పర్యటక మంత్రిత్వ శాఖ

బౌద్ద ప‌ర్యాట‌కాన్నిగ‌ణ‌నీయంగా ప్రోత్స‌హించేందుకు బోధ్‌గ‌య‌లో స‌దస్సు ఏర్పాటు చేస్తున్న‌ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ‌


అనుసంధాన‌త మెరుగుప‌రిచేందుకు మౌలిక‌స‌దుపాయాల అభివృద్ధి, బౌద్ద క్షేత్రాల‌ను యువ‌త‌లో ప్రాచుర్యం లోకి తెచ్చేందుకు బౌద్ధ స‌ర్క్యూట్ రైలు స‌దుపాయం వంటివి ఇందులో ముఖ్యాంశాలు

Posted On: 06 OCT 2021 1:55PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు.
-బుద్ధిస్ట్ స‌ర్క్యూట్ ట్రైన్ ఎఫ్ఎఎం  టూర్‌, స‌ద‌స్సు అక్టొబ‌ర్  4 నుంచి అక్టోబ‌ర్ 8 వ‌ర‌కు నిర్వ‌హించ‌డం జ‌రుగుతొంది.
-స‌ద‌స్సుసంద‌ర్భంగా విమాన‌, రైలు, రోడ్డు అనుసంధాన‌త‌కు  సంబంధించి మౌలిక స‌దుపాయాల అభివృద్ధిపై ప్ర‌ధాన దృష్టిపెట్ట‌డం జ‌రుగుతోంది.
- ఐఆర్ సిటిసి బుద్ధిస్ట్ స్పెష‌ల్ ట్రైన్ కు సంబంధించి స‌వివ‌రమైన  ప్ర‌జెంటేష‌న్ ఇచ్చింది. ఈ ప్ర‌త్యేక -రైలులో మినీ లైబ్ర‌రీతోపాటు ప‌లు   స‌దుపాయాల‌ను ఐఆర్‌సిటిసి  క‌ల్పించ‌నుంది..
 కేంద్ర‌ప‌ర్యాట‌క  మంత్రిత్వ‌శాఖ , బుద్ధిస్ట్  టూరిజంను  పెద్ద ఎత్తున ప్రోత్స‌హించేందుకు  2021 అక్టోబ‌ర్‌5న  ఒక స‌ద‌స్సు  ఏర్పాటు చేసింది. ఈ స‌ద‌స్సుకు ప‌ర్యాట‌క‌మంత్రిత్వ‌శాఖ డిజి, శ్రీ జి.క‌మ‌ల వ‌ర్ధ‌న రావు, బీహార్ ప్ర‌బుత్వ ప‌ర్యాట‌క  శాఖ  డైర‌క్ట‌ర్‌, గ‌య జిల్లా మేజిస్ట్రేట్‌, ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ‌కు  చెందిన  ఇత‌ర అధికారులు  ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ,  బుద్దిస్ట్ స‌ర్కూట్‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ అభివృద్ధి అందుకు  జ‌రిగిన కృషిని తెలియ‌జేయ‌డం ఈస‌ద‌స్సు ప్రధాన ఉద్దేశం. అలాగే ఇండియాలో బౌద్ధ ప‌ర్యాట‌కాన్ని  మ‌రింత ముందుకు తీసుకువెళ్లే అంశాన్ని చ‌ర్చించేందుకు  ఈ స‌మావేశం ఏర్పాటుచేశారు.
 బుద్ధిస్ట్ స‌ర్క్యూట్ ట్రెయిన్ ఎఫ్ఎఎం టూర్ 2021 అక్టోబ‌ర్  4 నుంచి 2021  అక్టొబ‌ర్ 8 వ‌ర‌కు  నిర్వ‌హించ‌డంలో భాగంగా ఈ స‌ద‌స్సును  నిర్వ‌హిస్తున్నారు. బుద్ధిస్ట్ స‌ర్క్యూట్ ఫామ్ టూర్ 2021 అక్టోబ‌ర్ 4న ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్  జంగ్ రైల్వేస్టేష‌న్ నుంచి ప్రారంభ‌మైంది. దీనిని ప‌ర్యాట‌క‌, ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌మంత్రిశ్రీ అజయ్‌భ‌ట్ జెండా ఊపి  ప్రారంభించారు. 


ఈ స‌ద‌స్సులో పాల్గొన్న వారు ,ప్ర‌తినిథుల‌లో ఇండియ‌న్  అసోసియేష‌న్ ఆఫ్ టూర్ ఆప‌రేట‌ర్ (ఐఎటిఒ), అసోసియేష‌న్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆప‌రేట‌ర్ (ఎడిటిఒఐ), అసోసియేష‌న్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆప‌రేట‌ర్స్ (ఎబిటిఒ) ఉన్నారు. ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగా విమాన‌,రైలు, రోడ్డు  అనుసంధాన‌త‌తో పాటు  మౌలిక స‌దుపాయాల  అభివృద్ధిపై ప్ర‌ధాన దృష్టి పెట్ట‌డం జ‌రిగింది. దీనికి  తోడు  గ‌య‌ను ఏడాదిపాటు  ప‌ర్యాట‌కుల‌ను  ఆక‌ర్షించేగ‌మ్య‌స్థానంగా, అలాగే యువ‌త‌తోపాటు  అన్ని  వయసుల‌వారు బౌద్ధ ఆకర్షణీయ  ప్ర‌దేశాలు,బౌద్ధ స్థ‌లాల‌ను ద‌ర్శించే విధంగా  ప్రోత్స‌హించాల‌ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించడం జ‌రిగింది.
ప‌ర్యాట‌క రంగానికి  సంబంధించి అందిస్తున్న స‌దుపాయాలు, బీహ‌ర్ ప‌ర్యాట‌క శాఖ‌చేపట్టిన అభివృద్ధి ప‌నులకు  సంబంధించి స‌వివ‌రమైన ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌డం జ‌రిగింది. బుద్ధిస్ట్ ప్ర‌త్యేక రైలుకు సంబంధించి ఐఆర్‌సిటిసి స‌వివ‌ర‌మైన ప్ర‌జెంటేష‌న్  ఇచ్చింది. అలాగే  బుద్ధిస్ట్ స్పెష‌ల్ ట్రైన్‌లో  మినీ  లైబ్ర‌రీతోపాటు ఐఆర్‌సిటిసి క‌ల్పించిన  ప‌లు  స‌దుపాయాల గురించి వివ‌రించ‌డం జ‌రిగింది. బుద్ధిస్ట్ పర్యాట‌కానికి సంబంధించిన అవ‌కాశాలు, స‌వాళ్లు, మొత్తంగా అభివృద్ధి, ప్రోత్సాహం వంటి అంశాల‌ను ఇందులో చ‌ర్చించ‌డం  జ‌రిగింది.


ఎఫ్ఎఎం టూర్  ఢిల్లీనుంచి మొద‌లై వివిధ ప్రాంతాలు ద‌ర్శించి ఢిల్లీ చేరుకుంటుంది.  ఈప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ముఖ బౌద్ధ ద‌ర్శ‌నీయ స్థ‌లాల‌తోపాటు  బోధ‌గ‌య‌, వార‌ణాశిల‌లో జ‌రిగే స‌ద‌స్సుల‌ను సంద‌ర్శించ‌డాన్ని క‌వ‌ర్ చేస్తుంది. ఈ ఈవెంట్కు 125 మంది ప్ర‌తినిధులు హాజ‌రుకానున్నారు.ఇందులో టూర్ ఆపరేట‌ర్లు, హోట‌ళ్ల‌కు  చెందిన‌వారు, మీడియా ప్ర‌తినిధులు, పర్యాట‌క మంత్రిత్వ‌శాఖ‌కు, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు  చెందిన వారు హాజ‌రౌతున్నారు.  దీనికి తోడు వంద‌మంది స్థానిక టూర్ ఆప‌రేట‌ర్లు, ప‌ర్యాట‌క,హాస్పిటాలిటిరంగానికి  చెందిన స్టేక్  హోల్డ‌ర్లు బోధ్‌గ‌య‌, వార‌ణాశిల‌లో జ‌రిగే  స‌మావేశానికి హాజ‌ర‌వుతున్నారు. వీరు ఈ స‌ర్క్యూట్‌లో ప‌ర్యాట‌క రంగ అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌ను  చ‌ర్చిస్తారు.


కేంద్ర ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాక వివిధ కేంద్ర  ప్ర‌భుత్వ  మంత్రిత్వ‌శాఖ‌లు,బీహార్‌,ఉత్త‌ర‌ప్ర‌దేశ్   రాష్ట్ర‌ప్ర‌భుత్వాల సమ‌న్వ‌యంతో బుద్ధిస్ట్ స‌ర్య్కూట్‌ను అలాగే  బీహార్ , ఉత్త‌ర  ప్రదేశ్‌ల‌లో బౌద్ధ క్షేత్రాల‌ను
బుద్ధిస్ట్ స‌ర్క్యూట్ అభివృద్ధికిసంబంధించి ప్ర‌ధానంగా మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న‌, లాజిస్టిక్స్‌, సాంస్కృతిక ప‌రిశోధ‌న‌,సంస్కృతి వార‌స‌త్వం, విద్య‌,ప్ర‌జల‌కు అవ‌గాహ‌న‌క‌ల్పించ‌డం, క‌మ్యూనికేష‌న్  ఔట్  రీచ్  వంటివి ఇందులో  ఉన్నాయి.

పైన పేర్కొన్న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతోపాటు , కుషిన‌గ‌ర్‌, శ్రావ‌స్థి వ‌ద్ద అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల అభివృద్ధి, బౌద్ధ క్షేత్రాల‌కు  ఆర్‌సిఎస్ ఉడాన్ రూట్ల‌ను ఆచ‌ర‌ణ‌లోకి తేవ‌డం, గ‌య రైల్వేస్టేష‌న్ అభివృద్ధి, బౌద్ధ క్షేత్రాల‌ను  అనుసంధానం చేస్తూ జాతీయ ,రాష్ట్ర  ర‌హ‌దారుల నిర్మాణం,  ఐకానిక్  సైట్స్‌కింద బోధ్‌గ‌య అభివృద్ధ‌ది, స్వ‌దేశీ ద‌ర్శ‌న్ ప‌థ‌కం, బౌద్ధ ప‌ర్యాట‌క కేంద్రాల‌లో మ్యూజియంలు,హెరిటేజ్  సెంట‌ర్ల అభివృద్ధికి చ‌ర్య‌లు  తీసుకోనున్నారు.బుద్ధిస్ట్ , టిబెటిన్ సంస్థ‌ల‌లో మాన్యుస్క్ర‌ప్ట్‌ల‌ను  డిజిటైజ్ చేసి  భ‌ద్ర‌ప‌ర‌చ‌డం, బౌద్ధం పై కోర్సుల‌ను అభివృద్ధి చేయ‌డం వంటివిఇందులో  ఉన్నాయి  . ప్ర‌జా  అవ‌గాహ‌నాకార్య‌క్ర‌మం కింద‌,య‌క‌మ్యూనికేష‌న్  ,ప్ర‌చార  కార్య‌క్ర‌మంలో భాగంగా బౌద్ధ ప్ర‌దేశాల ప్రాచుర్యానికి  ప‌లు  చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం  జ‌రుగుతోంది. బౌద్ధ ప్ర‌దేశాల‌ను ప్రాచుర్యంలోకి తేవ‌డానికి నేష‌న‌ల్ మ్యూజియంలో వ‌ర్చువ‌ల్  గ్యాల‌రీ వంటి అంశాలు ఉన్నాయి. వార్షిక కార్య‌క్ర‌మాల కేలండ‌ర్ రూప‌కల్ప‌న‌, బౌద్దానికి సంబంధించి మీడియా ప్ర‌చారం, సోర్సుమార్కెట్‌లు,బౌద్ద‌స‌ద‌స్సు వంటి వి ఇందులో ఉన్నాయి.

***

 



(Release ID: 1761467) Visitor Counter : 158