ఆర్థిక మంత్రిత్వ శాఖ

డిజిటల్ మార్కెటింగ్, వ్యర్ధాల నిర్వహణ యాజమాన్య రంగంలో ఉన్న రెండు సంస్థలపై దాడులు నిర్వహించిన ఆదాయం పన్ను అధికారులు

Posted On: 17 OCT 2021 11:54AM by PIB Hyderabad

వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సంస్థలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు 12.102021 న దాడులు ప్రారంభించి సోదాలు చేపట్టారు.

డిజిటల్ మార్కెటింగ్ప్రచార కార్యక్రమాల రంగంలో ఉన్న ఒక సంస్థకి బెంగళూరుసూరత్చండిగార్మొహాలిలలో ఉన్న కార్యాలయాలపై అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. 

డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించి సంస్థ అక్రమ మార్గాల్లో వసతి నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని సోదాలలో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను అధికారులు సేకరించారు. సంస్థకి చెందిన నగదుఅక్రమ  ఆదాయాన్ని హవాలా ఆపరేటర్ల ద్వారా తరలించడానికి తాను సహకరించినట్లు  ఆపరేటర్ అంగీకరించాడు. 

సంస్థ ఖర్చులను ఎక్కువ చేసి చూపడంఆదాయాన్ని తగ్గించి చూపడం చేసిందని కూడా అధికారులు గుర్తించారు.లెక్కల్లో చూపకుండా సంస్థ నగదు చెల్లింపులను చేసిందని వెల్లడయింది. డైరెక్టర్ల వ్యక్తిగత ఖర్చులను వ్యాపార ఖర్చులుగా లెక్కల్లో చూపించారు. సంస్థ డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యులు ఉపయోగిస్తున్న విలాసవంతమైన వాహనాలను  సంస్థ సిబ్బందిడేటా ఎంట్రీ ఆపరేటర్ పేర్ల మీద కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. 

ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన రెండవ సంస్థ వ్యర్ధాల నిర్వహణా రంగంలో కార్యకలాపాలను సాగిస్తోంది. వివిధ మునిసిపాలిటీల్లో వ్యర్ధాల సేకరణరవాణాశుద్ధితొలగింపు కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. 

ఆదాయం పన్ను శాఖ అధికారాలు నిర్వహించిన సోదాలలో వివిధ అక్రమాలకు సంబందించిన పత్రాలుకాగితాలుడిజిటల్ సాక్ష్యాలు లభ్యమయ్యాయి. ఖర్చులుసబ్ కాంట్రాక్టుల అంశంలో సంస్థ తప్పుడు బిల్లులను సృష్టించినట్టు అధికారులు గుర్తించారు. 70 కోట్ల రూపాయల విలువ చేసే తప్పుడు బిల్లులను సంస్థ సృష్టించి సంస్థ అక్రమాలకు పాల్పడినట్టు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 

లెక్కలు చూపని దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే సంస్థ పెట్టుబడులను అధికారులు గుర్తించారు. వీటితో పాటు అధికారులు లెక్కలు చూపని 1.95 కోట్ల రూపాయల నగదు, 65 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

రెండు కేసులలో విచారణ కొనసాగుతోంది. 



(Release ID: 1764519) Visitor Counter : 149