ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎయిమ్స్ ఢిల్లీ వైద్యుల సామూహిక బదిలీలపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిని ఉటంకిస్తూ మీడియా లో వ‌చ్చిన నివేదికలు నిజ‌మైన‌వి కావు మరియు తప్పుదారి పట్టించేవి

Posted On: 26 SEP 2021 1:41PM by PIB Hyderabad

ఎయిమ్స్ 66 వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగిస్తూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సామూహిక బదిలీ ఉంటాయ‌ని ప్రకటన
చేసినట్లుగా కొన్ని మీడియాల‌లో అవాస్త‌వ‌మైన వార్త‌లు వ‌చ్చాయి.  దేశ వ్యాప్తంగా అన్ని ఎయిమ్స్‌లో ఏక రీతి వైద్య ప్రమాణాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం త్వరలో బదిలీ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈ వార్త‌లు పేర్కొన్నాయి. ఈ విధానం ఎయిమ్స్ ఢిల్లీలోని డాక్టర్లను కొత్త ఎయిమ్స్‌కు బదిలీ చేయడానికి దారితీస్తుంద‌ని.. దీని వ‌ల్ల‌ఎయిమ్స్ ఢిల్లీకి కొత్త డాక్టర్ల నియామ‌కానికి దారి తీస్తుంద‌ని ఈ మీడియా వార్త‌ల్లో  పేర్కొన్నారు. నిన్న ఎయిమ్స్ న్యూఢిల్లీ 66 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం నుండి కేంద్ర ఆరోగ్య మంత్రిని ఉటంకిస్తూ వివిధ వార్తాపత్రికలు పేర్కొన్న ఇలాంటి ముఖ్య వార్త‌లు తప్పు మరియు తప్పుదోవ పట్టించేవి అని స్పష్టం చేయబడింది. కేంద్ర మంత్రి నిన్న అలాంటి ప్రకటనలేవీ చేయలేదు. ఈ త‌ర‌హా వార్త‌లు పూర్తిగా అవాస్తవం, తప్పు సమాచారం , వాస్తవాలను స్పష్టంగా తప్పుగా నివేదించ‌డ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ ఎయిమ్స్ నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులు దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్న‌ కొత్త ఎయిమ్స్‌ను సుసంపన్నం చేస్తారని శ్రీ మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యాపకులు తమ గొప్ప అనుభవంతో... ఈ సంస్థలకు మార్గదర్శక కాంతిగా  పని చేయవ‌చ్చ‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి మాట్లాడిన ప్రసంగాన్ని ఇక్కడ క్లిక్ చేయ‌డం ద్వారా వీక్షించ‌వచ్చు:
                                                                                 

****


(Release ID: 1758407) Visitor Counter : 218