గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆజాది కా అమృతోత్సవ్ జరుపుకోవడంలో భాగంగా 50,000 స్వయం సహాయక బృందాల సభ్యులను బిజినెస్ కరస్పాండెంట్‌లుగా గుర్తించి అంకితం చేసిన డిఎవై - ఎన్ ఆర్ ఎల్ ఎం
2023-24 నాటికి ఒక జిపి, ఒక బిసి సఖి మిషన్ కింద గ్రామీణ ప్రాంతాలలో కనీసం ఒక బిసి సఖిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన
Posted On:
01 OCT 2021 3:21PM by PIB Hyderabad
ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 50,000 మహిళా ఎస్.హెచ్. జి సభ్యులను 2021 సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 మధ్య బిసి సఖిలుగా దేశానికి అంకితం చేయడం జరిగింది. ఈ బిజినెస్ కరస్పాండెంట్‌లు ప్రతి గ్రామ పంచాయితీలలో ఇంటింటి సేవలు అందిస్తారు.ఈ చొరవను ఒక జిపి ఒక బిసి సఖి మిషన్ అంటారు. 2023-24 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాలలో కనీసం ఒక బిసి సఖిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. 50,000 కు పైగా స్వయం సహాయక గ్రూపు మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని బిసి సఖిగా గుర్తించడం జరిగింది. వీరు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఇంటివద్దకే సేవలు అందుబాటులోకి తెస్తున్నారు.
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేషనల్ రూరల్ లైవ్‌లీ హుడ్స్ మిషన్ (డివెవై- ఎన్ ఆర్ ఎల్ ఎం) అనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి ప్రారంభించబడిన నూతన కార్యక్రమం. దీని కింద స్వయం సహాయక బృందాల మహిళలను (బిసి) గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బిజినెస్ కరస్పాండెంట్‌లుగా వ్యవహరింప చేసే ప్రక్రియ. స్వయం సహాయక బృందాలు వారి సభ్యుల ద్వారా నగదు రహిత డిజిటల్ లావాదేవీలను పెంపొందింప చేసేందుకు , రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌లు ( ఎస్.ఆర్.ఎల్. ఎంలు ) స్వయం సహాయక బృందాల సభ్యులను బిజినెస్ కరస్పాండెంట్‌లుగా రాష్ట్రంలోని వివిధ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో(ఆర్.ఆర్.బిలు) సమన్వయం చేసుకోవలసిందిగా సూచచిండం జరిగింది.
స్వయం సహాయక బృందాల మహిళలకు గ్రామీణ స్వయం సహాయక శిక్షణ సంస్థ ( ఆర్ ఎస్ ఇ టి ఐ) లో వారం రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనిని ఆయా జిల్లాల లీడ్ బ్యాంకులు ఏర్పాటు చేశాయి. వారు ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ పొందడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ( ఐఐబిఎఫ్) ముంబాయి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష పాస్ కావలసి ఉంటుంది. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ప్రతి బిజినెస్ కరస్పాండెంట్ కూడా ఐఐబిఎఫ్ సర్టిఫికెట్ పొందవలసి ఉంది.
గ్రామీణ ప్రాంతాలలో ఈ పరీక్షకు హాజరైన 96 శాతం మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు ఈ పరీక్ష పాసయ్యారు. 54,000 మంది మహిళా స్వయం సహాయ బృంద సభ్యులు ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ పొంది బిజినెస్ కరస్పాండెంట్‌లుగా సర్టిఫికేట్ పొందారు. ఈ శిక్షణ లు, ఐఐబిఎఫ్ సర్టిఫికేషన్ ఖర్చును కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ భరించింది.
డిఎవై- ఎన్.ఆర్.ఎల్.ఎం, సిఎస్‌సి ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ( భారత ప్రభుత్వానికి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేట్) గా ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో మౌలిక బ్యాంకింగ్ సేవలు అందించేందుకు డిజి పే సఖి గా స్వయం సహాయక బృందాల సభ్యులను నియోగించడానికి ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందం కింద సిఎస్‌సి - ఇ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ఒక ఫింగర్ ప్రింట్ ఉపకరణాన్ని ఎస్.హచ్.జి సభ్యులకు మౌలిక బ్యాంకింగ్ సేవలను డిజి పే అప్లికేషన్ ద్వారా వారి వారి మొబైల్ హ్యాండ్ సెట్‌లో ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ ఉపకరణం ఖర్చును కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భరిస్తుంది. డిజిపే సఖి గా ఉన్న వారు ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ చెల్లింపు సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద ఇతర సబ్సిడీలను గ్రామీణ ప్రజానీకానికి వారి ఇంటి వద్ద అందజేసే సదుపాయం కూడా ఉంది.
అన్ని ఎస్.ఆర్.ఎల్ ఎం లు జిల్లా స్థాయి కార్యక్రమాలను నిర్వహించాయి. ఇవి జన్ భాగిదారికి పూచీ పడుతున్నాయి. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గోనే బ్యాంకులు, సిఎస్‌సి ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు, జిల్లాకు చెందిన ఇతర కీలక బాధ్యులు 50 వేల మంది స్వయం సహాయక బృంద సభ్యులు బిజినెస్ కరస్పాండెంట్‌లుగా దేశానికి అంకితం చేయడానికి అవసరమైన కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.
***
(Release ID: 1760485)
Visitor Counter : 339