రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కేవలం ఆరు నెలల్లో 2021-22 ఆర్థిక సంవత్సర లక్ష్యాన్ని సాధించిన ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన ( పీఎంబీజేపీ ) ధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) కేవలం 6 నెలల్లో ది దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 8308 పీఎంబీజేపీ కేంద్రాల ఏర్పాటు


బ్రాండెడ్ వాటితో పోల్చి చూస్తే 50 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరకు పీఎంబీజేపీ లో ఔషధాలు

Posted On: 06 OCT 2021 1:52PM by PIB Hyderabad

దేశంలో 8,300 ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన కేంద్రాలను ( పీఎంబీజేపీకె )  ఏర్పాటు చేసే ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన ( పీఎంబీజేపీ ) కార్యక్రమాన్ని    అమలు చేస్తున్న ఫార్మాస్యూటికల్స్ అండ్  మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబిఐ) 2021-22 ఆర్థిక సంవత్సర లక్ష్యాలను ఆరు నెలలు ముందుగా సెప్టెంబర్ నెలాఖరుకు సాధించింది.  ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన ( పీఎంబీజేపీ) కార్యక్రమం  దేశంలోని అన్ని జిల్లాల్లో అమలు జరుగుతున్నది. జన ఔషధి కేంద్రాలకు అవసరమైన ఔషధాలను సకాలంలో సరఫరా చేయడానికి ఐటీ ఆధారిత  రవాణా వ్యవస్థను రూపొందించి అమలు చేస్తున్నారు. 

ప్రస్తుతం  ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన ( పీఎంబీజేపీ ) లో 1,451 రకాల మందులు, 240 శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని  కొత్త మందులు మరియు  గ్లూకోమీటర్ప్రోటీన్ పౌడర్మాల్ట్ ఆధారిత ఆహార పదార్థాలుప్రోటీన్ బార్రోగనిరోధక శక్తి బార్ మొదలైన న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులు ప్రారంభించబడ్డాయి.

 

సామాన్య ప్రజలు ముఖ్యంగా పేదలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికోసం 2024 మార్చి నాటికి దేశంలో 10000 ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. 2021 అక్టోబర్ అయిదవ తేదీ నాటికి 8355 కేంద్రాలు ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలలో ఈ కేంద్రాల ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన మందులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 

ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన కేంద్రాలకు మందులను సరఫరా చేయడానికి గురుగాంచెన్నై,గువాహతి లలో గిడ్డంగులు ఏర్పాటు అయ్యాయి. సూరత్ లో మరో గిడ్డంగి నిర్మాణంలో ఉంది. మారుమూల ప్రాంతాలుగ్రామీణ ప్రాంతాలకు మందులను సరఫరా చేయడానికి 37 మంది పంపిణీదారులను నియమించడం జరిగింది. 

 

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎమ్‌బిజెపి) కోసం "జనౌషధి సుగమ్" అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా అన్ని వివరాలను అందిస్తున్నారు. 

ఈ పథకం కింద,నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించడానికి  ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ గుర్తింపు పొందిన సరఫరాదారుల నుంచి మందులు కొనుగోలు చేయబడతాయి.  ఇది కాకుండాప్రతి బ్యాచ్ ఔషధం  'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో పరీక్షించబడుతోంది.  నాణ్యత పరీక్షల  తర్వాత మాత్రమే మందులు  పిఎమ్‌బిజెపి   కేంద్రాలకు పంపబడతాయి.  పిఎమ్‌బిజెపి  కింద లభించే ఔషధాల ధర బ్రాండెడ్ ధరల కంటే 50% నుంచి 90% తక్కువగా ఉంటుంది.  2020-21  ఆర్థిక సంవత్సరంలో  పిఎమ్‌బిజెపి ద్వారా   665.83 కోట్ల రూపాయల  (ఎం ఆర్ పి  వద్ద).  అమ్మకాలు జరిగాయి. దీనివల్ల దేశంలో సాధారణ పౌరులు దాదాపు  4,000 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగారు. 

 కోవిడ్- 19 సంక్షోభం నేపథ్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన దేశానికి అవసరమైన అత్యవసర  సేవలను అందిస్తోంది.  లాక్ డౌన్ సమయంలో కూడా ఈ  కేంద్రాల ద్వారా అమ్మకాలు సాగాయి.  అవసరమైన మందులను ప్రజలకు సరఫరా చేయాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని నిర్వహించడం జరిగింది.  

***



(Release ID: 1761444) Visitor Counter : 241