రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారి భద్రతా బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్
Posted On:
05 OCT 2021 1:30PM by PIB Hyderabad
జాతీయ రహదారి భద్రతా బోర్డును, దాని నిబంధనలను ఏర్పాటు చేస్తున్నట్టు రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ 3 సెప్టెంబర్, 2021న ప్రకటించింది. దాని కూర్పు, బోర్డు చైర్మన్, సభ్యులు కావడానికి అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పదవీకాలం, రాజీనామా, తొలగింపుకు పద్ధతి, బోర్డు అధికారాలు, విధులు, బోర్డు సమావేశాలు తదితర అంశాలను నిబంధనలోని అంశాలు నిర్దేశిస్తాయి.
బోర్డు కేంద్ర కార్యాలయం నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లో ఉంటుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బోర్డు తన కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. బోర్డులో ఒక చైర్మన్, ముగ్గురికి తగ్గకుండా, ఏడుకు మించకుండా సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించనుంది.
రహదారి భద్రత, నూతన సాంకేతికల ఆవిష్కరణ, అనుసరణ, మోటారు వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణకు బోర్డు బాధ్యత వహిస్తుంది. ఇందుకోసం బోర్డు -
ఎ) రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, కొండ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం కోసం నిర్ధిష్ట ప్రమాణాలను రూపొందిస్తుంది.
బి) ట్రాఫిక్ పోలీసుల, ఆసుపత్రి అధికారులు, హైవే అధికారులు, విద్య, పరిశోధన సంస్థలు, ఇతర సంస్థలో సామర్ధ్య నిర్మాణం, నైపుణ్యాల అభివృద్ధికి మార్గరద్శకాలు
సి) కేంద్ర ప్రభుత్వ పరిశీలన కోసం ట్రామా సౌకర్యాలు, పారామెడికల్ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక పాలనా యంత్రాంగానికి రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై సాంకేతిక సలహాలు, సాయం.
దీనితో పాటుగా, ఎ) తోటివారికి తోడ్పడే వ్యక్తులను, బి) రహదారుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, సి) వాహన ఇంజినీరింగ్ రంగంలో నూతన వాహన సాంకేతికత, డి) అంతర్జాతీయ సంస్థలతో సమన్వయ, సహకారాలు, ఇ) అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలు, దేశీయ సాంకేతిక ప్రమాణాల మధ్య ఏకరూపతకు యత్నం, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు, ట్రాఫిక్ నిర్వహణ, సత్వర విచారణపై పరిశోధనను ప్రోత్సహించడం బో్ర్డు విధులలో కొన్ని.
***
(Release ID: 1761112)
Visitor Counter : 179