వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

దేశీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలను తగ్గించడానికి కేంద్రం వంట నూనెలపై స్టాక్ పరిమితులను విధించింది


ఇది దేశవ్యాప్తంగా వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించే నిర్ణయం

Posted On: 10 OCT 2021 12:06PM by PIB Hyderabad

ఆహార  ప్రజా పంపిణీ శాఖ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్ల వంట నూనెలు  నూనె గింజలపై 2022  మార్చి 31 వరకు స్టాక్పై పరిమితులు అమలవుతాయి.

నిర్దేశిత ఆహారపదార్థాల (సవరణ) ఉత్తర్వుపై లైసెన్సింగ్, అవసరాలు, స్టాక్ పరిమితులు, కదలికల పరిమితుల తొలగింపు తక్షణం అమలులోకి వచ్చింది. అంటే 2021 సెప్టెంబర్ 8 నుండి ఆదేశాలు అమలవుతున్నది. ఆవ నూనె  నూనె గింజలపై ఎన్సీడీఈఎక్స్లో ఫ్యూచర్స్ ట్రేడింగును ఈ నెల ఎనిమిది నుంచి నిలిపివేశారు.

కేంద్రం నిర్ణయం దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గేలా చేస్తుంది. తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల దేశీయ వంటనూనెలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ, ప్రభుత్వం  దూరదృష్టి నాయకత్వంతో వంట నూనెల వంటి నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించబడేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది. దిగుమతి సుంకాలను తగ్గించింది. వివిధ వాటాదారుల దగ్గర ఉన్న స్టాక్‌ల వివరాలను సొంతగా బహిర్గం చేసేందుకు వెబ్-పోర్టల్ ప్రారంభించడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నారు. వంట నూనెల దేశీయ ధరలను మరింత తగ్గించడానికి  చేస్తున్న ఈ ప్రయత్నం గురించి వివరిస్తూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వును జారీ చేసింది.

ఈ ఉత్తర్వు ప్రకారం, ఈ క్రింది మినహాయింపులతో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు  అందుబాటులో ఉన్న స్టాకులను, వాడకం ఆధారంగా సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వం/కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ అన్ని వంట నూనె గింజల స్టాక్ పరిమితిని నిర్ణయిస్తుంది:

(ఎ)  రిఫైనర్, మిల్లర్, ఎక్స్ట్రాక్టర్, హోల్‌సేలర్ లేదా రిటైలర్ లేదా డీలర్, విదేశీ ఎగుమతులు చేసే వ్యక్తి ఎగుమతిదారుడికి ఎక్స్పోర్టర్ కోడ్ నంబర్‌ను  విదేశీ ఎగుమతుల డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేస్తారు. ఇందుకు తన దగ్గరున్న వంట నూనె గింజలు, నూనెల్లో ఎంత మేరకు ఎగుమతి కోసం కేటాయించారో వివరించాలి.

(బి)   రిఫైనర్, మిల్లర్, ఎక్స్‌ట్రాక్టర్, హోల్‌సేలర్ లేదా రిటైలర్ లేదా డీలర్, ఇలాంటి దిగుమతిదారులు వంట నూనెలు.  వంట నూనె గింజలకు సంబంధించి తన స్టాక్‌లో కొంత భాగాన్ని దిగుమతుల నుండి పొందారని నిరూపించగలగాలి.

          ఒకవేళ, సంబంధిత చట్టపరమైన సంస్థలు కలిగి ఉన్న నిల్వలు నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువగా ఉంటే, వారు దానిని ఆహార & ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో (https://evegoils.nic.in/EOSP/login) ప్రకటించాలి. రాష్ట్ర/యుటి పరిపాలన నిర్దేశించిన స్టాక్ పరిమితుల ప్రకారం తన వ్యాపారాన్ని నిర్వహించాలి. అధికారులు అటువంటి నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోపు స్టాకులను తగ్గించుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వాలు/యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ల ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సూచించిన ప్రకారం https://evegoils.nic.in/EOSP/)  పోర్టల్‌లో వంట నూనెలు  వంట నూనె గింజల స్టాక్ క్రమం తప్పకుండా ప్రకటిస్తారు. 

***



(Release ID: 1762705) Visitor Counter : 201