ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 15 OCT 2021 9:48AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 97.14 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 16,862 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.07% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 19,391 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,33,82,100 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.60% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,03,678. ఇది 216 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.42%) గత 112 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.43%) గత 46 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 58.88 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1764196) Visitor Counter : 140