పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఈ ఏడాది పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ లోని 8 జాతీయ రాజధాని ప్రాంత జిల్లాలలో గణనీయంగా తగ్గిన వరి అవశేషాల దగ్ధం సంఘటనలు 2021 తో పోలిస్తే ఈ ఏడాది తక్కువ సంఘటనలు
గత నెలలో 1795 అగ్ని ప్రమాదాలు నమోదు; గత ఏడాది ఇదే సమయంలో వీటి సంఖ్య 4854 గా ఉంది
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రూపొందించిన కార్యాచరణ కార్యక్రమాన్ని రోజువారీగా పర్యవేక్షిస్తున్న కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్
డిప్యూటీ కమిషనర్ తో సహా హర్యానా,పంజాబ్,ఉత్తరప్రదేశ్ అధికారులతో తరచూ సమావేశం అవుతున్న కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్
Posted On:
15 OCT 2021 1:42PM by PIB Hyderabad
ప్రస్తుత పంట కాలంలో పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ లోని 8 జాతీయ రాజధాని జిల్లాలలో రైతులు వరి అవశేషాలను దగ్ధం చేయకుండా చూడడానికి కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చర్యలను అమలు చేస్తున్నది. వరి అవశేషాలను దగ్ధం చేయడం వల్ల కలిగే వాతావరణ కాలుష్యాన్ని నివారించి, గాలి నాణ్యతను రక్షించడానికి సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ చర్యలను అమలు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం ఇస్రో సేకరించిన సమాచారం ప్రకారం వరి అవశేషాలను దగ్ధం చేసే సంఘటనలు పంజాబ్ లో 69.49%, హర్యానాలో 18.28%, ఉత్తరప్రదేశ్ లోని 8 జాతీయ రాజధాని ప్రాంత జిల్లాలలో 47.61% వరకు తగ్గాయి. గత నెలలో చోటు చేసుకున్న సంఘటనలను గత ఏడాది ఇదే నెలలో నమోదైన సంఘటనలతో పోల్చి చూసి ఇస్రో ఈ వివరాలను రూపొందించింది.
ప్రస్తుత సంవత్సరం ఒక నెల కాలంలో పంజాబ్ లో 1286 వరి అవశేషాలను దగ్ధం అయినట్టు గుర్తించారు. గత ఏడాది ఇదే సమయంలో ఇటువంటి సంఘటనలు 4216 వరకు నమోదు అయ్యాయి. హర్యానాలో ఈ ఏడాది 487 సంఘటనలు నమోదు కాగా గత ఏడాది ఇదే సమయంలో 596 సంఘటనలు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్ పరిధిలో ఉన్న 8 జాతీయ రాజధాని ప్రాంత జిల్లాల్లో ఈ గత ఏడాది 42 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది 22 సంఘటనలు నమోదు అయ్యాయి.
ఢిల్లీ, రాజస్థాన్ లోని రెండు రాజధాని ప్రాంత జిల్లాల్లో ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదు. పంజాబులో సెప్టెంబర్ 16 న, హర్యానాలో 28 న, ఉత్తరప్రదేశ్ రాజధాని ప్రాంత జిల్లాలో 18 న ఈ ఏడాది అవశేషాలను దగ్ధం చేసినట్టు నమోదయ్యింది.
పంజాబ్ లోని అమృతసర్, త్రన్ తరన్, పాటియాలా, లూథియానా ప్రాంతాల్లో వరి అవశేషాలను ఎక్కువగా దగ్ధం చేస్తుంటారు. మొత్తం సంఘటనల్లో 72% ఈ ప్రాంతాల నుంచి నమోదవుతుంటాయి. హర్యానాలో కర్నాల్, కైతాల్, కురుక్షేత్ర ప్రాంతాలు అవశేషాలను ఎక్కువగా దగ్ధం చేసే ప్రాంతాలుగా గుర్తించారు. మొత్తం సంఘటనలో ఈ మూడు జిల్లాల నుంచి 80% వరకు నమోదవుతున్నాయి.
వరి అవశేషాలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్మూలించడానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరుపుతూ దేనికోసం రూపొందిన కార్యాచరణ ప్రణాళిక అమలు జరిగేలా చర్యలను అమలు చేస్తున్నది. దీనిపై పంజాబ్, హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అధికారులు, జిల్లా కలెక్టర్లు/ జిల్లా మేజిస్ట్రేట్‌లతో కమిషన్ అఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తరచు సమావేశాలను నిర్వహిస్తోంది.
2021 సెప్టెంబర్ 14 నాటికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 1795 ప్రాంతాల్లో అవశేషాలను దగ్ధం చేసినట్టు సమాచారం అందింది. వీటిలో 663 ప్రాంతాలను సంబంధిత రాష్ట్రాల అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తనిఖీ చేసి 252 పర్యావరణ పరిహార కేసులను నమోదు చేశారు.
రానున్న కొన్ని వారాల్లో పంటల కోత ఎక్కువగా జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అవశేషాలను దగ్ధం చేయడాన్ని నివారించడానికి రూపొందించిన కార్యాచరణ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.
***
(Release ID: 1764204)
Visitor Counter : 166