ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22కు గాను ఆగ‌స్టు నెల‌వ‌ర‌కు భార‌త ప్ర‌భుత్వ ఖాతాల స‌మీక్ష‌

Posted On: 30 SEP 2021 4:49PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ నెల‌వారీ ఖాతాల‌ను ఆగ‌స్టు, 2021వ‌ర‌కు ఏకీకృతం చేసి, నివేదిక‌ల‌ను ముద్రించ‌డం జ‌రిగింది. ముఖ్యాంశాల‌ను దిగువ‌న పేర్కొన‌డం జ‌రిగింది - 
భార‌త ప్ర‌భుత్వం ఆగ‌స్టు 2021వ‌ర‌కు రూ. 8,08,672 కోట్లు ( బ‌డ్జెట్ 2021-22 మొత్తం ఆదాయంలో 40.9%) ఆర్జించింది. ఇందులో రూ. 6,44,843 కోట్లు ప‌న్ను ఆదాయం ( కేంద్రానికి నిక‌రంగా) కాగా, రూ. 1,48,650 కోట్ల ప‌న్నేతర ఆదాయం, రూ. 6,808 కోట్లను రుణ‌రిక‌వ‌రీ నుంచి, రూ. 8,371 కోట్లను వివిధ మూల‌ధ‌న ఆదాయం నుంచి క‌లిపి మొత్తంగా రూ.15,179 కోట్ల రుణ‌ర‌హిత ఆదాయాన్ని ఆర్జించింది. భార‌త ప్ర‌భుత్వం ఆగ‌స్టు 2021వ‌ర‌కు చేయ‌వ‌ల‌సిన ప‌న్నుల వాటా పంపిణీలో భాగంగా రూ. 2,12, 606 కోట్లను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు బ‌దిలీ చేయ‌డం జ‌రిగింది. 
భార‌త ప్ర‌భుత్వం చేసిన వ్య‌యం రూ. 12, 76, 681 కోట్ల ( బ‌డ్జెట్ 2021-22 మొత్తం ఆదాయంలో 36.7%). ఇందులో రూ. 11,04,813 కోట్లు ఆదాయ‌పు ఖాతాపైగా, రూ. 1,71,868 కోట్లు మూల‌ధ‌నం ఖాతాపై. మొత్తం రెవిన్యూ వ్య‌యంలో రూ. 2,78,371 కోట్లు వ‌డ్డీ చెల్లింపుల‌కు, రూ. 1,47,398 కోట్లు ప్ర‌ధాన స‌బ్సిడీలకు ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. 

***
 



(Release ID: 1759758) Visitor Counter : 146