ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

పాఠశాలల్లో మరో అయిదు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం 'పీఎం పోషణ్ ' కొనసాగింపు/ సమీక్ష/ మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


పథకం అమలుకు కేంద్రం 54,061.73 కోట్ల రూపాయలు, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 31,733.17 కోట్ల రూపాయల కేటాయింపులు

11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం

Posted On: 29 SEP 2021 3:48PM by PIB Hyderabad

పాఠశాలల్లో  పీఎం పోషణ్ జాతీయ పథకాన్ని 2021-22 నుంచి 2025-26 వరకు 1,30,794.90 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు చేయాలన్న ప్రతిపాదనకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి అవసరమైన నిధుల్లో 54,061.73 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం, 31,733.17 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సమకూరుస్తాయి. ఆహార ధాన్యాలకు అయ్యే అదనపు భారంగా 45,000 కోట్ల రూపాయలను కేంద్రం భరిస్తుంది. 

2021-22 నుంచి 2025-26 వరకు పాఠశాలల్లో ఒక విద్యార్థులకు రోజుకు ఒకసారి వేడి భోజనాన్ని అందించడానికి రూపొందిన పీఎం పోషణ్ పధకానికి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం అన్ని ప్రభుత్వ పాఠశాలలుప్రభుత్వ ఎయిడ్ పొందుతున్న పాఠశాలల్లో నుంచి ఎనిమిది వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుంది. ఇదివరకు దీనిని మధ్యాహ్న భోజన పథకంగా గుర్తింపు పొందిన పాఠశాలల్లో మధ్యాహ్న భోజన జాతీయ పథకం'గా అమలు చేశారు. 

మంత్రివర్గం ఆమోదించిన పథకం దేశంలో 11.20 పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుంది. 2020-21 లో పథకాన్ని అమలు చేయడానికి ఆహార ధాన్యాల ధరతో కలుపుకుని కేంద్రం 24,400 కోట్ల రూపాయలను కేటాయించింది. 

పథకాన్ని మరింత పటిష్టంగాసమర్ధంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ కింద విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు.:

 i.) ప్రభుత్వ మరియు ప్రభుత్వ-ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలలో  ప్రాథమిక తరగతులతో సహా   ప్రీ-ప్రైమరీ లేదా బాల వాటికల్లో చదువుతున్న మొత్తం 11.80 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తించాలని  ప్రతిపాదించబడింది.

ii.) తిథిభోజన విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.  తిథిభోజన విధానం సామాజిక కార్యక్రమంగా అమలు జరుగుతుంది. దీనిలో ప్రజలు ప్రత్యేక సందర్భాలలో/పండుగలలో పిల్లలకు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు.

 iii.) ప్రకృతి మరియు ఉద్యానవనంతో పిల్లలు మమేకం కావడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనికోసం పాఠశాలల్లో పోషకాహారాన్ని అందించే పంటలు, తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీటిలో అదనపు సూక్ష్మ పోషకాలతో ఉత్పత్తి  అయ్యే ఉత్పత్తులను పథకంలోవినియోగిస్తారు.  ఇప్పటికే లక్షలకు పైగా పాఠశాలల్లో ఇటువంటి తోటలు అభివృద్ధి చేయబడ్డాయి.

 iv.) ఈ పథకం సామాజిక ఆడిట్ అన్ని జిల్లాలలో తప్పనిసరి చేయబడింది.

 v.) రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాలు మరియు జిల్లాల్లోని పిల్లలకు అదనపు పోషకాహార వస్తువులను అందించడానికి ప్రత్యేక ఏర్పాటు చేయబడింది.

 

 vi.) స్థానికంగా లభ్యమయ్యే పదార్థాలు మరియు కూరగాయల ఆధారంగా  వంటకాలు సిద్ధం చేయడానికి, వినూత్న పదార్ధాలను భోజనంతో పాటు అందించడానికి  గ్రామ స్థాయి నుంచి  జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిలలో వంట పోటీల పోటీల నిర్వహణను ప్రోత్సహించడం జరుగుతుంది. 

vii.) ఆత్మనిర్భర్ భారత్ సాధన దిశలో భాగంగా పథకం అమలులో రైతుల ఉత్పత్తి సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాలకు పథకం అమలులో ప్రాధాన్యత లభిస్తుంది.  స్థానికంగా ఆర్ధిక పురోగతి సాధించడానికి  స్థానికంగాలభించే సాంప్రదాయ ఆహార పదార్థాల వినియోగానికి ప్రోత్సహించడం జరుగుతుంది. 

  viii.) ప్రగతి పర్యవేక్షణ మరియు తనిఖీల కోసం  ప్రముఖ విశ్వవిద్యాలయాలు / విద్యాసంస్థలకు చెందిన  విద్యార్థులు, ప్రాంతీయ విద్యాసంస్థల, జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ లలో శిక్షణ పొందుతున్న  ఉపాధ్యాయులను  నియమించడం జరుగుతుంది. 

***



(Release ID: 1759331) Visitor Counter : 259