పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

మానవ మరియు పశువుల వినియోగం కోసం ఆహార ధాన్యాల డిమాండ్‌ను తీర్చడం ఎప్పుడూ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది;


వరి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయ వినియోగాన్ని అనుమతించడం రైతులకు ధర స్థిరీకరణకు ఊతం ఇస్తుంది, కొత్త పెట్టుబడులను కూడా ప్రారంభిస్తుంది;

దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, మన సొంతంగా ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూల ఇంధనాన్ని వినియోగించడంలో, పరిశ్రమ మరియు రైతులకు లాభదాయకమైన ధరలను చెల్లించడంలో ఈ ప్రయత్నం సహాయపడుతుంది;

దేశ ఆహార భద్రతపై ప్రభావం చూపే ఇథనాల్ ప్రణాళిక హానికరమైనవని నివేదికలు వచ్చాయి

Posted On: 07 OCT 2021 12:27PM by PIB Hyderabad

కొన్ని మీడియాలో ప్రతిష్టాత్మకమైన ఇథనాల్ ప్రణాళికను దేశంలో  ఆహార భద్రత భయాలతో ముడిపెట్టి కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నివేదికలు నిరాధారమైనవి, హానికరమైనవి మరియు వాస్తవ దూరం. భారతదేశం లాంటి యువ దేశానికి ఆహార అవసరాలు అత్యంత ముఖ్యమైనవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, అన్ని మార్గాల ద్వారా శక్తి అవసరాలను తీర్చడం కూడా చాలా ముఖ్యమైనది. అందువల్ల, మారిన దృక్పథం "ఫుడ్ విత్ ఫ్యూయల్" గా ఉండాలి, "ఫుడ్ వర్సెస్ ఇంధనం" గా ఉండకూడదు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంధన డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది మరియు ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం మన భవిష్యత్తు వృద్ధి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇథనాల్, బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) వంటి అంతర్గత ఇంధనాలను అభివృద్ధి ఇంధన రంగంలో ముఖ్యం. గత ఆరు సంవత్సరాలలో, ఈ ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి కోసం మిగులు చెరకు ఆధారిత ముడి పదార్థాలను (అనగా చెరకు రసం, చక్కెర, చక్కెర సిరప్) మార్చడానికి అనుమతించడం ద్వారా లిక్విడిటీ కొరతతో ఉన్న చక్కెర పరిశ్రమలో విజయవంతంగా రూ .35,000 కోట్లు లబ్ది కలిగేలా చర్యలు చేపట్టింది. ఇది చెరకు రైతుల బకాయిలను త్వరగా తీర్చడంలో సహాయపడింది, తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కొనసాగుతున్న సీజన్‌లో, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే రూ .20,000 కోట్లకు పైగా ఇంజెక్ట్ చేయబడుతుందని అంచనా.  ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి దోహదం చేస్తుంది.  

2021-22 చక్కెర సీజన్ కోసం చక్కెర ఉత్పత్తి సుమారు 340 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా. ప్రారంభ నిల్వ 90 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ, ఇది దేశీయ వినియోగం 260 లక్షల మెట్రిక్ టన్నుల కంటేఅధికం. ఇందులో 35 మిలియన్ టన్నుల మిగులు చక్కెర పరిమాణాన్ని ఇథనాల్‌గా మళ్లించాలని ప్రతిపాదించారు. ఇవి ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించాల్సిన చక్కెర పరిమాణాలు, ఇతర దేశాలకు సబ్సిడీ రేటుతో ఎగుమతి చేయాలి లేదా మార్కెట్‌లో విడుదల చేసినట్లయితే ఉత్పత్తి ధర కంటే చాలా తక్కువ ధరలో చక్కెర ధరలు తగ్గుతాయి. అదేవిధంగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద మాత్రమే ఉన్న బియ్యం నిల్వలు (05.10.2021 నాటికి) 202 లక్షల మెట్రిక్ టన్నులు.. ఇది దేశంలోని బఫర్ స్టాక్ అవసరం కంటే చాలా ఎక్కువ.

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా విదేశీ మారక ప్రభావం గత ఆరు సంవత్సరాలలో రూ .20,000 కోట్లకు పైగా ఉంది. ప్రస్తుత సంవత్సరానికి, సానుకూలంగా దాదాపు రూ .10,000 కోట్ల అదనపు ప్రభావం ఉంటుంది. ఈ డబ్బు ముడి చమురు కొనుగోళ్ల కంటే సామాన్య భారతీయులకి చెందినట్టే. 

ప్రపంచ పద్ధతుల ప్రకారం, ఇథనాల్ ఉత్పత్తి కోసం మిగులు బియ్యం నిల్వలను ఎఫ్సిఐ తో మార్చడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇంకా, ఇథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్న వంటి ముతక ధాన్యాలను మార్చడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్-19 సమయంలో ఉచితంగా బియ్యం, ఇతర ధాన్యాలను పంపిణీ చేసినప్పటికీ, ఎఫ్సిఐ ఇప్పటికీ పెద్ద మొత్తంలో బియ్యం నిల్వలను కలిగి ఉంది. అంతేకాకుండా, వ్యవసాయ సీజన్ బాగా ఉన్నందున మెరుగైన బియ్యం నిల్వలు పెరగడం ప్రారంభమవుతుంది.

మొక్కజొన్నను ఇథనాల్‌గా మార్చడం వల్ల దేశవ్యాప్తంగా అధిక డిడిజిఎస్ (పశువుల దాణా) ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది. ఆహార ధాన్యాలను ఇంధనంగా మళ్లించడం ద్వారా ఉత్పన్నమయ్యే అదనపు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, పంటలను మార్చడానికి, వారి పంట నమూనాను మార్చడానికి రైతులను ప్రోత్సహిస్తుంది.

బియ్యం మరియు మొక్కజొన్నలకు ప్రత్యామ్నాయ వినియోగాన్ని అనుమతించడం వలన రైతుల ఉత్పాదన కోసం ధర స్థిరత్వానికి సహాయపడటమే కాకుండా, డిస్టిలరీలు మరియు అనుబంధ మౌలిక సదుపాయాలలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి సహాయపడుతుంది. ఈ చొరవ కూడా గౌరవనీయులైన ప్రధాన మంత్రి "ఆత్మనిర్భర్ భారత్" (స్వీయ ఆధారిత భారత్) పిలుపునిచ్చారు, ఎందుకంటే మనం దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటాము, మన స్వంత ఉత్పత్తి పర్యావరణ అనుకూల ఇంధనాన్ని వినియోగిస్తాము. పరిశ్రమ, రైతులకు లాభదాయకమైన ధరలను చెల్లిస్తాము. మానవ మరియు పశువుల వినియోగం కోసం ఆహార ధాన్యాల డిమాండ్‌ను తీర్చడం ఎల్లప్పుడూ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఈ మిగులు చక్కెర నిల్వలు (2021-22 కొరకు 35 లక్షల మెట్రిక్ టన్నుల) మరియు ఆహార ధాన్యాలు ఇప్పుడు నష్టాలను అధిగమిస్తూ,  ప్రయోజనాలతో ప్రత్యామ్నాయ వినియోగాన్ని కనుగొన్నాయి.

 

***



(Release ID: 1762006) Visitor Counter : 157