ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రష్యా సమాఖ్య కు చెందిన ఇంధన శాఖ మంత్రి తో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమావేశం; కోకింగ్ బొగ్గు రంగంలో సహకారం పై కుదిరిన - చారిత్రాత్మక అవగాహన ఒప్పందం

Posted On: 14 OCT 2021 5:46PM by PIB Hyderabad

రష్యా ఇంధన వారోత్సవాల సందర్భంగా, మాస్కోలో రష్యా సమాఖ్య కు చెందిన ఇంధన శాఖ మంత్రి శ్రీ నికోలాయ్ షుల్గినోవ్‌ తో, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఈ రోజు సమావేశమయ్యారు.  ఉక్కు తయారీలో ఉపయోగించే కోకింగ్ బొగ్గు తో పాటు, ఉక్కు రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి లో సహకారానికి సంబంధించి ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) పై రెండు దేశాలు సంతకం చేశాయి. 

భారతదేశానికి అధిక-నాణ్యత కోకింగ్ బొగ్గు యొక్క దీర్ఘకాలిక సరఫరాలు;  కోకింగ్ బొగ్గు నిక్షేపాల అభివృద్ధి;  రవాణా వాహనాల వ్యవస్థ అభివృద్ధి;   కోకింగ్ బొగ్గు ఉత్పత్తి నిర్వహణలో అనుభవాలు పంచుకోవడం;  బొగ్గు గనుల తవ్వకం;  లబ్ధి పొందడం; ప్రాసెసింగ్; శిక్షణ యొక్క సాంకేతికతలతో సహా, కోకింగ్ బొగ్గులో ఉమ్మడి ప్రాజెక్టులు / వాణిజ్య కార్యకలాపాల అమలు వంటి అంశాలు, ఈ ఎం.ఒ.యు. పరిధిలోకి వస్తాయి.

ఉక్కు రంగంలో కోకింగ్‌ బొగ్గు లో భాగస్వామ్య అవకాశాలపై, ఈ సమావేశంలో, ఇరువురు నాయకులు చర్చించారు.

తమ రెండు రోజుల మాస్కో పర్యటనలో భాగంగా,  కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, రష్యాలోని పలు ప్రముఖ ఉక్కు సంస్థలు, కంపెనీలతో సమావేశమవుతారు.

 

*****(Release ID: 1764194) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi , Tamil