హోం మంత్రిత్వ శాఖ

రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా, కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రిగా, ప్రజాసేవలో 20 ఏళ్లు పూర్తి చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని అభినందించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


"20 సంవత్సరాల క్రితం ఇదే రోజున, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన అభివృద్ధి, సుపరిపాలన నేటికీ కొనసాగుతూనే ఉంది"

"ఈ 20 ఏళ్లలో, ప్రజలు, దేశ అభ్యున్నతి కోసం శ్రీ నరేంద్ర మోదీ రాత్రింబవళ్లు కష్టపడ్డారు"

"పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అంకితమైన ఈ 20 సంవత్సరాల్లో, శ్రీ నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో, దూరదృష్టితో అసాధ్యాలను సుసాధ్యం చేశారు"

"మొదట గుజరాత్‌లో, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో, నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం"

"బలమైన, స్వయంసంవృద్ధి దేశంగా భారత్‌ను మార్చే సంకల్పాన్ని నిజం చేయడానికి, శ్రీ మోదీ జీ నాయకత్వంలో మనమందరం ఉత్తమంగా కృషి చేద్దాం"

Posted On: 07 OCT 2021 4:10PM by PIB Hyderabad

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా, 20 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. "20 సంవత్సరాల క్రితం ఇదే రోజున, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన అభివృద్ధి, సుపరిపాలన నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ 20 ఏళ్లలో, ప్రజలు, దేశ అభ్యున్నతి కోసం శ్రీ నరేంద్ర మోదీ రాత్రింబవళ్లు కష్టపడ్డారు." అని ట్వీట్లలో ప్రశంసించారు.

"రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా, కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రిగా, ప్రజాసేవలో 20 ఏళ్లు పూర్తి చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తున్నా" అన్న కేంద్ర హోం మంత్రి, "ఈ 20 ఏళ్లలో ప్రజలు, దేశ అభ్యున్నతి కోసం శ్రీ నరేంద్ర మోదీ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అంకితమై, తన దృఢ సంకల్పంతో, దూరదృష్టితో అసాధ్యాలను సుసాధ్యం చేశారు." అని పేర్కొన్నారు.

"మొదట గుజరాత్‌లో, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో, నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. బలమైన, స్వయంసంవృద్ధి దేశంగా భారత్‌ను మార్చే సంకల్పాన్ని నిజం చేయడానికి, శ్రీ మోదీ జీ నాయకత్వంలో మనమందరం ఉత్తమంగా కృషి చేద్దాం." అని మరికొన్ని ట్వీట్లలో శ్రీ అమిత్‌ షా పిలుపునిచ్చారు.



(Release ID: 1761994) Visitor Counter : 110