బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్‌'లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు

Posted On: 28 SEP 2021 3:04PM by PIB Hyderabad

మైనింగ్‌ ఉత్పత్తి సంబంధిత సమస్యలను ప‌రిష్కారానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాల‌ని సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐ) & డైరెక్టర్ (టీ), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) సీఎండీ శ్రీ బినయ్ దయాళ్ అన్నారు. ఆయ‌న నిన్న బిలాస్‌పూర్‌లో ఎంపీడీఐ ఆర్ఐ-V విభాగాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ్రౌండ్ పెనెట్రేటింగ్ ర‌డార్ (జీపీఆర్‌) ప్రారంభించారు.  శ్రీ దయాలాల్సో సీస్మిక్ డేటా ప్రాసెసింగ్ మరియు ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన మినీ రత్న కంపెనీ అయిన సీఎంపీడీఐ  ద్వారా సేకరించిన పారాడిగ్మ్ సాఫ్ట్‌వేర్ యొక్క పనితీరును మరియు ప్రయోజల‌న్ని సమీక్షించారు. సంస్థ‌లో నిర్వ‌హించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం (అక‌మ్‌) వేడుకలలో భాగంగా శ్రీ దయాళాల్‌ ఇతర సీనియర్ కార్యనిర్వాహకులు ఆర్ఐ-V ప్రాంగణంలో మొక్కలు నాటారు, సీఎంపీడీఐ యొక్క ప్రాంతీయ ఇన్‌స్టిట్యూట్-వీ యొక్క నివాస సముదాయం/కాలనీని సందర్శించారు. సంస్థలో అందుబాటులో ఉన్న మొత్తం సౌకర్యాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించారు. ఆజాది కా అమృత్ మహోస్తవ్ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు గాను సీఎంపీడీఐ, యొక్క ఆర్ఐ-II, ధన్బాద్ ద్వారా వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి.  ఈ వేడుక‌ల‌లో భాగంగా కర్మతాండ్‌లో అప్‌గ్రేడ్ చేసిన హైస్కూల్‌లో విష‌య ప్రసంగం, క్విజ్ పోటీలను నిర్వ‌హించారు. ఆయా కార్య‌క్ర‌మాల‌లో పిల్లలు తమ ఆలోచనలను ప్రదర్శించారు.  మన స్వాతంత్ర్య సమరయోధులు మరియు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వారు అందించిన సేవ‌ల‌ను గురించి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు వివ‌రించారు. దేశ స్వాతంత్య్రోద్యమ విష‌యం ఆధారంగా నిర్వ‌హించిన ఆబ్జెక్టివ్ క్విజ్ పోటీలు ఈ వేడుకల‌లో ప్ర‌ధానాంశాల‌లో ఒక‌టిగా నిలిచింది. పిల్లలు ఉత్సాహంగా, దేశభక్తితో పోటీలో పాల్గొన్నారు.

***

 


(Release ID: 1759102) Visitor Counter : 174