ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

1.3 కోట్ల క‌న్సల్టేష‌న్లు పూర్తి చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇ సంజీవ‌ని


రోజువారీగా ఇ సంజీవ‌ని ఉప‌యోగించుకుంటున్న రోగులు 90,000

2022 నాటికి 1.55 ల‌క్ష‌ల‌ హెల్త్, వెల్ నెస్ సెంట‌ర్ల‌కు విస్త‌రించ‌నున్న ఇ సంజీవ‌ని ఎబి-హెచ్ డ‌బ్ల్యుసి

Posted On: 04 OCT 2021 6:21PM by PIB Hyderabad
ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఇ సంజీవ‌ని సోమ‌వారం నాటికి 1.3 కోట్ల (13 మిలియ‌న్లు) క‌న్స‌ల్టేష‌న్లు పూర్తి చేసుకుంది. టెలిమెడిసిన్ కోసం కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కార్య‌క్ర‌మం ఇ సంజీవ‌ని. హెల్త్ కేర్ సేవ‌ల డిజిట‌ల్ వేదిక అయిన ఇ సంజీవ‌ని క్ర‌మంగా భార‌త ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌త్యామ్నాయ వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం రోజూ 90,000 మంది రోగులు ఇ సంజీవ‌ని సేవ‌లు ఉప‌యోగించుకుంటున్నారు. ఇ సంజీవ‌నిలోని రెండు విభాగాలు - డాక్ట‌ర్ నుంచి డాక్ట‌ర్ క‌న్స‌ల్టేష‌న్ (ఇ సంజీవ‌ని ఎబి-హెచ్ డ‌బ్ల్యుసి);   రోగి నుంచి డాక్ట‌ర్ (ఇ సంజీవ‌ని ఒపిడి) - దేశ‌వ్యాప్తంగా రిమోట్ క‌న్స‌ల్టేష‌న్లు అందిస్తున్నాయి.

ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019 న‌వంబ‌ర్ లో ప్రారంభించిన ఇ సంజీవ‌ని ఎబి-హెచ్ డ‌బ్ల్యుసిని భార‌త ప్ర‌భుత్వ ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం కింద 2022 డిసెంబ‌ర్ నాటికి హ‌బ్ అండ్ స్పోక్ విధానంలో 1,55,000 హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల‌కు విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇ సంజీవ‌ని ఎబి-హెచ్ డ‌బ్ల్యుసి 27,000కి పైగా హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల ద్వారా ప‌ని చేస్తోంది. దేశంలోని జిల్లా ఆస్ప‌త్రులు, వైద్య క‌ళాశాల‌ల్లో ప‌ని చేస్తున్న 3000 హ‌బ్ ల ద్వారాఈ సేవ‌లు అందుతున్నాయి.
 
టెలిమెడిసిన్ లోని రెండో విభాగం ఇ సంజీవ‌ని ఒపిడిని లాక్ డౌన్ కాలంలో దేశ‌వ్యాప్తంగా ఒపిడి సేవ‌లు నిలిచిపోయిన స‌మ‌యం 2020 ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభించారు. ఇళ్ల‌లోనే బందీలుగా ఉండ‌పోయిన రోగులకు ఔట్ పేషెంట్ సేవ‌లందించ‌డంలో ఇ సంజీవ‌ని ఒపిడి కీల‌కంగా నిలిచింది. ఇ సంజీవ‌ని వేదిక‌పై 4,000 మంది డాక్ట‌ర్లు టెలి మెడిసిన్ సేవ‌లందిస్తున్నారు. సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ మొహాలి బ్రాంచి యాప్ అభివృద్ధి, అమ‌లు, నిర్వ‌హ‌ణ‌, ఆరోగ్య సిబ్బందికి శిక్ష‌ణ వంటి టెక్నిక‌ల్ సేవ‌లందిస్తోంది. అమిత వేగంతో విస్త‌రిస్తున్న ఈ ఇ సంజీవ‌ని వేదిక సామ‌ర్థ్యం పెంచ‌డానికి మొహాలి టీమ్ కృషి చేస్తోంది.

10 రాష్ర్టాలు ఇ సంజీవ‌ని సేవ‌ల అమ‌లులో (1,34,11,325) ముందువ‌రుస‌లో ఉన్నాయి. అవి ఆంధ్ర‌ప్ర‌దేశ్ (42,23,054), క‌ర్ణాట‌క (24,15,774),  త‌మిళ‌నాడు (15,99,283), ఉత్త‌ర ప్ర‌దేశ్ (13,71,799), గుజ‌రాత్ (4,85,735), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (4,47,878), బిహార్ (4,36,383), మ‌హారాష్ట్ర (4,03,376), ప‌శ్చిమ బెంగాల్ (3,69,441), ఉత్త‌రాఖండ్ (2,71,513).
 

సంజీవని న్సల్టేషన్లు

క్రసంఖ్య

04 అక్టోబర్ 2021

మొత్తం

సంజీవని ఎబి హెచ్ బ్ల్యుసి

సంజీవని ఒపిడి

 

ఇండియా

1,34,11,325

80,33,029

53,78,296

1

ఆంధ్ర‌ప్రదేశ్‌

42,23,054

42,00,870

22,184

2

క‌ర్ణాటక‌

24,15,774

9,87,127

14,28,647

3

త‌మిళ‌నాడు

15,99,283

1,31,544

14,67,739

4

ఉత్త‌ప్రదేశ్‌

13,71,799

2,33,572

11,38,227

5

గుజ‌రాత్‌

4,85,735

61,131

4,24,604

6

మ‌ధ్యప్రదేశ్‌

4,47,878

4,42,417

5,461

7

బిహార్‌

4,36,383

4,13,757

22,626

8

మ‌హారాష్ట్ర

4,03,376

3,17,931

85,445

9

ప‌శ్చిమ‌బెంగాల్

3,69,441

3,61,475

7,966

10

ఉత్త‌రాఖండ్‌

2,71,513

662

2,70,851

 

***



(Release ID: 1761003) Visitor Counter : 163