రక్షణ మంత్రిత్వ శాఖ
భారత-చైనాల 13వ సీనియర్ కమాండర్ల స్థాయి సమావేశం
Posted On:
11 OCT 2021 9:32AM by PIB Hyderabad
భారత-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి13వ రౌండ్ సమావేశం అక్టోబర్ 10వ తేదీన చుషుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్‌లో జరిగింది. తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ ప్రాంతంలో మిగిలి ఉన్న వివిధ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూ ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఎల్ఏసీ వెంట ఉన్న పరిస్థితి చైనా పరిస్థితి మారిపోవడానికి కారణః చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి ఏక పక్షంగా ప్రయత్నించడం వల్ల ఏర్పడిందని భారతదేశం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. ఎల్ఏసీ పశ్చిమ సెక్టర్ వెంట శాంతి మరియు ప్రశాంతతను పునరుద్ధరించడానికి చైనీస్ వైపు మిగిలిన ప్రాంతాలలోనూ తగిన చర్యలు తీసుకోవడం అవసరం అని భారత్ పేర్కొంది. ఇది ఇటీవల దుషాన్‌బేలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు తమ మీటింగ్‌లో అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగింది. అక్కడ మిగిలిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఇరుపక్షాల వారు అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సులభతరం చేయడానికి మిగిలిన ప్రాంతాల సమస్యల పరిష్కరించాల్సిన ఆవశ్యకతను భారతదేశం ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. సమావేశంలో, మిగిలిన ప్రాంతాల సమస్యలనున పరిష్కరించడానికి భారతదేశం నిర్మాణాత్మక సూచనలు చేసింది, కానీ చైనా వీటికి తన ఆమోదం తెలపలేదు. దీనికి తోడు ఎలాంటి ప్రతిపాదనలను కూడా అందించలేకపోయింది. ఈ సమావేశంలో మిగిలిన ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగలేదు. దీనికి తోడు కమ్యూనికేషన్లను నిర్వహించడానికి, క్షేత్ర స్థాయిలో స్థిరత్వాన్ని నిర్వహించడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి.
ద్వైపాక్షిక సంబంధాల దృక్పథాన్ని చైనా వైపు పరిగణనలోకి తీసుకోవాలని మరియు ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు మరియు ప్రోటోకాల్ లకు పూర్తిగా కట్టుబడి ఉంటూ మిగిలిన సమస్యల పరిష్కారానికి ముందగా కృషి చేస్తుందని భారత పక్షం ఆశిస్తోంది.
*****
(Release ID: 1763073)
Visitor Counter : 182