వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బుద్గాం నుంచి మొదటి విడత కాశ్మీర్ వాల్‌నట్‌ల రవాణా
ఓడిఓపి కింద దిగుమతి ప్రత్యామ్నయంగా బెంగళూరుకు 2000 కేజీల వాల్‌నట్లు రవాణా
Posted On:
04 OCT 2021 12:25PM by PIB Hyderabad
బుద్గాం నుంచి కాశ్మీర్ వాల్‌నట్‌ల రవాణా ఇటీవల ప్రారంభమయింది. వాణిజ్య పరిశ్రమల శాఖ అమలు చేస్తున్న ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడిఓపి) కింద కర్ణాటకలోని బెంగళూరుకు బుద్గాం నుంచి 2000 కేజీల వాల్‌నట్లను పంపారు.

ఉత్పత్తి అవుతున్న వాల్‌నట్లలో 90 శాతం కాశ్మీర్ లో ఉత్పత్తి అవుతున్నాయి. అత్యున్నత నాణ్యత కలిగి రుచిగా ఉండే కాశ్మీరీ వాల్‌నట్స్ పోషకాలను కలిగి ఉంటాయి. వీటికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో వీటికి మరింత ప్రాచుర్యం కలిగించడానికి అవకాశం ఉంది. దేశంలో వాల్‌నట్లు ఉత్పత్తి అవుతున్నప్పటికీ వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న అంశాన్ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గుర్తించింది. దిగుమతులను తగ్గించడానికి కాశ్మీర్ వాల్‌నట్లను సరఫరా చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా బుద్గాం నుంచి కాశ్మీర్ వాల్‌నట్‌ల రవాణాను ప్రారంభించారు. కాశ్మీర్ నుంచి వాల్‌నట్‌ల రవాణాను పరిశ్రమలు అంతర్గత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి సుమిత్రా దావ్రా ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి రంజన్ ప్రకాష్ ఠాకూర్, కాశ్మీర్ పరిశ్రమల డైరెక్టర్ తజాయున్ ముఖ్తర్,కాశ్మీర్ ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ ఖలీదా, జమ్మూ కాశ్మీర్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంకితా కార్ పాల్గొన్నారు.
దేశంలో వాల్‌నట్ల మార్కెటీపై ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడిఓపి) కింద అధ్యయనం నిర్వహించారు. దేశంలో వాల్‌నట్లు ఉత్పత్తి అవుతున్నప్పటికీ వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు గుర్తించారు. కాశ్మీర్ లో వాల్‌నట్ల ఉత్పత్తిదారులు, దేశంలో వీటిని దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులతో వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. దేశ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు జరుగుతున్న ప్రయత్నాలకు ఊతం వస్తుంది. మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఇంతవరకు అమెరికా నుంచి వాల్‌నట్లను దిగుమతి చేసుకుంటున్న ఒక వ్యాపారీ కాశ్మీరీ వాల్‌నట్లను కొనుగోలు చేయడానికి అంగీకరించారు. దిగుమతులపై ఆధారపడకుండా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వాల్‌నట్లను ఆయన పొందుతున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా అధికారులు వ్యాపారులతో సమావేశం అయ్యారు. వాణిజ్య వర్గాల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాశ్మీర్ లో వాణిజ్య వ్యాపార పరిశ్రమ రంగాలను అభివృద్ధి చేయడానికి అమలు చేయాల్సి ఉన్న చర్యలను చర్చించారు.
కొనుగోలుదారులు అమ్మకందారుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేయాలని, ఈ-కామర్స్ విధానంలోకి మరిన్ని వ్యవసాయ, హస్తకళ/చేనేత ఉత్పత్తులను చేర్చాలని, జైల్లో లభిస్తున్న ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఓడిఓపి కింద వాణిజ్య పరిశ్రమ శాఖ గుర్తించి ప్రోత్సహించాలని తోటల పెంపకం దారులు మరియు వాణిజ్య ప్రతినిధులు కోరారు.
***
(Release ID: 1760802)
Visitor Counter : 205