ఆయుష్

గాంధీధామ్‌లో 'ఆయుష్ వాన్' ను ప్రారంభించిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 19 OCT 2021 6:42PM by PIB Hyderabad

గాంధీనగరంలోని దీనదయాళ్ పోర్ట్ ట్రస్ట్ (డీపీటీ) - రోటరీ ఫారెస్ట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అట‌వీ ఆయుర్వేద మొక్కల కోసం ఏర్పాటు చేయ‌బ‌డిన  ఆయుష్ వ‌న్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ల మంత్రి  శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఆయుష్ వ‌న్ 30 ఎకరాల స్థలంలో డీపీటీ ద్వారా గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది, ఇక్కడ పట్టణ ప్రాంతంలో పచ్చదనాన్ని మెరుగుపరచడానికి మరియు కచ్ ప్రాంతంలో చెట్ల సాంద్రతను పెంచడానికి ఈ చెట్ల పెంపకం జరుగుతోంది. ఆయుష్ వ‌న్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి ఇక్క‌డ ఒక మొక్కను నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి ఆయుష్ వ‌న్‌ అభివృద్ధిలో భాగ‌స్వాములైన వారిని ప్రశంసించారు. భారతదేశంలో ఔషధ మొక్కల ల‌భ్య‌త‌కు గ‌ల భారీ సామర్థ్యాన్ని మరియు వాటివ‌ల్ల క‌లుగుతున్న ప్రయోజనాలను గురించి కేంద్ర మంత్రి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశ సాంప్రదాయ వైద్య వ్యవస్థల సామర్థ్యాన్ని గ్రహించడంలో చేపట్టిన పనులను కూడా మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆయుష్ ప్రపంచ స్థాయికి చేరుకుంద‌న్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన మెరుగైన జీవ‌న విధానాల‌  ప్రధాన వ్యవస్థలలో ఆయుష్ ఒకటిగా మారిందని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో కచ్ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు శ్రీ వినోద్ చావడా,  గాంధీధాం శాస‌న స‌భ్యుడు శ్రీమతి మాల్తీ మహేశ్వరి, ఇత‌ర అధికారులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
                                                                                             

***



(Release ID: 1764954) Visitor Counter : 182