ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో ఆదాయం పన్ను శాఖ దాడులు : లెక్కలు చూపని 184 కోట్ల రూపాయలకు పైగా లెక్కలు చూపని ఆదాయం గుర్తింపు

Posted On: 15 OCT 2021 3:18PM by PIB Hyderabad

మహారాష్ట్ర ముంబైలో ఆదాయం పన్ను శాఖ అధికారులు రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలువాటితో సంబంధం ఉన్న వ్యక్తులుసంస్థలపై దాడులు జరిపి సోదాలు నిర్వహించింది. 07.10.2021 న ప్రారంభమైన ఈ దాడులుసోదాలు ముంబైపూణేబారామతి,గోవాజైపూర్ లలో 70 ప్రాంతాలలో జరిగాయి. 

లెక్కలు చూపని లావాదేవీలనుబినామీ వ్యవహారాలను నడిపినట్టు అధికారుల దాడుల్లో సాక్ష్యాలు లభించాయి. రెండు సంస్థలు దాదాపు 184 కోట్ల రూపాయల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదు. దీనికి సంబంధించిన పత్రాలనుఇతర సాక్ష్యాలను అధికారులు సేకరించారు. 

ఈ వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను వెబ్ కంపెనీలతో సాగించాయని అధికారులు గుర్తించారు. అయితేఅధికారులు జరిపిన పరిశోధనల్లో ఈ వెబ్ కంపెనీలు నకిలీవని వెల్లడయింది. వాటాలకు ప్రీమియం ఉన్నట్లు చూపించడం,హామీ లేని రుణాలుకొన్ని సేవలకు ఆధారాలు లేని అడ్వాన్స్ లు తీసుకోవడంఎలాంటి వివాదం లేని అంశాలకు మధ్యవర్తిత్వం నడపడం లాంటి విధానాల ద్వారా ఈ ఎండు సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో పరపతి కలిగిన ఒక కుటుంబం సహకారంతో ఈ రెండు సంస్థలు తమ అక్రమ లావాదేవీలను నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. 

అక్రమ మార్గాల ద్వారా పొందిన ఆదాయంతో రెండు సంస్థలు ఆస్తులను కొనుగోలు చేశాయి. అక్రమ ఆదాయంతో ముంబై లోని ప్రధాన ప్రాంతంలో కార్యాలయ భవనాన్నిఢిల్లీలో విలాసవంతమైన ప్రాంతంలో ఒక ఫ్లాట్గోవాలో రిసార్ట్మహారాష్ట్రలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సంస్థలు చెక్కెర కర్మాగారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు  అధికారులు గుర్తించారు.  ఈ ఆస్తులుపెట్టుబడుల వాస్తవ విలువ 170 కోట్ల వరకు ఉంది. 

అధికారులు తమ సోదాల్లో 2.13 కోట్ల రూపాయల నగదు, 4.32 కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

కేసులో అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. 

***

 


(Release ID: 1764321) Visitor Counter : 141