ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాకరణ అంత్యోదయకు మార్గం సుగమంః సిరంజీల ఎగుమతిపై పరిమాణాత్మక పరిమితుల విధింపు
మూడు రకాల సిరంజీలకు 3 నెలల పాటు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది.
Posted On:
09 OCT 2021 11:15AM by PIB Hyderabad
ప్రపంచంలోనే అతి భారీ కోవిడ్ టీకాకరణ కార్యక్రమం భారత్‌లో సమర్ధవంతంగా అమలు చేయడంలో దేశీయ వాక్సిన్ ఉత్పత్తిదారులు, సిరంజిల ఉత్పత్తిదారులు కీలక పాత్రను పోషించారు. ఇప్పటి వరకూ భారత్ 94 కోట్ల వాక్సిన్ డోసులను వేసింది, త్వరలోనే 100 కోట్ల డోసులను వేసే లక్ష్యం దిశగా పురోగమిస్తోంది. భారత్‌లోని చివరి పౌరుని వరకూ వాక్సిన్ వేయాలన్న స్థిరమైన రాజకీయ నిబద్ధతతో, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చేపట్టిన అంత్యోదయ తత్వికతను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సిరంజీలు దేశీయంగా వాక్సిన్ వేసేందుకు మరింత అందుబాటులో ఉండేందుకు, సిరంజీల ఎగుమతులపై పరిమాణాత్మక పరిమితులను విధించింది.
సాధ్యమైనంత తక్కువ సమయంలో అర్హులైన పౌరులందరికీ టీకా వేసే కార్యక్రమ వేగాన్ని కొనసాగించేందుకు సిరంజీలు కీలకం. వాక్సిన్ వేసేందుకు తగినన్ని సిరంజీలు అందుబాటులో ఉండేందుకు, భారత ప్రభుత్వం వాటి ఎగుమతులపై ఈ పరిమాణాత్మక పరిమితులను విధించింది. దిగువన పేర్కొన్న సిరంజీలపై మాత్రమే పరిమితులు ప్రభుత్వం విధించింది -
*0.5 ఎంఎల్/ 1 ఎంఎల్ ఎడి (ఆటోడిసేబుల్) సిరంజీలు
* 0.5 ఎంఎల్/ 1 ఎంఎల్/ 2ఎంఎల్/ 3 ఎంఎల్ డిస్పోసబుల్ సిరంజీలు
*1 ఎంఎల్/ 2ఎంఎల్/ 3 ఎంఎల్ ఆర్‌యుపి (రీయూజ్ ప్రివెన్షన్) సిరంజీలు
ఏ రకం సిరంజీల ఎగుమతులపై ఇది నిషేధం కాదని, ఇది కొన్ని నిర్ధిష్ట రకాల సిరంజీల పరిమాణాత్మక పరిమితులు మాత్రమేనని స్పష్టీకరణ చేయడం జరిగింది. ఇది కేవలం 3నెలల పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది.
కాగా, పైన పేర్కొన్నసిరంజీల విలువలు, రకాల మినహాయించి, ఇతర రకాలు ఏవీ పరిమాణాత్మక పరిమితి పరిధిలోకి రావు.
(Release ID: 1762600)
Visitor Counter : 185