౌలిక సదుపాయాలలో మరియు డిమాండ్ మరియు సరఫరా రెండింటిలోనూ పెట్టుబడి పెట్టాలి. మరియు ప్రస్తుతం విద్యుత్తును ఉపయోగించని ఆర్థిక వ్యవస్థలోని భాగాలతో సౌరశక్తిని అనుసంధానించడానికి, దేశాలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలలో పెట్టుబడులు పెట్టాలి మరియు సౌరశక్తిని ఉపయోగించి ఉత్పత్తి చేయగల హైడ్రోజన్ వంటి శుభ్రమైన ఇంధనాలను ఉపయోగించాలి అని చెప్పారు.
యూరోపియన్ గ్రీన్ డీల్ కోసం యూరోపియన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్-వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ ఫ్రాన్స్ టిమ్మర్‌మన్స్ ఐఎస్‌ఏ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి యూరోపియన్ యూనియన్ మద్దతును ధృవీకరించారు. ఈయూ, ఈయూ సభ్య దేశాలు, మరియు ఈయూ అకాడెమిక్, బిజినెస్ మరియు ఫైనాన్షియల్ కమ్యూనిటీలను అంతర్జాతీయ సోలార్ అలయన్స్‌తో మరింత బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుని ఈయూ నిధులతో దాదాపు 1 మిలియన్ యూరోల విలువైన ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
***
(Release ID: 1765362)
Visitor Counter : 187