ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, నిరంతరాయ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తుంది. ఇది డిజిటల్ హెల్త్ సిస్టమ్‌లో సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశం కల్పిస్తుంది.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది
ఈ నూతన మిషన్ కింద ప్రతి పౌరుడూ డిజిటల్ ఆరోగ్య ఐడిని , వారి ఆరోగ్య రికార్డును పొందగలుగుతాడు. వీటికి డిజిటల్ పరంగా రక్షణ ఉంటుంది.
దేశంలోని మారుమూల ప్రాంతాలలో నివశిస్తున్న మా సోదర సోదరీమణులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు ఈ మిషన్ ప్రారంభం వల్ల అందుబాటులోకి వస్తాయి. వారి జీవితాలను మరింత మెరుగు పరిచేందుకు మనం మరో అడుగు ముందుకు వేయడానికి ఉపకరిస్తుంది.
Posted On:
27 SEP 2021 1:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌షుక్ మాండవీయ , కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ ప్రవీణ్ పవార్ సమక్షంలో ప్రధానమంత్రి దీనిని ప్రారంభించారు.
ఈ చరిత్రాత్మక కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసేందుకు గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాలు ఇవాళ కొత్త దశకు చేరుకున్నట్టు ఆయన తెలిపారు. ఈరోజు మనం దేశంలో ఆరోగ్య సదుపాయాలకు సంబంధించి విప్లవాత్మక మార్పులకు ఊతం ఇవ్వగల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని ప్రధానమంత్రి అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ఆరోగ్యసేతు యాప్ చాలావరకు ఉపయోగపడిందని ప్రధానమంత్రిఅన్నారు. ఇవాళ దేశంలో ఉచిత వాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 90 కోట్ల వాక్సిన్ డోస్‌లు రికార్డు స్థాయిలో వేయడంలో కో విన్ పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో టెక్నాలజీ వాడకానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కరోనా సమయంలో మున్నెన్నడూ లేని స్థాయిలో టెలిమెడిసిన్ సేవలు విస్తరించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ ఈ సంజీవని కింద 125 కోట్లమంది రిమోట్ కన్సల్టేషన్ ను పూర్తి చేసుకున్నారన్నారు. ఈ సదుపాయాన్ని ప్రతిరోజూ దేశంలోని మారుమూల ప్రాంతాలలోని వేలాది మంది దేశవాసులను ఇంట్లోనే కూర్చుని, నగరాలలోని పెద్ద పెద్ద ఆస్పత్రులలోని వైద్యులతో అను సంధానం చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, దేశవ్యాప్తంగాగల ఆస్పత్రులతో ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మిషన్ ఆస్పత్రులకు సంబంధించిన వివిధ ప్రక్రియలను సులభతరం చేయడమే కాక, సులభతర జీవనానికి వీలు కల్పిస్తుంది. దీనికింద, ప్రతి పౌరుడూ డిజిటల్ ఆరోగ్య ఐడిని పొందుతాడు, వారి ఆరోగ్య రికార్డుకు డిజిటల్ పరంగా రక్షణ ఉంటుంది.
భారతదేశం సంపూర్ణమైన , అందరినీ కలుపుకుపోయే ఆరోగ్య నమూనాపై పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇది ముందస్తు ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెడుతున్నదన్నారు. ఏదైనా జబ్బులు వచ్చినపుడు, సులభమైన, చవక అయిన , అందరికీ అందుబాటులో చికిత్సను ఈ నమూనా అందుబాటులోకి తెస్తుందన్నారు. వైద్యవిద్యలో మున్నెన్నడూ లేనంతటి సంస్కరణలను ఆయన ప్రస్తావించారు.
ఏడు- ఎనిమిది సంవత్సరాల క్రితం తో పోలిస్తే వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని పెద్ద సంఖ్యలో తయారు చేయడం జరుగుతోందని అన్నారు. ఎయిమ్స్, ఇతర ఆధునిక ఆరోగ్య సంస్థలను దేశంలో ఏర్పాటు చేయడం జరుగుతోందని, ప్రతి మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఒక వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాలలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడం జరుగుతోందని, గ్రామాలలో, ప్రైమరి హెల్త్‌సెంటర్ నెట్ వర్క్‌లు, వెల్‌నెస్ సెంటర్‌లు బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. 80 వేలకు పైగా ఇలాంటి సెంటర్లు ఇప్పటికే కార్యరూపం దాల్చాయని ప్రధానమంత్రి తెలిపారు.80 వేలకు పైగా ఇలాంటి కేంద్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ స్వాస్థ్య అమృత్ ను కొనసాగిస్తుండడంపట్ల ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దేశంలోని చిట్టచివరి పౌరుడికి అందించడం, ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఆరోగ్య మంథన్ కొనసాగించడం పట్ల ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికి మూడేళ్లు.
2020 స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆయన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు సంబంధించిన ఈ చర్య ఆరోగ్య రంగాన్ని పరివర్తన చెందేలా చేస్తుందని, పౌరులందరి జీవితాలలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.
శ్రీ మాండవీయ ఈ పథకంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ,దీనిని ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో సత్వర అమలు గురించి ఆయన ప్రస్తావించారు. పాత వైద్య రికార్డులు అందుబాటులో లేకుండా పోరాదని, వాటిని డిజిటల్ రూపంలో భద్రపరచనున్నట్టు ఆయన తెలిపారు. డిజిటల్ ప్రక్రియ డిజిటల్ కన్సల్టేషన్ వంటి ఎన్నో పలు ఇతర సదుపాయాలకు వీలు కల్పిస్తుందని అయన అన్నారు. వైద్య వృత్తిలోని వారు వైద్య రికార్డులను పరిశీలించడానికి పేషెంట్ అనుమతి తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయని అంటూ, ఈరోజు మనం సాధించినది ఇండియా చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం వెబ్ కాస్ట్ కిందిలింక్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=xvTq_N-Syas
***
(Release ID: 1758749)
Visitor Counter : 423