ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్యప్రాంత అభివృద్ధిలో ఈశాన్య కౌన్సిల్ పాత్ర అనే అంశంపై షిల్లాంగ్‌లో వర్క్‌షాప్ నిర్వహించిన ఈశాన్యప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్యప్రాంతంలోని 8 రాష్ట్రాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి గారి దార్శనికతను సాకారం చేయడానికి మనం అందరం కలిసి పనిచేద్దాం.--శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2021 2:43PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మేఘాలయ, అస్సాంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. మేఘాలయ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈశాన్య మండలి (ఎన్ ఇసి) ప్రాజెక్టులు, ఈశాన్య రోడ్ రంగ అభివృద్ధి పథకం (ఎన్ ఇఆర్ ఎస్ డి ఎస్) పనులను సమీక్షించారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఎన్ ఇసి సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ, డి.ఒ.ఎన్.ఇ.ఆర్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ లోక్ రంజన్, ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ కార్యదర్శి శ్రీ మోసెస్ చాలై, ఇతర అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, ఈ సందర్భంగా , ఈశాన్య రాష్ట్ర మండలి పాత్రలో మార్పు, ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి పై షిల్లాంగ్‌లోని ఎన్ ఇసి ఆడిటోరియంలో ఏర్పాటు చసిన వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కొనార్డో సంగ్మ, ఈశౄన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి.ఎల్.వర్మ, డిఒఎన్ఇఆర్ కార్యదర్శి శ్రీ లొక్ రంజన్, ఎన్.ఇ.సి కార్యదర్శి శ్రీ మోసెస్ చెలై, ఋశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ జి.కిషన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారు తమ బిజిషెడ్యూలు, రాజ్యాంగ పరమైన బాధ్యతల మధ్య కూడా వారం రోజుల పాటు అష్టలక్ష్మి రాష్ట్రాలలో పర్యటించేందుకు సమయం కేటాయించుకోవడం పట్ల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

"సార్, మీరు మా మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది , ప్రజలతో ఉండాలనే ఈ అభిరుచి మిమ్మల్ని ఈ దేశం చూసిన అత్యంత క్రియాశీల ఉపాధ్యక్షులలో ఒకరిగా చేస్తుంది. కేబినెట్ మంత్రిగా వున్నప్పుడు కూడా మీరు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి మీరు నిరంతరం కృషి చేశారు. అని ఆయన అన్నారు.

ఈశాన్య కౌన్సిల్ పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి గల చిత్తశుద్ధి వారి చర్యల ద్వారా అందరికీ తెలసు. 2016లో వారు ప్రధానమంత్రి అయినపుడు 40 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య మండలి సమావేశాలకు హాజరైన తొలి ప్రధానమంత్రిగా నిలిచారు. వారు 65వ ప్లీనరీ ని ఉద్దేశించి ప్రసంగించారు అని కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ .జి.కిషన్ రెడ్డి, ఈశాన్యప్రాంతంలో రైల్వే, రోడ్ల అనుసంధానత ద్వారా మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు.
రాజధానికి రైలు అనుసంధానత ప్రాజెక్టు కింద మూడు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ , త్రిపురలను ప్రధాన భారతీయ రైల్వే నెట్ వర్క్‌తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. మిగిలిన 5 రాష్ట్రాల రాజధానులను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రగతిపథంలో ఉన్నట్టు ఆయన తెలిపారు. విమానయాన అనుసంధానత కింద రెండు ప్రధాన రాజధానులను గ్రీన్‌ఫీల్డ్ విమానయాన అనుసంధానతను కల్పించే ప్రాజెక్టును చేపడుతున్నట్టు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయరంగానికి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్టాడారు. ఆయిల్ పామ్‌కు సంబంధించి వంటనూనెలపై జాతీయ మిషన్ విషయంలో ఇటీవల కేబినెట్ తీసుకున్న రెండు నిర్ణయాలు, ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ ( ఎన్ ఇ ఆర్ ఎ ఎం ఎ సి) ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ఊతం ఇవ్వనుంది.

ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ కృషిని కూడా కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఈశాన్య ప్రాంత కౌన్సిల్ ఉనికిలోకి వచ్చిన ఈ 50 సంవత్సరాలలో ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కీలక పాత్ర వహించినట్టు ఆయన చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనికత అయిన ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎన్.ఇ.సి చెప్పుకోదగిన చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అందువల్ల ఈరోజు జరిగిన వర్క్‌షాప్ మనందరికి ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు.ఎన్.ఇ.సి పాత్రలో మార్పుఈశాన్య ప్రాంత ఆకాంక్షలకు రూపం ఇవ్వనున్నదని ఆయన అన్నారు.
షిల్లాంగ్ లోని మేఘాలయ రాజ్‌భవన్‌లో జరిగిన మేఘాలయ కళారూపాలు, ఈశాన్య ప్రాంతాల సంప్రదాయలు, సంస్కృతి,
జానపద కళారూపాల ప్రదర్శనలో కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డితో పాటు ఉపరాష్ట్రపతి శ్రీ .ఎం. వెంకయ్యనాయుడు, గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోనార్డ్ సంగ్మా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1761274)
సందర్శకుల సూచీ సంఖ్య : : 191