సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1, 2021న వయో నమన్ కార్యక్రమాన్ని నిర్వహిచనున్న సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ
వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేయనున్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు
ఎల్డర్లీ లైన్ 14567ను జాతికి అంకితం చేయనున్న ఎం. వెంకయ్యనాయుడు
సీనియర్ ఏబుల్ సిటిజన్స్ రీఎంప్లాయ్‌మెంట్ ఇన్ డిగ్నిటీ (SACRED), సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ (SAGE) పోర్టళ్ళ ప్రారంభం
Posted On:
29 SEP 2021 4:11PM by PIB Hyderabad
అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం సందర్బంగా సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ అక్టోబర్ 1, 2021న ఉదయం 11.55 నుంచి 1.05 వరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్‌లో సీనియర్ పౌరుల గౌరవార్ధం వయో నమన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వృద్ధుల ప్రయోజనార్ధం ప్రతి ఏడాదీ అక్టోబర్ 1వ తేదీన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై, వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అంతేకాక, ఈ సందర్భంగా ఎల్డర్లీ లైన్ 14567ను జాతికి అంకితం చేయడమే కాక సీనియర్ ఏబుల్ సిటిజన్స్ రీఎంప్లాయ్‌మెంట్ ఇన్ డిగ్నిటీ (SACRED), సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ (SAGE) పోర్టళ్ళను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీమతి ప్రతిమా భౌమిక్, రామ్‌దాస్ అథవాలే, ఎ. నారాయణ స్వామి, సామాజిక న్యాయ, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొననున్నారు.
***
(Release ID: 1759495)
Visitor Counter : 211