బొగ్గు మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ కింద గ్రామాల దశను మారుస్తున్న బొగ్గు కంపెనీలు


నాగ్‌పూర్‌లోని పటాన్‌సౌంగి గ్రామంలో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన కోల్ నీర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాయి.

Posted On: 05 OCT 2021 3:19PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ లో మిషన్ లో మారుమూల గ్రామాలకు తాగునీటిని అందించాలని ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)  అనుబంధ సంస్థ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యుసిఎల్) సమీప  గ్రామస్తుల జీవితాలను మార్చేస్తోంది స్వయం సహాయక బృందం (ఎస్హెచ్జీ) పథకం కింద గ్రామాలకు శుద్ధి చేసిన త్రాగునీటి గని నీటిని అందించడమే కాదు స్థానిక మహిళలకు ఆదాయాన్ని కూడా సమకూర్చుతున్నది. సీఐఎల్లోని ఇతర బొగ్గు కంపెనీలు కూడా సమీప గ్రామాలలో తాగగలిగిన గని నీటిని లాభదాయకంగా వినియోగించుకునే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించాయి. .

 

సోనార్ నుండి బోర్గావ్ వరకు సాగునీటిపారుదల కొరకు మైన్ నీటి సరఫరా చేస్తున్న డబ్ల్యూసీఎల్

 

డబ్ల్యుసిఎల్ ద్వారా సోనర్ నుండి బోర్గావ్ వరకు నీటిపారుదల కొరకు మైన్ నీటి సరఫరా

 

ప్రతిరోజూ 2.5 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్ధ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్యూరిఫికేషన్ కమ్ బాట్లింగ్ కోల్ నీర్ కాంప్లెక్స్ను నాగపూర్ సిటీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాన్సాంగీ గ్రామంలో డబ్ల్యూసీఎల్ ఏర్పాటు చేసింది. ఇది రివర్స్ ఆస్మాసిస్ (ఆర్ఓ) ఆధారిత 5 స్టేజ్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌. గంటకు 100,00 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యంతో పాటు రోజుకు 15000 బాట్లింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఈ నీరు సమీపంలోని పటాన్‌సాంగి భూగర్భ బొగ్గు గని నుండి వస్తోంది.

ఒక ప్రత్యేకమైన పథకం కింద, డబ్ల్యూసీఎల్ పటాన్సౌంగి గ్రామంలోని మహిళా ఎస్హెచ్జీ తో కలిసి, సమీపంలోని గ్రామస్తుల ఇండ్లకు 20 లీటర్ల కూజాలో శుద్ధి చేసిన బొగ్గునీరు పంపిణీకి సహకరించింది. ఒక్కో కూజా ధర రూ .5 కాగా, ఇందులో రూ. 3 ఎస్హెచ్జీకి చెల్లిస్తారు. ఫలితంగా ప్రతి పల్లెటూరు శుభ్రమైన నీటిని పొందడమే కాకుండా గ్రామ మహిళలు కొంత డబ్బు సంపాదించడానికి అవకాశాన్ని అందిస్తుంది. సమీపంలోని 8 గ్రామాల్లోని 10,000 జనాభా ఈ సదుపాయంతో ప్రయోజనం పొందారు.  ఇతర గ్రామాల్లో కవరేజ్ రోజురోజుకు పెరుగుతోంది.

 

డబ్ల్యుసిఎల్ ద్వారా - కోల్ నీర్ బాటిల్ వాటర్ సప్లై

 

డబ్ల్యుసిఎల్ మాదిరే ఎస్సీసీఎల్ ఎన్ఎల్సీఐఎల్తోపాటు సీఐఎల్ వంటి ఇతర బొగ్గు కంపెనీలు తమ కమాండ్ ఏరియా  చుట్టుపక్కల గ్రామాలకు మిగులు గని నీటిని గృహ,  నీటిపారుదల ప్రయోజనం కోసం అందించడం ప్రారంభించాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. మొత్తం 4,600 లక్షల క్యూబిక్ మీటర్ మిగులు గని నీటిని దేశీయ & నీటిపారుదల వినియోగం కోసం వివిధ బొగ్గు కంపెనీల సమీప గ్రామాలకు వచ్చే ఐదేళ్లలోపు సరఫరా చేస్తాయి. ఫలితంగా దాదాపు 16.5 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

 

బొగ్గును వెలికితీసేటప్పుడు, భూమి ఉపరితలం నుండి నీరు కూడా బయటకు వస్తుంది. దీనిని గని ఉత్సర్గ నీరు (మైన్ డిశ్చార్జ్ వాటర్) అని పిలుస్తారు. ఈ నీటిలో కొంత భాగాన్ని బొగ్గు గనిలో చల్లడం, కడగడం, ధూళిని అణచివేయడం మొదలైన వాటి కోసం ఉపయోగిస్తారు, అయితే, ఉపయోగించని నీటిలో ఎక్కువ భాగం సమీపంలోని ప్రవాహాల్లో కలిసిపోతుంది. ఉపయోగించని మిగులు జలాలను ప్రయోజనకరమైన పనులకు వాడుకోవడానికి, డబ్ల్యూసీఎల్ మొట్టమొదట సాగుతాగు నీటి అవసరాల గని నీటిని అందించడం ప్రారంభించింది.  తరువాత దానిని కోల్ నీర్ ప్రాజెక్ట్ కింద శుద్ధి చేసిన తాగునీటిగా మార్చింది.

"మేము దూర ప్రాంతాల నుండి కలుషితమైన తాగునీటిని తీసుకువచ్చి వాడుతున్నాం. కానీ ఇప్పుడు మా ఇంటి వద్దే పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంది. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో  మన జీవనానికి ఆదాయాన్ని అందించడంలో సహాయపడింది" అని రోహ్నా గ్రామ సర్పంచ్ ఉజ్వలా లాండే చెప్పారు. పింప్లా గ్రామానికి చెందిన రోష్ని ఉధవ్ ఎస్హెచ్జీ ద్వారా జీవనోపాధిని అందించిన డబ్ల్యూసీఎల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్హెచ్జీ సభ్యులు ఇప్పుడు తమ స్థానిక కుటీర పరిశ్రమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సంపాదనను ఉపయోగించడం ప్రారంభించారు. శుద్ధి చేసిన నీటి వాడకం గ్రామస్తుల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. ఔషధాల కోసం ఖర్చును గణనీయంగా తగ్గించింది.

***



(Release ID: 1761393) Visitor Counter : 131