ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
07 OCT 2021 9:19AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 92.63 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 22,431 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.72% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,44,198. ఇది 204 రోజుల కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 97.95% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 24,602 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,32,00,258 కు పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు (1.68%) గత 104 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.57%) గత 38 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 57.86 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1761658)
Visitor Counter : 158