రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 750 ప్రదేశాలలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనతో (పీఎంబీజేపీ) ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు.


"అందరికీ అందుబాటు ధరలో సరికొత్త అత్యుత్తమ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడంపై దృష్టి పెట్టాం" అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.



దేశవ్యాప్తంగా జన్ ఔషధి దుకాణాల సంఖ్య 8,366 కి పెరిగింది; మొత్తం 736 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు.



బ్రాండెడ్ ఔషధాల కంటే 50శాతం నుంచి -90శాతం తక్కువ ధరకు ఈ మందులు లభిస్తాయి.



దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 8000 కి పైగా స్టోర్లను పీఎంబీజేపీ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Posted On: 12 OCT 2021 2:34PM by PIB Hyderabad

అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనను (పీఎంబీజేపీ) ఔషధ శాఖ, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, నవంబర్, 2008 లో ప్రారంభించింది. ఈ పథకం కింద ఏర్పాటైన దుకాణాల సంఖ్య10 అక్టోబర్ 2021 నాటికి , 8,366 కి పెరిగింది.  మొత్తం 736 జిల్లాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సరసమైన ఔషధాలను సులభంగా చేరుకునేలా చేస్తుంది. మార్చి 2024 నాటికి ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల (పీఎంబీజేకే) సంఖ్యను 10,000 కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎంబీజేపీ  దగ్గర 1,451 రకాల మందులు,  240 శస్త్రచికిత్స పరికరాలు ఉన్నాయి. కొత్త ఔషధాలు  న్యూట్రాస్యూటికల్స్ ప్రొటీన్, మాల్ట్ ఆధారిత ఆహార పదార్ధాలు, ప్రోటీన్ బార్, రోగనిరోధక శక్తి బార్, శానిటైజర్, మాస్క్‌లు మొదలైనవి కూడా అందుబాటులో ఉన్నాయి.

పీఎంబీజేపీ కింద లభించే ఔషధాల ధర బ్రాండెడ్ ఔషధాల కంటే 50శాతం నుంచి -90శాతం వరకు తక్కువగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020-–21), పీఎంబీజేపీ అమ్మకాలు రూ. 665.83 కోట్లకు (ఎమ్మార్పీ ప్రకారం) చేరుకున్నాయి. దీనివల్ల  దేశంలోని సాధారణ పౌరులకు రూ.4,000 కోట్లు ఆదా అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, అనగా, 2021–-22 నుండి 10.10.2021 వరకు, బీపీపీఐ అమ్మకాలు రూ. 431.65 కోట్లు కాగా, ప్రజలకు రూ. 2500 కోట్లు ఆదా అయ్యాయి. ప్రస్తుతం పిఎమ్‌బిజెపికి చెందిన మూడు గిడ్డంగులు గురుగ్రామ్, చెన్నై,  గౌహతిలో పనిచేస్తున్నాయి.   సూరత్‌లో నాలుగో గోడౌన్ నిర్మాణంలో ఉంది.  మారుమూల  గ్రామీణ ప్రాంతాలకు ఔషధాల సరఫరా కోసం దేశవ్యాప్తంగా 37 మంది డిస్ట్రిబ్యూటర్లు పనిచేస్తున్నారు.

 

ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎమ్‌బిఐ), ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పిఎమ్‌బిజెపి) అమలుకు నోడల్ ఏజెన్సీ. ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆధ్వర్యంలో 10.10.2021 న దేశంలోని 750 ప్రదేశాలలో "ఆజాది కా అమృత్ మహోత్సవం" కార్యక్రమాలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. 34 ముఖ్యమైన ప్రాంతాల్లో,  2 ప్రముఖ ప్రాంతాల్లో ఒకరోజంతా రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆరోగ్య తనిఖీ శిబిరాలు, జన్ ఔషధి పరిచర్చ కార్యక్రమాలు జరిగాయి. 75,  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లకు ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

 714 వేర్వేరు ప్రదేశాలలో, 75  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ప్రతి చోటా "ప్రథమ చికిత్స వస్తు సామగ్రి" పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. పిఎమ్‌బిజేపీ అధికారులు పిఎమ్‌బిజెపి  ముఖ్య లక్షణాల గురించి సాధారణ ప్రజలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, ఫార్మసిస్టులు, జన్ ఔషధ మిత్రలు, వాటాదారులు మొదలైన వారికి తెలియజేశారు. 950,000 మందికి పైగా లబ్ధిదారులకు పీఎంబీజేపీ ఉత్పత్తులతో కూడిన "ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని" అందించారు. కిట్‌తో పాటు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రిలో భాగంగా  ప్రధాన మంత్రి సందేశం కలిగిన బ్రోచర్ కూడా ఈ కార్యక్రమాలలో ఇవ్వడం జరిగింది.దేశవ్యాప్తంగా సుమారు  లక్ష మంది పౌరులు ఆరోగ్య పరీక్షల శిబిరానికి హాజరయ్యారు.

 

కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  రసాయన & ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా,   కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 1,000 మంది పౌరులు కార్యక్రమానికి హాజరయ్యారు.  భారతీయ జన్ ఔషధి పరియోజన కోసం కృషి చేసిన జన్ ఔషధి మిత్రులు,  జన్ ఔషధి ప్రబుద్ధులను సీఎం అభినందించారు. కర్ణాటకలోని బీదర్‌లో నిర్వహించిన మరో కార్యక్రమంలోనూ దాదాపు 1000 మంది పాల్గొన్నారు. ఇందులో కేంద్ర   రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా ఉన్నారు.


(Release ID: 1763665) Visitor Counter : 256