నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
స్కిల్ ఇండియా 'నేషనల్ అప్రెంటీస్-షిప్ మేళా' 2021 లో ఎంపికైన - 51,000 మందికి పైగా అప్రెంటీస్‌లు
దేశంలోని 662 ప్రాంతాల్లో నిర్వహించిన - అప్రెంటీస్‌షిప్ మేళా
30 కంటే ఎక్కువ రంగాలకు చెందిన 5000 కంటే ఎక్కువ కంపెనీలు / సంస్థల నుండి పాల్గొన్న - ప్రతినిధులు
500 కు పైగా ట్రేడ్ లలో జరిగిన - నియామకాలు (నియమించబడిన & ఐచ్ఛికం)
Posted On:
06 OCT 2021 7:00PM by PIB Hyderabad
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డి.జి.టి) మరియు జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (ఎన్.ఎస్.డి.సి) నుండి తగిన మద్దతుతో స్కిల్ ఇండియా ఈ రోజు దేశవ్యాప్తంగా 660 కి పైగా ప్రాంతాల్లో అప్రెంటీస్‌షిప్ మేళాను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా, దాదాపు 51,991 మంది అప్రెంటీస్ లుగా ఎంపికయ్యారు. ఈ మేళాలో, విద్యుత్తు; రిటైల్; టెలికాం; ఐ.టి./ఐ.టి.ఈ.ఎస్; ఎలక్ట్రానిక్స్; ఆటోమోటివ్ మొదలైన 30 కంటే ఎక్కువ రంగాలకు చెందిన, 5 వేల కంటే ఎక్కువ సంస్థలు పాల్గొన్నాయి. అదనంగా, దేశంలోని ఔత్సాహిక యువతకు, వెల్డర్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, బ్యూటీషియన్, మెకానిక్ వంటి పోస్టుల తో సహా, 500 కంటే ఎక్కువ ట్రేడ్‌ల (నియామకం మరియు ఐచ్ఛికం) నుండి ఎంపిక చేసుకునే అవకాశం కలిగింది.
దరఖాస్తుదారులు, ఈ అప్రెంటీస్‌షిప్ మేళాలో భాగం కావడం ద్వారా, ప్రత్యక్షంగా పరిశ్రమతో అవగాహన కలిగే అవకాశం తో పాటు, సంబంధిత యజమానుల నుండి అక్కడికక్కడే అప్రెంటీస్ షిప్ నియామక పత్రాలు పొందడం వంటి అనేక ప్రయోజనాలను పొందారు, వీరికి ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నెలకు 5,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. నేర్చుకునే సమయంలోనే, సంపాదించడానికి, అభ్యర్థులకు, ఇది ఒక గొప్ప అవకాశం. జాతీయ వృత్తి విద్యా శిక్షణా మండలి (ఎం.సి.వి.ఈ.టి) నుండి అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు పొందుతారు. శిక్షణ తర్వాత వారి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, భారతదేశ యువతకు మార్కెట్ సంబంధిత నైపుణ్యాలలో తగిన శిక్షణ అందించడం పట్ల తమ నిబద్ధతను ప్రముఖంగా పేర్కొంటూ, అప్రెంటీస్‌షిప్ మేళా సందర్భంగా అభ్యర్థుల నుండి తమ మంత్రిత్వ శాఖకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చిందని, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 52,000 మంది అప్రెంటీస్‌లను నియమించుకోవాలని ఆయన ఆశించారు. 'నైపుణ్య భారత్' అనే ఆశయాన్ని సాధించడానికి దేశంలో నైపుణ్య ప్రమాణాలను పెంపొందించగలమని, ఆయన, ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5,000 కంటే ఎక్కువ సంస్థలలో పనిచేసే అవకాశం పొందిన అప్రెంటీస్‌లందరినీ ఆయన అభినందించారు. డిమాండ్ ఆధారిత నైపుణ్యాలను అందించడంతో పాటు, యజమానులు ఎదుర్కొంటున్న సాంకేతిక నైపుణ్యం అంతరాలను పరిష్కరించే విషయంలో అప్రెంటీస్‌షిప్ శిక్షణ అనేది నైపుణ్యాభివృద్ధికి అత్యంత స్థిరమైన నమూనా అని ఆయన అభివర్ణించారు. నేర్చుకునే సమయంలోనే సంపాదించుకునే పద్ధతుల ఆవిష్కరణలను సులభతరం చేసే, ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా, అప్రెంటీస్‌షిప్ శిక్షణ యొక్క ప్రయోజనాలను పూర్తి సామర్థ్యంలో పొందేందుకు మేము సంస్థలు మరియు అభ్యర్థులకు అవసరమైన మద్దతు ఇస్తామని,ఆయన, నొక్కి చెప్పారు.
డి.జి.టి., డైరెక్టర్ జనరల్ (శిక్షణ), శ్రీమతి నీలం షమ్మీ రావు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న మార్కెట్ పరిస్థితులతో పాటు, ఈ కొత్త క్రమంలో పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నందున, అప్రెంటీస్-షిప్ మన యువతను ఉద్యోగాల భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి ఒక ముఖ్యమైన అంశంగా మారుతోందని, పేర్కొన్నారు. అప్రెంటీస్‌షిప్ మేళాలో అవకాశాలు పొందిన అప్రెంటీస్‌లందరినీ ఆమె అభినందించారు. వారి భవిష్యత్ ప్రయత్నాలు ఫలించాలని, ఆమె వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలకు, వారి అవసరాలకు అనుగుణంగా, అర్హత, సమర్థత కలిగిన అభ్యర్థులను ఒక ఉమ్మడి వేదిక ద్వారా ఎంపిక చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని, ఈ కార్యక్రమం కల్పించింది. ఈ కార్యక్రమంలో రైల్వేలు, ఓ.ఎన్.జి.సి., టాటా, మారుతి ఉద్యోగ్ వంటి అనేక ఇతర ప్రధాన సంస్థలు పాల్గొన్నాయి. ఈ సంస్థలతో పాటు, కనీసం నలుగురు సిబ్బంది తో పనిచేసే చిన్న తరహా పరిశ్రమలు కూడా ఈ కార్యక్రమంలో అప్రెంటీస్‌లను ఎంపిక చేసి, నియమించుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థుల్లో, 5వ తరగతి నుండి 12వ తరగతి చదివిన విద్యార్థులు, నైపుణ్య శిక్షణ ధ్రువపత్రం కలిగిన వారు, ఐ.టి.ఐ. విద్యార్థులు, డిప్లొమా కలిగిన వారు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి, 2015 జూలై,15వ తేదీన ప్రారంభించిన, ఈ జాతీయ నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు వ్యవస్ధాపకత విధానం-2015 తగిన పరిహారంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు లాభదాయకమైన ఉపాధిని అందించే సాధనంగా అప్రెంటీస్‌షిప్‌ని గుర్తించింది. దేశంలోని వివిధ సంస్థల ద్వారా ఎక్కువ సంఖ్యలో అప్రెంటిస్ లను నియమించడానికి, ఎం.ఎస్.డి.ఈ. కూడా అనేక ప్రయత్నాలు చేసింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సరఫరా మరియు డిమాండ్ మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడంతో పాటు, ఉద్యోగం చేస్తూ శిక్షణ పొందడం ద్వారా, ఉపాధి కోసం మెరుగైన అవకాశాలను పొందడం ద్వారా, భారతీయ యువత ఆకాంక్షలను నెరవేర్చాలన్నదే ఈ పధకం లక్ష్యం.
దేశంలో అప్రెంటీస్-షిప్ శిక్షణలో ఎక్కువ మంది పాల్గొనడానికి వీలుగా, అప్రెంటీస్‌షిప్ నియమాలలో, ఎం.ఎస్.డి.ఈ., గణనీయమైన సంస్కరణలను తీసుకువచ్చింది.
ఈ సంస్కరణలలో ఇవి ఉన్నాయి:
* అప్రెంటీస్ లను ఎంపిక చేయడానికి గరిష్ట పరిమితి 10 శాతం నుండి 15 శాతానికి పెరిగింది.
* అప్రెంటీస్ లను తప్పనిసరిగా నియమంచుకోవాలనే నిబంధన కలిగిన సంస్థ యొక్క పరిమాణ పరిమితి 40 నుండి 30 కి తగ్గించారు.
* మొదటి సంవత్సరం వేతనాన్ని కనీస వేతనాలకు లింక్ చేయకుండా, మొదటి సంవత్సరానికి ఎంత వేతనం చెల్లించాలనేది నిశ్చయించడం జరిగింది. ఆ తర్వాత 2వ మరియు 3వ సంవత్సరం చెల్లించే వేతనాన్ని వరుసగా 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచారు.
* ఆప్షనల్ ట్రేడ్ కోసం అప్రెంటీస్-షిప్ శిక్షణ వ్యవధి 6 నెలల నుండి 36 నెలల వరకు ఉంటుంది
* పరిశ్రమలు వారి స్వంత అవసరాలకు అనుగుణంగా అప్రెంటీస్-షిప్ శిక్షణను రూపొందించుకుని, అమలు చేసుకునే అవకాశం ఇచ్చారు.
* జాతీయ అప్రెంటీస్-షిప్ అభివృద్ధి పధకం (ఎన్.ఏ.పి.ఎస్) కింద, సంస్థలు లేదా పరిశ్రమలు తమ వద్ద ఉన్న అప్రెంటీస్‌లకు చెల్లించే వేతనంలో 25 శాతం వరకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
*****
(Release ID: 1761650)
Visitor Counter : 188