ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కీలక 90 కోట్ల మైలు రాయిని దాటిన భారతదేశపు మొత్తం కోవిడ్ -19 వాక్సిన్ కవరేజ్
గత 24 గంటలలో 73.76 లక్షల డోస్‌లు వేయడం జరిగింది.
కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 97.87 శాతం. 2020 మార్చి నుంచి ఇది గరిష్ఠ శాతం.
గత 24 గంటలలో 22.842 కొత్త కేసులు నమోదయ్యాయి.
భారతదేశపు క్రియాశీల కేస్‌లోడ్ (2,70,557). మొత్తం కోవిడ్ కేసులలో ఇది 0.80 శాతం
వారపు పాజిటివిటి రేటు (1.66 శాతం) గత వంద రోజులలో ఇది 3 శాతం కన్న తక్కువ
Posted On:
03 OCT 2021 9:25AM by PIB Hyderabad
గత 24 గంటలలో 73,76,846 వాక్సిన్ డోస్‌లు వేయడంతో, ఇండియాలో కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ చరిత్రాత్మక 90 కోట్ల ను (90,51,75,348) దాటినట్టు ఈ ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం . దీనిని 87,84,333 సెషన్‌లలో సాధించారు.
ఈ ఉదయం 7 గంటల వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం వివిధ కేటగిరీలకు సంబంధించిన సమాచారం కింది విధంగా ఉంది.
--------------------------------------------------------------------
హెచ్‌సిడబ్ల్యు మొదటి డోసు 1,03,73,728
రెండవ డోసు 89,27,894
ఎప్.ఎల్.డబ్ల్యులు మొదటి డోసు 1,83,55,078
రెండవ డోసు 1,50,96,107
18-44 సంవత్సరాల వయసు మధ్య
మొదటి డోసు 36,64,19,042
రెండవ డోసు 8,75,36,699
45-59 సంవత్సరాల వయసు మధ్య
మొదటి డోసు 16,09,82,138
రెండవ డోసు 7,83,06,698
60 సంవత్సరాల పైబడిన వారు
మొదటి డోసు 10,21,47,774
రెండవ డోసు 5,70,30,190
మొత్తం 90,51,75,348
------------------------------------------------------------------------
గత 24 గంటలలో 25,930 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకోవడంతో , మొత్తం కోలుకున్న కోవిడ్ పేషెంట్ల రేటు ( కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ) 3,30,94,529.
ఫలితంగా ఇండియా రికవరీ రేటు 97.87 శాతం గా ఉంది. రికవరీ రేటు ప్రస్తుతం 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయికి చేరుకుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర ప్రయత్నం కారణంగా రోజూ 50,000 కొత్త కేసుల కంటే తక్కువ కేసులు 98 రోజులుగా నమోదు అవుతున్నది.
22,842 కొత్త కేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి.

ప్రస్తుతం క్రియాశీల కేస్ లోడ్ 2,70,557 గా ఉంది. ఇది గత 199 రోజులలో కనిష్టంగా ఉంది. క్రియాశీల కేసులు ప్రస్తుతం దేశ మొత్తం పాజిటివ్ కేసులలో 0.80 శాతంగా ఉంది.

దేశంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున విస్తృత పరచడం జరిగింది. గత 24 గంటలలో మొత్తం 12,65,734 పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇండియాలో ఇప్పటి వరకు 57.32 కోట్ల పరీక్షలు (57,32,60,724) నిర్వహించడం జరిగింది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. వారపు పాజిటివిటీ రేటు 1.66 శాతం వద్ద ఉండి 3 శాతం కంటే తక్కువగా గత 100 రోజులుగా ఉంది. రోజువారి పాజిటివిటి రేటు 1.80 శాతం. రోజువారి పాజిటివిటీ రేటు గత 34 రోజులుగా 3 శాతం గా ఉంది. ఇది వరుసగా 117 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా ఉంది.

***
(Release ID: 1760754)
Visitor Counter : 232