పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈశాన్య భారతదేశంలో వైమానిక కనెక్టివిటీని విస్తరించే 6 మార్గాలను వర్చువల్‌గా ప్రారంభించారు.

Posted On: 18 OCT 2021 1:39PM by PIB Hyderabad

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, ఎంఓఎస్‌, పౌర విమానయానం, జనరల్ డాక్టర్ వి.కె సింగ్ (రిటైర్డ్) శ్రీ రాజీవ్ బన్సల్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసిఎం) సెక్రటరీలు ఈశాన్య భారతదేశంలో వైమానిక అనుసంధానాన్ని విస్తరిస్తూ 6 మార్గాలను వర్చువల్‌గా ప్రారంభించారు. నేటి నుండి కార్యకలాపాలు ప్రారంభమయ్యే మార్గాలు కోల్‌కతా - గౌహతి, గౌహతి - ఐజ్వాల్, ఐజ్వాల్ - షిల్లాంగ్, షిల్లాంగ్ - ఐజ్వాల్, ఐజ్వాల్ - గౌహతి మరియు గౌహతి - కోల్‌కతా.

 

 


డాక్టర్ ఆర్. లాల్తాంగ్లియానా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ, ఉన్నత మరియు సాంకేతిక విద్య, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ. రాబర్ట్ రోమావియా రాయిట్, రాష్ట్ర క్రీడలు మరియు యువజన సర్వీసులు, పర్యాటక మరియు సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ సహాయ మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ముఖ్యమైన సభ్యులు మిజోరాంలోని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంఓసిఎలో జరిగిన ఈ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఉషా పాధీతో పాటు ఎంఓసిఎం ఇతర సీనియర్ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మిజోరం ఈశాన్య భారతదేశానికి ముఖద్వారంగా ఉంది. ఈ నగరం పర్యాటక మరియు ఆర్థిక రంగానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి రాష్ట్ర విశిష్టతను దేశ పౌరులందరూ తప్పనిసరిగా అనుభవించేలా చేయాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్‌కు రెక్కలు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. నేను మీకు హామీ ఇస్తున్నాను, ఎంఓఎస్‌ జనరల్ డాక్టర్ వి కె సింగ్ (రిటైర్డ్) మరియు నేను త్వరలో మిజోరామ్‌ని వ్యక్తిగతంగా సందర్శిస్తాను." అని తెలిపారు.
మరిన్ని ఆంశాలపై మంత్రి మాట్లాడుతూ"అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఏటిఆర్‌ విమానాలు ఎక్కువ సంఖ్యలో ఈశాన్య మార్గాలలో మోహరించబడిన వాస్తవాన్ని పేర్కొనడం ఆనందంగా ఉంది. ఈ రోజు మేము 4 నగరాలను ఒకే విమానంతో అనుసంధానించడం ద్వారా ఈశాన్య భారతదేశం అంతటా కనెక్టివిటీని మరింతగా ఏర్పాటు చేస్తున్నాము. ఇది మన ప్రధాన మంత్రి నాయకత్వంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఉడాన్ పథకం కింద దేశ విమానయాన పటంలో ప్రస్తావించని నగరాలను మేము కనెక్ట్ చేశాము. మేము ఇప్పటికే 60 విమానాశ్రయాలు మరియు 387 రూట్‌లను ప్రారంభించాము, వీటిలో 100 రూట్‌లు ఈశాన్య ప్రాంతంలో మాత్రమే ఇవ్వబడ్డాయి వాటిలో 50 ఇప్పటికే పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, 2014 లో ఈశాన్య ప్రాంతంలో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే పనిచేశాయి, ఇప్పుడు మేము 7 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో 15 విమానాశ్రయాలకు ఆ సంఖ్య పెంచబడింది. అందువల్ల, ఈ ప్రభుత్వానికి ఈశాన్య రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యతను ఇది మరింత హైలైట్ చేస్తుంది. దీనితో పాటుగా, క్రిషి ఉడాన్ యోజన కింద సరుకు రవాణా మరియు ఎగుమతుల మెరుగుదల ద్వంద్వ ప్రయోజనాలను స్థాపించే ప్రాంతం యొక్క ఎగుమతి అవకాశాలను మెరుగుపరచడానికి మేము 16 విమానాశ్రయాలను గుర్తించాము.."అని తెలిపారు.
నేటి కార్యక్రమం ఇప్పటివరకు విమానాల ద్వారా కనెక్ట్ చేయబడని బహుళ రాష్ట్రాలను అనుసంధానించడం ద్వారా ఈశాన్య వైమానిక కనెక్టివిటీని విస్తరించింది. ఈ మార్గాల్లో విమాన కనెక్టివిటీ స్థానికుల నుండి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్. తూర్పు భారతదేశం పర్యాటకులను అద్భుతమైన పచ్చని లోయలు, కొండ ప్రవాహాలు, పచ్చని అడవులు, విశాలమైన టీ గార్డెన్‌లు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, శక్తివంతమైన నదులు, గిరిజన సంస్కృతి, దాని రంగురంగులని ఇది ఆకర్షిస్తుంది.
ప్రకృతి ప్రేమికులు, ప్రయాణికులు, పర్యాటకులు మొదలైన వారికి ఈ విమానాలు ఇబ్బందులు లేని ప్రయాణానికి అవకాశం కల్పిస్తాయి. షిల్లాంగ్ చుట్టూ అన్ని వైపుల అందమైన కొండలు ఉన్నాయి. ఈ నగరం అనేక ప్రసిద్ధ విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందింది. ఇది మొత్తం ఈశాన్య భారతదేశానికి విద్య కేంద్రంగా ఉంది. అందం మరియు విద్యా కేంద్రంగానే కాకుండా షిల్లాంగ్ మేఘాలయ ముఖద్వారంగా కూడా పనిచేస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షపాతం, గుహలు, ఎత్తైన జలపాతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు దాని గొప్ప వారసత్వం & సంస్కృతికి ప్రసిద్ధి. ఐజ్వాల్ హైలాండ్స్ నివాసంగా పిలువబడుతుంది. మరియు ఇంది గొప్ప గిరిజన సాంస్కృతిక వేడుకలకు కేంద్రంగా ఉంది మరియు ఇది హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది.

ఈ కొత్త విమాన సర్వీసులతో గౌహతి, ఐజ్వాల్ మరియు షిల్లాంగ్ నుండి వచ్చే ప్రయాణికులు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం బహుళ ఎంపికలను పొందుతారు.
దేశ ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి నిరంతర చేస్తున్న ప్రయత్నాల్లో  భాగంగా దేశంలోని అత్యుత్తమ వారసత్వ నగరాలలో ఒకదాన్ని దేశ రాజధానితో కలుపుతూ నిన్న తిరుపతి-ఢిల్లీ మార్గంలో మొదటి డైరెక్ట్‌ విమానాన్ని కూడా ప్రారంభించారు.

19 వ అక్టోబర్ -21 నుండి అమలులోకి వచ్చే షెడ్యూల్ క్రింద పేర్కొనబడింది:

 

 

Flt No.

From

To

Frequency

Departure Time

Arrival Time

Aircraft Type

Effective From

9I 755

Kolkata

Guwahati

Mon, Tues, Thurs & Sat

0750

0920

ATR72

19-Oct-21

9I 755

Guwahati

Aizawl

Mon, Tues, Thurs & Sat

0950

1045

ATR72

19-Oct-21

9I 755

Aizawl

Shillong

Mon, Tues, Thurs & Sat

1115

1215

ATR72

19-Oct-21

9I 756

Shillong

Aizawl

Mon, Tues, Thurs & Sat

1245

1345

ATR72

19-Oct-21

9I 756

Aizawl

Guwahati

Mon, Tues, Thurs & Sat

1410

1510

ATR72

19-Oct-21

9I 756

Guwahati

Kolkata

Mon, Tues, Thurs & Sat

1555

1725

ATR72

19-Oct-21

 



(Release ID: 1764713) Visitor Counter : 247