ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
Posted On:
01 OCT 2021 10:07AM by PIB Hyderabad
-దేశవ్యాప్త నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 89.02 కోట్ల మందికి ఇప్పటివరకు టీకాలు ఇవ్వడం జరిగింది.
-గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
-యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇది 0.82 శాతంగా ఉంది; మార్చి 2020 తర్వాత ఇదే అత్యల్పం.
-భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 2,75,224గా నిలిచింది; 196 రోజులలో ఇదే అత్యల్పం.
-రికవరీ రేటు ప్రస్తుతం 97.86 శాతంగా ఉంది; మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం.
-గడిచిన 24 గంటల్లో 28,246 రికవరీలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,30,43,144కు చేరింది.
-గత 98 రోజులకు 3% కంటే తక్కువగా ఈ సారి వారం మొత్తం పాజిటివిటీ రేటు (1.70%) నమోదయింది.
-గత 32 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు (1.76%) 3% కంటే తక్కువగా నమోదవుతోది.
-ఇప్పటి వరకు మొత్తంగా 57.04 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1759987)
Visitor Counter : 135