పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రేపు 'నిధి 2.0', ' భారత పర్యాటక వివరాలు 2021'లను ఆవిష్కరించనున్న పర్యాటక శాఖ


కార్యక్రమంలో పాల్గొననున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 26 SEP 2021 3:41PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

కార్యక్రమానికి హాజరుకానున్న పర్యాటక శాఖ సహాయ మంత్రులు శ్రీ అజయ్ బట్శ్రీ శ్రీపాద్ యెస్సో 

అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయనున్న పర్యాటక మంత్రిత్వ శాఖయునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం మరియు ది రెస్పాన్సిబుల్ టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియా 

                  పర్యాటకం ద్వారా సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రపంచ పర్యాటక సంస్థ  సూచన మేరకు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ రేపు ( సెప్టెంబర్ 27) ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవుతారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, సహాయ  మంత్రులు శ్రీ అజయ్ బట్శ్రీ శ్రీపాద్ యెస్సో  కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మంత్రిత్వ శాఖ అధికారులురాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. 

భారతదేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనితో పర్యాటక రంగం నెమ్మదిగా కోలుకుంటూ సాధారణ స్థాయికి చేరుతున్నది. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రభావం నుంచి అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగం కూడా తేరుకుంటున్నది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధించడానికి సిద్ధంగా వుంది. పర్యాటక రంగం అనేక వర్గాలురంగాలపై ప్రభావం చూపుతుంది. అన్ని వర్గాలుప్రాంతాలతో పాటు వ్యవసాయంకళలుచేతి వృత్తులు లాంటి రంగాలు పర్యాటక రంగం వల్ల ప్రభావితం అవుతాయి. దీనితో దేశం అన్ని రంగాలలో సంపూర్ణ అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. పర్యాటక రంగ ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 27 వ తేదీని ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. పర్యాటక రంగ ప్రాధాన్యతనుసామాజికసాంస్కృతికరాజకీయఆర్థిక రంగాలపై ఇది చూపే ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నిధి 2.0 (నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) మరియు ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ - ఎట్ ఎ గ్లాన్స్ , 2021’ ప్రారంభిస్తారు.

పర్యాటక రంగంలో సుస్థిరత కార్యక్రమాలను ప్రోత్సహించి అమలు చేయడానికి  పర్యాటక మంత్రిత్వ శాఖ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం  మరియు ది రెస్పాన్సిబుల్ టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియాల మధ్య కుదిరిన ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. 

***


(Release ID: 1758347) Visitor Counter : 227