మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
అసోచామ్ మత్స్య, ఆక్వాకల్చర్ రంగం పరిశ్రమను ఉద్దేశించి ప్రసంగించనున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల
Posted On:
27 SEP 2021 1:01PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి కాలానంతరం మత్స్య, ఆక్వా కల్చర్ రంగాలను పునరుజ్జీవనం చేసేందుకు ప్రత్యేక పద్ధతిపై నేడు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఈ రంగాన్ని ప్రోత్సహించి, అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎంఎంఎస్‌వై, ఇతర పథకాల విశేషతలను పట్టి చూపనున్నారు.
మత్స్య, ఆక్వా కల్చర్ పరిశ్రమకు సంబంధించి దేశంలోని అత్యున్నత చాంబర్ ఆఫ్ కామర్స్ అయిన అసోచామ్ (ASSOCHAM) నేడు వర్చువల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించనుంది. నీలి విప్లవం, ఆర్థిక వృద్ధికి తోడ్పడే వ్యూహాత్మక మార్గదర్శకం అన్నది ఈ సమావేశ ఇతివృత్తం. ఈ రంగం చెప్పుకోదగిన వేగంతో మెరుగుపరిచి, మత్స్య, ఆక్వాకల్చర్ నూతన శకంలోకి ప్రవేశించేందుకు ఈ రంగంలో తాజా అవకాశాలపై దృష్టి పెట్టి ఉత్పాదకతను మెరుగుపరచడం, అలాగే సాంకేతికత, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎగుమతి, మౌలిక సౌకర్యాలు వంటి అవసరమైన చర్యలపై చర్చించనున్నారు.
కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సమక్షంలో, దేశవ్యాప్తంగా భిన్న నేపథ్యాల నుంచి వచ్చినన వక్తలతో, ఈ సమావేశం దేశవ్యాప్తంగా మత్స్య, ఆక్వాకల్చర్ రంగాలను పునరుద్ధరించేందుకు అవకాశం ఉన్న అన్ని సంభావ్య పద్ధతులను చర్చించనున్నది. ఈ సమావేశంలో ప్రసంగించనున్న ప్రముఖ ప్రభుత్వ అతిథి, అధికారులలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ది మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కె ఎస్ శ్రీనివాస్, ఐఎఎస్, భారత మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా, ఒరిస్సా ప్రభుత్వానికి చెందిన అగ్రికల్చర్ ప్రొమోషన్ & ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిషా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ర్ డాక్టర్ ప్రవత్ కుమార్ రౌల్ ఉన్నారు.
మత్స్య, ఆక్వాకల్చర్ పరిశ్రమల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్, మయాంక్ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టటర్ డాక్టర్ మనోజ్ ఎంశర్మ, ఆక్వా కనెక్ట్ చీఫ్ అలెయెన్స్ అధికారి అమిత్ సాలుంఖే, అసోచామ్ చైర్మన్, గుజరాత్ కౌన్సిల్,, గ్రూప్ ప్రెసిడెంట్, వెల్ స్పన్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాలు, స్ట్రాటజిక్ ప్లానింగ్ అధిపతి చింతన్ థాకర్, అసోచామ్ గుజరాత్ కౌన్సిల్‌కు చెందిన వ్యవసాయ& వ్యవసాయ ప్రాసెసింగ్ కమిటీ చైర్మన్ ధావల్ రావల్ ప్రసంగించనున్నారు. ది ఎస్ఎంఇ ఇండియా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ వెంకటేష్ అయ్యర్ ఈ సదస్సుకు మాడరేటర్‌గా వ్యవహరిస్తారు.
మత్స్య, ఆక్వాకల్చర్ పరిశ్రమకు చెందిన ప్రధాన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విద్యావేత్తలు, బ్యూరోక్రాట్లు, ఎఫ్‌పిఒలు, పరిశ్రమకు చెందిన ఇతర ప్రొఫెషనల్స్ హాజరుకానున్నారు.
***
(Release ID: 1758754)