వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్ నుండి జీఐ ట్యాగ్ పొందిన మిఠాయి మిహిదానా యొక్క మొదటి సరుకు బహ్రెయిన్‌కు ఎగుమతి చేయబడింది

Posted On: 05 OCT 2021 1:37PM by PIB Hyderabad

దేశీయ & భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ నుండి సేకరించిన జీఐ ట్యాగ్ చేయబడిన మిఠాయి మొదటి సరుకు బహ్రెయిన్ కింగ్‌డమ్‌కు ఎగుమతి చేయబడింది.

ప్రత్యేకమైన తీపి వంటకం మిహిదానా సరుకు బహ్రెయిన్‌కు అపెడా రిజిస్టర్డ్ ఎం/ఎం డిఎం ఎంటర్‌ప్రైజెస్, కోల్‌కతా ద్వారా ఎగుమతి చేయబడింది. మరియు ఆ సరుకు అల్‌జజీరా గ్రూప్, బహ్రెయిన్ ద్వారా దిగుమతి చేయబడింది. బహ్రెయిన్‌లోని అల్‌జజీరా సూపర్ స్టోర్స్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తీపి వంటకం వినియోగదారులకు ప్రదర్శించబడుతుంది (రుచి చూసేందుకు కూడా అందించబడింది). రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకమైన తీపి వంటకానికి సంబంధించిన మరిన్ని సరుకులను బహ్రెయిన్‌కు ఎగుమతి చేస్తారు.

శతాబ్దం నాటి తీపి రుచికరమైన మరియు జిఐ గుర్తింపు పొందిన చారిత్రక వారసత్వాన్ని స్మరించుకోవడానికి పాప్డ్-రైస్ బాల్ & ఫ్రెష్ డేట్-పామ్ బెల్లం నుండి తయారు చేయబడిన జయనగర్ మోవాకు సంబంధించి ఇండియా పోస్ట్ ప్రత్యేకంగా రూపొందించిన ఎన్వలప్‌ పశ్చిమ బెంగాల్‌లోని జైనగర్‌లో విడుదల చేయబడింది.

జనవరి, 2021 లో కోల్‌కతాకు చెందిన అపెడా రిజిస్టర్డ్ ఎం/ఎస్‌ డి.ఎం. ఎంటర్‌ప్రైజెస్ ద్వారా జైనగర్ మోవా సరుకు బహ్రెయిన్‌కు ఎగుమతి చేయబడింది.దేశంలో అతి తక్కువ మందికి తెలిసిన మరియు స్వదేశీ, జీఐ ట్యాగ్ చేయబడిన ఆహార ఉత్పత్తులను పెంచడంపై అపెడా దృష్టి సారించింది.

ఆగష్టు, 2021 లో భారత పోస్టల్‌శాఖ పోస్ట్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వీట్ మీట్స్ మిహిదానా మరియు సీతాభోగ్‌ల రూపొందించిన  ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ 2017 లో శతాబ్దం నాటి స్వీట్‌మీట్‌లకు జీఐ ట్యాగ్‌ను పొందారు.

జీఐ ట్యాగ్ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచించే సంకేతం. దాని కారణంగా అది ప్రత్యేక లక్షణాలు లేదా ఖ్యాతిని కలిగి ఉంటుంది. మేధో సంపత్తి హక్కు (ఐపీఆర్‌) యొక్క రూపం జీఐ. అయితే ఇది ఐపిఆర్‌కు చెందిన ఇతర వాటి కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రేడ్‌మార్క్‌లు మరియు పేటెంట్‌ల వలె ఒక వ్యక్తికి కాకుండా ఒక నిర్దిష్ట భౌగోళికంలో సమాజానికి ప్రత్యేకతను ఆపాదిస్తుంది.

జీఐ ట్యాగ్ వ్యవసాయ, సహజమైన లేదా తయారు చేయబడిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక నాణ్యత, ఖ్యాతి లేదా దాని భౌగోళిక మూలానికి ఆపాదించబడిన ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు డార్జిలింగ్ టీ, బాస్మతి బియ్యం, కాంచీపురం సిల్క్, మైసూర్ సిల్క్, హైదరాబాదీ హలీమ్, నాగాలాండ్ మిరప ఉత్పత్తులు మొదలైనవి జీఐ ట్యాగ్‌తో విక్రయించబడుతున్నాయి.

ఆహార ఉత్పత్తుల ఎగుమతి కోసం మార్కెట్ ప్రమోషన్ కార్యకలాపాలు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మార్కెటింగ్‌ తెలివితేటలు, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపు మరియు అధిక-నాణ్యత ప్యాకేజింగ్ వంటి కార్యక్రమాలను అపెడా చేపడుతుంది,

భారతదేశ వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి మ్యాప్‌కు ప్రత్యేకమైన మరియు జీఐ సర్టిఫికేట్ ఉత్పత్తులను తీసుకురావడానికి అపెడా ప్రచార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌కు తాజా పండ్లు మరియు కూరగాయలను ఎగుమతి చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి, మౌలిక సదుపాయాలను నెరవేర్చడానికి రాష్ట్రాలలో ప్యాక్ హౌస్‌లను ఏర్పాటు చేయడానికి అపెడా సహాయం అందిస్తుంది.


 

***



(Release ID: 1761132) Visitor Counter : 238