ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 OCT 2021 9:31AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 96.43 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 15,823 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.06% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 22,844 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,33,42,901 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.61% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,07,653. ఇది 214 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.46%) గత 110 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.19%) గత 44 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 58.63 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

***



(Release ID: 1763567) Visitor Counter : 129