శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఈశాన్య భారతదేశాన్ని బయో ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు


ఈశాన్య ప్రాంతం యొక్క మొత్తం అభివృద్ధి కోసం పంటలు , పండ్లు మరియు మొక్కల పరిశోధనలో డిబిటి ప్రాజెక్టులను సమీక్షించడానికి ఇంఫాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో-రిసోర్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (ఐబిఎస్‌డి) ని సందర్శించారు

బయోటెక్నాలజీ జోక్యాల ద్వారా ఈ ప్రాంతం మరియు దేశం యొక్క ఆర్థిక వృద్ధికి జన్యు వనరులను ఉపయోగించాలని మంత్రి పిలుపునిచ్చారు

Posted On: 19 OCT 2021 4:18PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌) సైన్స్ & టెక్నాలజీ; మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ (ఇండిపెండెంట్ ఛార్జ్) ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్‌  పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈశాన్య భారతదేశంబయో-ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చేయబడుతుందని చెప్పారు.

మంత్రి మాట్లాడుతూ "తూర్పు హిమాలయ ప్రాంతం మెగా-బయోడైవర్సిటీ రిచ్ జోన్లలో ఒకటి. అంతేకాకుండా ప్రపంచంలోని 34 జీవవైవిధ్య హాట్‌స్పాట్లలో ఒకటి. బయోటెక్నాలజీ జోక్యాల ద్వారా ఈ ప్రాంతం మరియు సాధారణంగా దేశం యొక్క ఆర్ధిక వృద్ధికి ఈ అమూల్యమైన జన్యు వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని" చెప్పారు. ఇంఫాల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో-రిసోర్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (ఐబిఎస్‌డి) ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ " మోదీ ప్రభుత్వం యొక్క స్థిరమైన మరియు పునరుద్ధరించబడిన సంకల్పం కారణంగా 2025 నాటికి భారతదేశం గ్లోబల్ బయో-తయారీ కేంద్రంగా గుర్తించబడుతుందని మరియు ప్రపంచంలోని టాప్ 5 దేశాలలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. భారతదేశ బయో ఎకానమీ 2025 నాటికి ప్రస్తుత 70 బిలియన్ డాలర్ల నుండి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు సాగుతోందని, 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై ప్రధాన మంత్రి దృష్టికి సమర్థవంతంగా దోహదపడుతుందని ఆయన అన్నారు.



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఈశాన్య ప్రాంతంలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించిందని, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి మరియు సామాజిక అభ్యున్నతికి కార్యక్రమాలను అమలు చేయడానికి బయోటెక్నాలజీ పరిశోధన చేయడానికి సంస్థ కృషి చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతంలోని స్థానిక  మొక్కలు, వన్యప్రాణులు మరియు సూక్ష్మజీవుల వనరుల యొక్క ఒక జన్యు సంపదకు నెలవని చెప్పారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఐబిఎస్‌డి అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాంతంలో అత్యుత్తమ కేంద్రంగా మారడమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఉపాధి కల్పనకు సాంకేతిక ప్యాకేజీలను రూపొందించాలని అన్నారు. ఇన్స్టిట్యూట్ ప్రజలే ముఖ్యంగా ఉండాలి మరియు దాని పని ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి ఊహాత్మక మరియు వినూత్నమైన విధానాలను అనుసరించాలి. ఈ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ, ఉత్పత్తులు మరియు పరిశోధన కార్యక్రమాలు మరియు వాణిజ్యీకరణ కోసం శక్తివంతమైన, క్రియాశీల మరియు నిబద్ధత కలిగిన కేంద్రంగా అవతరించాలని మరియు ఈశాన్య ప్రాంతమంతా సంతోషాన్ని కలిగించడానికి ఈ ప్రాంతంలోని గొప్ప జీవ వనరుల ఆధారంగా వ్యాపారాలను ప్రోత్సహించాలని మంత్రి పేర్కొన్నారు.

 



డాక్టర్ జితేంద్ర సింగ్ ఐబిఎస్‌డి  వద్ద డిబిడి నిధులతో ఫైటో-ఫార్మాస్యూటికల్ ల్యాబ్ ఫెసిలిటీ ఈశాన్య ప్రాంతంలోని ఫైటో-ఫార్మాస్యూటికల్ మిషన్‌ని ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మిషన్ సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పద్ధతుల డాక్యుమెంటేషన్, శాస్త్రీయ ధ్రువీకరణ మరియు మూల్యాంకనాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంది. అంతే కాకుండా ఈశాన్య ప్రాంతాల విస్తారమైన మొక్కలు వనరులు మరియు విభిన్న సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పద్ధతుల నేపథ్యంలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. స్థానిక జీవ వనరులతో ఉత్పత్తులు, ప్రక్రియలు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో పరివర్తన విధానాలు సంప్రదాయ జ్ఞాన ఆధారిత చికిత్సా ఏజెంట్ల అభివృద్ధికి తోడ్పడతాయని, ఈ ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి అలాగే సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ అభ్యాసకులకు ప్రయోజనాలు అందిస్తాయని ఆయన అన్నారు.

వివిధ విజయవంతమైన కార్యక్రమాలకు ఉదాహరణలు ఇస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ " బయో-వనరుల అభివృద్ధి కేంద్రంలో సంయుక్తంగా మేఘాలయలోని రైతుల క్షేత్రాలలో అధిక-నాణ్యత సామగ్రిని ఉపయోగించి స్థిరమైన వ్యవసాయ-సాంకేతిక జోక్యాలతో స్ట్రాబెర్రీ సాగు యొక్క పైలట్ ప్రాజెక్టులకు డిబిటి సహకారం అందించింది., షిల్లాంగ్  ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టెక్నాలజీ, మందిరా, మణిపూర్‌లో సుమారు 50 రకాల టిష్యూ-కల్చర్  ఎలైట్ రకాల స్ట్రాబెర్రీ మొక్కలను రైతులకు పంపిణీ చేయాలని ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు.

అదేవిధంగా షూట్ టిప్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ ద్వారా నాణ్యమైన నాట్ల సామగ్రిని ఉత్పత్తి చేయడం ద్వారా ముఖ్యమైన పండ్ల పంట అయిన ఖాసి మాండరిన్‌లో ఉత్పత్తి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి డిబిటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రాజెక్ట్ యొక్క మూడు సంవత్సరాల వ్యవధిలో ఖాసి మాండరిన్ మరియు స్వీట్ ఆరెంజ్ యొక్క నాలుగు లక్షల ధృవీకరించదగిన వ్యాధి రహిత నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయడం మరియు ఈ ప్రాంతంలో కనీసం 1,000 మంది రైతుల సామర్థ్యాన్ని నిర్మించడం ఈ కార్యక్రమం లక్ష్యం. అస్సాంలోని తిన్సుకియాలోని ఏఏయు- సిట్రస్ రీసెర్చ్ స్టేషన్‌లో యాభై మొక్కల ఖాసి మాండరిన్ ఉత్పత్తి చేయబడింది మరియు మణిపూర్ రాష్ట్రంలో రైతులకు అందజేయబడుతుందని మంత్రి తెలియజేశారు.

అస్సాం రాష్ట్రంలో అధిక డిమాండ్ ఉన్న మాల్‌భోగ్ అరటి యొక్క నాణ్యమైన నాట్ల సామగ్రిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి కహీకుచిలోని అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏఏయు) లోని హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌లో డిబిటి బయోటెక్-కిసాన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. మణిపూర్ రైతులకు సుమారు 50 మాక్రో ప్రోపగేటెడ్‌ మాల్‌బోగ్ అరటిపండ్లను పంపిణీ చేయాలని ఇందులో ప్రతిపాదించారు.


           

<><><><><>



(Release ID: 1765003) Visitor Counter : 202