ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కోవిడ్ వ్యాక్సినేషన్ స్థితిగతులపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్ష
తగినంత మోతాదులో అందుబాటులో ఉన్న నేపథ్యంలో టీకాల రెండవ మోతాదు కవరేజీపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
అంతర్జాతీయ ప్రయాణం కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించడంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి సూచనల స్వీకరణ
Posted On:
19 OCT 2021 11:23AM by PIB Hyderabad
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్హెచ్ఎం ఎండీలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ కోవిడ్ 19 టీకా పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా సమీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అతిపెద్ద కసరత్తుల్లో ఒకటి అయిన కోవిడ్ 19 టీకా కార్యక్రమం, దేశవ్యాప్తంగా 16 జనవరి 2021 న గౌరవనీయ ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశం బిలియన్ డోస్‌ల టీకాను వేసిన సంరంభానికి దగ్గరగా ఉన్నందున, పౌరులందరికీ టీకాలు వేయడానికి చేసిన కృషికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఆరోగ్య కార్యదర్శి అభినందించారు. అర్హత ఉన్న గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు ఇంకా తమ 2 వ మోతాదును అందుకోలేదని ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండవ టీకా మోతాదుపై దృష్టి పెట్టాలని కోరారు.
2 వ మోతాదు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు టీకాలు వేయడానికి అనేక రాష్ట్రాలు తగిన మోతాదులను కలిగి ఉన్నాయని సూచించారు. భారతదేశం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు టీకా మోతాదులను అందించే స్థితిలో ఉంది, తద్వారా వారు పైన పేర్కొన్న పనిని పూర్తి చేయవచ్చు. వేగాన్ని పెంచడానికి మరియు టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు.
కేంద్రీకృత చర్యల కోసం తక్కువ కవరేజ్ ఉన్న జిల్లా లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. సమీకరణ ప్రయత్నాలు, స్థానిక సవాళ్లను పరిష్కరించడం, అదనపు కోవిడ్ టీకా కేంద్రాల అవసరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెస్ మెరుగుపరచడం కోసం అన్వేషించాలని సూచించారు. రెండవ డోస్ కవరేజీని మెరుగుపరచడానికి తమ వ్యూహాలను పంచుకోవాలని కూడా వారు అభ్యర్థించారు. అంతర్జాతీయ ట్రావెల్ కోసం గత ఏడాది కాలంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ ఎస్ఓపిలను జారీ చేసింది.
****
(Release ID: 1765002)
Visitor Counter : 216