ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2021 సెప్టెంబర్ 26 వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 81 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 SEP 2021 11:43AM by PIB Hyderabad

నా ప్రియమైన దేశ వాసులారా, నమస్కారం.  ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం నేను అమెరికా వెళ్లవలసి వస్తోంది అన్న సంగతి మీరు ఎరుగుదురు కాబట్టి అమెరికా వెళ్లే ముందే ‘మన్ కీ బాత్’(‘మనసు లో మాట’ కార్యక్రమం)ను రికార్డు చేయడం మంచిది అని నేను అనుకున్నాను. సెప్టెంబర్‌ లో ‘మన్ కీ బాత్’(‘మనసు లో మాట’ కార్యక్రమం) ప్రసారం అయ్యే తేదీననే మరొక ముఖ్యమైన రోజు కూడా ఉంది.  మనం చాలా రోజుల ను గుర్తు పెట్టుకొంటామనుకోండి, వివిధ దినోత్సవాలను కూడా జరుపుకొటూ ఉంటాం.  మీ ఇంట్లో నవయవ్వనులైన అబ్బాయి లు, అమ్మాయి లు ఉంటే, ఒకవేళ వారి ని పూర్తి సంవత్సరం లో ఏ రోజు ఎప్పుడు వస్తుంది అని అడిగితే గనక,  మీకు పూర్తి జాబితా ను వినిపించేస్తారు; కానీ, మనం అందరం గుర్తు ఉంచుకోవలసిన మరో రోజు ఉంది.  ఆ రోజు భారతదేశ సంప్రదాయాల కు అనుగుణమైంది.  శతాబ్దాల తరబడి ఏ సంప్రదాయాల తో మనం జతపడి ఉన్నామో దాని తో కలిపేటటువంటిది. ఇదే ‘వరల్డ్ రివర్ డే’. అంటే ప్రపంచ నదుల దినోత్సవం.

మనకు ఒక లోకోక్తి ఉంది -

          “పిబంతి నద్ య: స్వయ-మేవ నాంభ:” అని.

ఈ మాటల కు.. నదులు వాటి నీటి ని స్వయం గా తాగవు. అయితే పరోపకారం కోసం ఆ జలాల ను అందిస్తాయి.. అని భావం. మనకు నదులు భౌతికమైనటువంటి వస్తువులు కావు. మనకు నది ఒక సజీవ వనరు లు.  అందుకే మనం నదుల ను నదీమతల్లులు అని పిలుస్తాం.  మనకు ఎన్ని పండుగలు పబ్బాలు ఉన్నా, వేడుక లు, ఉత్సవాలు, ఉల్లాసాలు ఉన్నా, అవి అన్నీ మన ఈ తల్లుల ఒడిలోనే జరుగుతాయి.


మాఘ మాసం వచ్చినప్పుడు మన దేశం లో చాలా మంది ప్రజలు గంగ మాత ఒడ్డు న లేదా ఇతర నదుల ఒడ్డు న ఒక నెల మొత్తం గడుపుతాం అనేది మీకందరి కి తెలిసిన విషయమే.  ఇప్పుడు లేదు కానీ పూర్వ కాలం లో మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా నదుల ను గుర్తు చేసుకొనే సంప్రదాయం ఉండేది.  ఈరోజుల లో ఈ సంప్రదాయం కనుమరుగై ఉండవచ్చు లేదా చాలా తక్కువ పరిమాణం లో ఉండి ఉండవచ్చు.  కానీ ఈ సంప్రదాయం చాలా గొప్పది.  ఉదయమే- స్నానం చేసే సమయం లో-  విశాలమైన భారతదేశ యాత్ర చేసే సంప్రదాయం ఇది.  ఇది ఒక మానసిక యాత్ర.  ఇది దేశం లోని ప్రతి మారుమూల ప్రాంతం తో అనుసంధానం అయ్యేందుకు ప్రేరణ గా మారింది.  అది భారతదేశం లో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని వల్లించే సంప్రదాయం.

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి |

నర్మదే సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధిం కురు ||

ఇంతకు ముందు మన ఇళ్ల లో పిల్లల కోసం కుటుంబ పెద్దలు ఈ శ్లోకాల ను గుర్తుపెట్టుకొనే వారు.  ఇది మన దేశం లో నదుల పై విశ్వాసాన్ని నింపేది.  విశాలమైన భారతదేశ పటం మనస్సు లో ముద్రించబడి ఉండేది.  నదుల కు అనుసంధానం గా ఉండేది.  మనకు తల్లి గా తెలిసిన నది- చూస్తుంది, జీవిస్తుంది.  ఆ నది పై విశ్వాస భావన జన్మించింది.  ఇది ఒక ధార్మిక సంస్కార ప్రక్రియ.  మిత్రులారా, మన దేశం లో నదుల మహిమ ను గురించి మాట్లాడుకొంటున్నప్పుడు సహజం గా ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న ను లేవనెత్తడం సహజం.  ప్రశ్న ను లేవనెత్తే హక్కు కూడా ఉంది.  దానికి సమాధానం చెప్పడం మన బాధ్యత కూడాను.  ఎవరైనా ప్రశ్న అడుగుతారు-  “సోదరా, మీరు నది గురించి చాలా పాటలు పాడుతున్నారు.  నది ని తల్లి అని పిలుస్తున్నారు.  మరి ఈ నది ఎందుకు కలుషితం అవుతోంది?” అని.  నదుల ను ఏ కొద్ది గా కలుషితం చేయడం అయినా తప్పు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.  మన సంప్రదాయాలు కూడా ఇలాగే ఉన్నాయి.  మన భారతదేశం లోని పశ్చిమ భాగం-  ముఖ్యం గా గుజరాత్ , రాజస్థాన్‌ లలో - నీటి కొరత చాలా ఉందని మీకు తెలుసు.  చాలా సార్లు అనావృష్టి పరిస్థితులు ఎదురవుతాయి.  మరి ఈ కారణం గా అక్కడి సమాజ జీవితం లో ఓ కొత్త సంప్రదాయం ఏర్పడింది.  గుజరాత్‌ లో వర్షాలు మొదలైనప్పుడు జల్-జీల్ నీ ఏకాదశి ని జరుపుకొంటారు.  దీనికి అర్థం ఈ యుగం లో మనం దేనినైతే ‘క్యాచ్ ది రేన్’ అని అంటామో- అది అదే అన్న మాట.  జలం తాలూకు ఒక్కొక్క బిందువు ను ఒడిసిపట్టుకోవడమే, జల్- జీల్ నీ. అదే మాదిరి గా వర్షం అనంతరం బిహార్ లోనూ,  తూర్పు ప్రాంతాల్లోనూ ఛఠ్ మహాపర్వాన్ని జరుపుకొంటారు.  ఛఠ్ పూజ ను దృష్టి లో పెట్టుకొని  నదుల తీర ప్రాంతాల ను, ఘట్టాల ను శుభ్రపరచడం, మరమ్మతు  సన్నాహాల ను మొదలుపెట్టడం జరిగిపోయాయని ఆశిస్తున్నాను.  నదుల ను శుభ్రం చేయడం, వాటి ని కాలుష్యం బారి నుంచి విముక్తం చేసే పని ని అందరి ప్రయత్నాలతో, అందరి సహకారం తో చేయడం సాధ్యమే.  ‘నమామి గంగే మిశన్’ సైతం ఇవాళ పురోగమిస్తున్నది అంటే అందులోనూ ప్రజలందరి ప్రయాస లు, ఒక రకం గా ప్రజా చైతన్యం, జన ఆందోళన, వాటి కి చాలా పెద్ద పాత్ర ఉంది.

సహచరులారా, నది ని గురించి మాట్లాడుకొంటూ ఉన్నప్పుడు,  గంగా మాత ను గురించి మాట్లాడుకొంటూ ఉన్నప్పుడు- మరొక్క సంగతి ని గురించి కూడా మీ దృష్టి కి తీసుకు రావాలని అనిపిస్తున్నది.  మనం ‘నమామి గంగే’ ను గురించిన ప్రస్తావన వచ్చింది అంటే అప్పుడు తప్పక ఒక విషయాన్ని మీరు గమనించి ఉండాలి.  మరి మన యువత దీని ని ఖచ్చితం గా గమనించే ఉంటారు.  ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి  ఇ-ఆక్శన్ జరుగుతోంది.  ఈ ఎలక్ట్రానిక్ వేలంపాట ప్రజలు నాకు ఆయా సందర్భాల లో ఇచ్చినటువంటి బహుమతుల కు సాగుతున్న వేలంపాట.  ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు ను ‘నమామి గంగే’ ఉద్యమాని కి ఇవ్వడం జరుగుతుంది.  మీరు ఎంతటి ఆత్మీయ భావన తో నాకు బహుమతుల ను ఇస్తుంటారో, అదే భావన ను ఈ ఉద్యమం మరింత బలపరుస్తుంది.

సహచరులారా, దేశవ్యాప్తంగా నదుల ను పునర్జీవింపచేయడానికి, నీటి స్వచ్ఛత కోసం ప్రభుత్వం, సామాజిక సేవా సంస్థ లు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొంటూ ఉంటాయి.  ఇది ఈ రోజు నుంచి కాదు, దశాబ్దాలు గా కొనసాగుతోంది.  కొంతమంది అలాంటి పనుల కోసం తమ ను తాము సమర్పణం చేసుకొంటూ ఉంటారు.  ఈ సంప్రదాయం, ఈ ప్రయత్నం, ఈ విశ్వాసం మన నదుల ను కాపాడుతున్నాయి.  భారతదేశం లోని ఏ ప్రాంతం నుంచి అయినా అలాంటి వార్త లు నా చెవి కి చేరినప్పుడు  అలాంటి పని చేసే వారి పట్ల గొప్ప గౌరవ భావం నా మనస్సు లో అంకురిస్తుంది.  ఆ విషయాలు మీకు చెప్పాలని కూడా అనిపిస్తుంది.  చూడండి, నేను తమిళ నాడు లోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లా ల తాలూకు ఒక ఉదాహరణ ను ఇవ్వదలుస్తున్నాను.  అక్కడ నాగా నది అనే ఒక నది ప్రవహిస్తుంది.  ఈ నాగా నది కొన్ని సంవత్సరాల కిందట ఎండిపోయింది.  ఈ కారణం గా అక్కడ నీటి మట్టం కూడా చాలా తక్కువ స్థాయి కి పడిపోయింది.  కానీ అక్కడి మహిళ లు తమ నది ని పునరుజ్జీవింపచేయాలని నడుం బిగించారు. వారు ప్రజల తోడు తీసుకొన్నారు.  ప్రజల భాగస్వామ్యం తో కాలువల ను తవ్వారు.  చెక్ డ్యామ్‌ల ను నిర్మించారు. రీచార్జ్ బావుల ను తయారు చేశారు.  సహచరులారా, ఈ రోజు ఆ నది నీటి తో నిండిపోయిందని తెలుసుకొంటే మీరు కూడా సంతోషిస్తారు.  నీటి తో నది నిండిందనుకోండి, అప్పుడు మనస్సు కు ఎంత హాయి గా ఉంటుంది అంటే నేను ఈ అనుభవాన్ని ప్రత్యక్షం గా పొందాను.

సాబర్ మతి నది ఒడ్డు న మహాత్మ గాంధీ సాబర్ మతి ఆశ్రమాన్ని నిర్మించిన విషయం మీలో చాలా మంది కి తెలుసు.  ఆ సాబర్ మతి నది గత కొన్ని దశాబ్దాల లో ఎండిపోయింది.  సంవత్సరం లో 6-8 నెలల పాటు నీరు కనిపించేది కాదు. కానీ నర్మదా నది ని, సాబర్ మతి నది ని జోడించడం జరిగింది. మరి ఒకవేళ మీరు అహమదాబాద్ కు వెళ్లారంటే సాబర్ మతి నది జలం మనస్సు కు ఉల్లాసాన్ని ఇస్తుంది.  అదేవిధం గా తమిళ నాడు కు చెందిన మన సోదరీమణులు చేసిన పనుల వంటి అనేక కార్యక్రమాలు దేశం లోని వివిధ ప్రాంతాల లో జరుగుతున్నాయి.  మన ధార్మిక  సంప్రదాయం తో సంబంధం ఉన్న అనేక మంది సాధువులు, గురువులు వారి ఆధ్యాత్మిక ప్రయాణం తో పాటు నీటి కోసం, నదుల కోసం చాలా కార్యాలు చేస్తున్నారన్న సంగతి ని నేను ఎరుగుదును.  చాలా మంది నదుల తీరాల లో మొక్కల ను నాటడానికి ఉద్యమం నడుపుతున్నారు.  మరిన్ని నదుల లోకి పారుతున్న మురికి నీటి ని ఆపివేయడం జరుగుతున్నది.

సహచరులారా, మనం ఈ రోజు ‘వరల్డ్ రివర్ డే’ ను జరుపుకొంటున్న సందర్భం లో ఈ పని కి అంకితం అయిన వారందరి ని నేను ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను.   భారతదేశం లో మూల మూల న సంవత్సరాని కి ఒక సారి నదీ ఉత్సవాన్ని జరిపి తీరాలి అంటూ ప్రతి నది దగ్గర నివసిస్తున్న వారి కి, దేశ వాసుల కు నేను విన్నవించుకొంటున్నాను.

ప్రియమైన నా దేశవాసులారా, ఎప్పడైనా సరే చిన్న మాట ను, చిన్న వస్తువు ను చిన్నది గా పరిగణించే తప్పు ను  చేయకూడదు.  చిన్న చిన్న ప్రయాసలతోనే అప్పుడప్పుడు  పెద్ద మార్పులు వస్తాయి.  మరి మహాత్మ గాంధీ గారి జీవనాన్ని మనం పరిశీలించామా అంటే గనక చిన్న చిన్న విషయాల కు సైతం ఆయన జీవనం లో ఎంతటి ప్రాముఖ్యం ఉండిందో మనం అనుక్షణం అనుభవం లోకి తెచ్చుకొంటాం.  ఆ చిన్న చిన్న  అంశాల ను పరిగణన లోకి తీసుకొని ఆయన పెద్ద సంకల్పాల ను ఎలా సాకారం చేశారో తెలుస్తుంది.  స్వచ్ఛత అభియాన్ స్వాతంత్య్రోద్యమాని కి నిరంతర శక్తి ని ఎలా అందించిందో మన నేటి యువతీయువకులు తెలుసుకోవాలి. మహాత్మ గాంధీ పరిశుభ్రత ను ఒక ప్రజా ఉద్యమం గా మార్చారు. స్వచ్ఛత ను ఆయన స్వతంత్రత స్వప్నం తో జత కలిపారు. నేడు- అనేక దశాబ్దాల అనంతరం స్వచ్ఛత ఉద్యమం మరోసారి దేశాన్ని నవీన భారతదేశం కలల తో కలిపే పని ని చేసిపెట్టింది.  ఇది కూడా మన అలవాటుల ను మార్చుకొనే ఉద్యమం గా కూడా మారుతున్నది.  స్వచ్ఛత కేవలం ఒక కార్యక్రమం అని మనం మరచిపోకూడదు.  స్వచ్ఛత అనేది ఒక తరం నుండి మరో తరాని కి సంస్కారాన్ని బదలాయించే  బాధ్యత.  స్వచ్ఛత ప్రచార ఉద్యమం ఒక  తరం తరువాత మరొక తరం లో కొనసాగితే, అప్పుడు మొత్తం సమాజ జీవనం లో పరిశుభ్రత స్వభావం అలవడుతుంది.  మరి ఈ కారణం గా ఒకటి రెండు సంవత్సరాలో, ఒక ప్రభుత్వం- రెండో ప్రభుత్వం అనే విషయం కాదు , తరాల తరబడి మనం స్వచ్ఛత పట్ల జాగృతి తో, అలుపు అనేది లేకుండా, అవిశ్రాంతం గా, గొప్ప శ్రద్ధ తో జతపడి ఉండాలి.  మహనీయులైన పూజ్య బాపూ జీ కి దేశం అర్పించే చాలా పెద్ద శ్రద్ధాంజలి యే స్వచ్ఛత, మరి ఈ శ్రద్ధాంజలి ని మనం ప్రతి సారీ అర్పిస్తూ ఉండాలి, క్రమం తప్పక అర్పిస్తూనే ఉండాలి అని నేను ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను.

సహచరులారా, స్వచ్ఛత ను గురించి మాట్లాడే అవకాశాన్ని నేను ఎన్నడూ వదులుకోనే వదులుకోను అన్న సంగతి  ప్రజల కు తెలుసు.  బహుశా అందుకే మన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ' శ్రోతల్లో ఒకరైన శ్రీమాన్ రమేశ్ పటేల్ గారు “మనం బాపూ జీ నుంచి నేర్చుకొంటూ ఈ స్వతంత్ర భారతదేశం తాలూకు అమృత మహోత్సవం లో ఆర్థిక స్వచ్ఛత కోసం కూడా సంకల్పం తీసుకోవాలి” అని రాశారు.  మరుగుదొడ్ల నిర్మాణం పేదల గౌరవాన్ని పెంచినట్టే ఆర్థిక స్వచ్ఛత పేదల కు అధికారాన్ని సునిశ్చితం చేస్తుంది.  వారి జీవితాల ను సులభతరం చేస్తుంది.  జన్ ధన్ ఖాతాల కు సంబంధించి దేశం ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని గురించి మీరు ఎరుగుదురు; దీని కారణం గా ఇవాళ పేదల కు అందవలసినటువంటి డబ్బు నేరు గా వారి ఖాతాల కు బదిలీ అవుతోంది.  దీని తో అవినీతి వంటి అడ్డంకులు చాలా వరకు తగ్గాయి.  ఆర్థిక స్వచ్ఛత లో సాంకేతిక విజ్ఞ‌ానం చాలా సాయపడుతుందనే సంగతి నిజమే.  ప్రస్తుతం పల్లెటూళ్లలో కూడా సాధారణ ప్రజలు ఫిన్-టెక్ యుపిఐ ద్వారా డిజిటల్ లావాదేవీ లు జరిపే స్థాయి కి చేరుకోవడం మనకు సంతోషదాయకమైనటువంటి విషయం.  దాని వినియోగం పెరుగుతోంది.  మీరు గర్వపడే ఒక సంఖ్య ను గురించి మీకు నేను చెప్తాను-  గత ఆగస్టు నెల లో,ఒక నెల రోజుల లోనే, 355 కోట్ల లావాదేవీ లు యుపిఐ ద్వారా జరిగాయి.  అంటే రమారమి 350 కోట్ల కంటే ఎక్కువ సార్లు డిజిటల్ ట్రాన్సాక్శన్స్ కోసమని యుపిఐ ని ఉపయోగించడమైందన్న మాట.  ఇవాళ సగటు న 6 లక్షల కోట్ల రూపాయల కు పైగా లావాదేవీ లు డిజిటల్ పేమెంట్ యుపిఐ ద్వారా జరుగుతున్నాయి.  దీని తో దేశ ఆర్థిక వ్యవస్థలో స్వచ్ఛత, పారదర్శకత్వం వస్తున్నాయి.  ఫిన్-టెక్  ప్రాముఖ్యం చాలా పెరుగుతోందన్న సంగతి మనకు ఇప్పుడు తెలుసును.

సహచరులారా,  బాపూ స్వచ్ఛత ను స్వేచ్ఛ తో ముడిపెట్టినట్లుగానే ఖాదీ ని స్వాతంత్య్రాని కి గుర్తు గా మార్చివేశారు.  నేడు- స్వాతంత్య్రం వచ్చిన 75 వ సంవత్సరం లో, స్వాతంత్ర్యం తాలూకు అమృత మహోత్సవాన్ని జరుపుకొంటున్నప్పుడు, స్వాతంత్ర్య ఉద్యమం లో ఖాదీ కి ఉన్నటువంటి గౌరవాన్నే నేటి మన యువ తరం ఖాదీ కి అందిస్తున్నది అని మనం సంతోషం తో చెప్పుకోవచ్చును.  ప్రస్తుతం ఖాదీ, చేనేత ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగాయి.  మరి వాటి కి గిరాకీ సైతం పెరిగింది.  దిల్లీ లోని ఖాదీ శోరూమ్ లో ఒక రోజు లో కోటి రూపాయల కు పైగా వ్యాపారం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయని కూడా మీకు తెలుసు.  పూజ్య బాపు జన్మదినం అయినటువంటి అక్టోబర్ 2 న మనం అందరం మరో సారి కొత్త రికార్డు  ను సృష్టించాలి అని మీకు మరో సారి నేను గుర్తు చేయదలచుకొన్నాను.  అది ఏమిటి అంటే- మీరు మీ పట్టణం లో ఖాదీ, చేనేత, హస్తకళల ఉత్పత్తులు ఎక్కడ అయినా సరే అమ్ముతూ ఉంటే, రానున్న దీపావళి పండుగ కు, ఖాదీ, చేనేత, కుటీర పరిశ్రమ ల తో ముడిపడ్డ మీ ప్రతి ఒక్క కొనుగోలు ‘వోకల్ ఫార్ లోకల్’ ఉద్యమాని కి బలం చేకూర్చేది గా ఉండాలి, ఈ విషయంలో పాత రికార్డుల ను అన్నిటిని బద్దలు చేసేది గా ఉండాలి- అనేదే.

సహచరులారా,  అమృత మహోత్సవం జరుగుతున్న ఈ కాలం లో-  దేశం లో స్వాతంత్ర్య చరిత్ర లో చెప్పడం జరుగనటువంటి కథల ను ప్రజల కు తెలియజేయడానికి ఒక ఉద్యమం కూడా జరుగుతోంది.  దీని కోసం వర్ధమాన రచయితల కు, దేశం లోని , ప్రపంచం లోని యువత కు పిలుపు ను ఇవ్వడం జరిగింది.  ఈ ఉద్యమం కోసం ఇప్పటి వరకు 13 వేలకు పైగా ప్రజలు వారి పేరుల ను నమోదు చేసుకొన్నారు, అది కూడా 14 వివిధ భాషల లో.  20 కంటే ఎక్కువ దేశాల లో అనేక మంది ప్రవాసీ భారతీయులు కూడాను ఈ ఉద్యమం లో చేరాలనుందన్న వారి కోరిక ను వ్యక్తం చేయడం నాకు సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం అయింది.  చాలా ఆసక్తికరమైన సమాచారం మరొకటి ఉంది. అది ఏమిటి అంటే- 5000 కంటే ఎక్కువ మంది వర్ధమాన రచయిత లు స్వాతంత్ర్య సమరం తాలూకు గాథల ను గురించి వెతుకుతున్నారు.  బయటి ప్రపంచాని కి పెద్ద గా తెలియని అన్‌సంగ్ హీరో స్, ఎవరైతే అనామకులు గా మిగిలిపోయారో, వారి ని గురించి, చరిత్ర పుటల లో పేరు లు కనుపించని ప్రజా నాయకుల గురించి, వారి జీవితాలను గురించి, ఆయా ఘటన ల  గురించి ఏదైనా రాసే పని ని యువత చేపట్టారు.  అంటే గత 75 సంవత్సరాల లో చర్చించని స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర ను దేశం ముందుకు తీసుకు రావాలని యువత కంకణం కట్టుకొందన్న మాట.  శ్రోతలందరికీ నా అభ్యర్థన, విద్య జగతి తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా మనవి.  అది ఏమిటి అంటే మీరు కూడా యువత కు ప్రేరణ ను ఇవ్వండి. మీరంతా ముందుకు రండి, స్వాతంత్ర్యం తాలూకు  అమృత్ మహోత్సవ్ లో చరిత్ర ను లిఖించే పని చేస్తున్న వారు చరిత్ర ను నిర్మించే వారు కూడా అవుతారు అని నాకు గట్టి విశ్వాసం ఉంది.

ప్రియమైన నా దేశవాసులారా, సియాచిన్ గ్లేశియర్ ను గురించి మనకు అందరి కి తెలుసును.  అక్కడ చలి ఎంత భయానకం గా ఉంటుంది అంటే మరి అక్కడ ఉండడం సామాన్య మానవుల కు సాధ్యపదేడి కాదు.  సుదూరం వరకు ఒకటే మంచు ఎక్కడా మొక్కల, చెట్ల ఉనికే ఉండదు.  అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీల కు చేరుతుంటుంది.  కొద్ది రోజుల క్రితం సియాచిన్ లోని ఈ దుర్గమ ప్రాంతంలో 8 మంది దివ్యాంగుల బృందం అద్భుతాలు చేసింది.  ఇది దేశ పౌరుల కు గర్వకారణం.  ఈ బృందం సియాచిన్ గ్లేశియర్ లో  15 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తు లో ఉన్న ‘కుమార్ పోస్ట్’ పై జెండా ను ఎగురవేసి ప్రపంచ రికార్డు ను సృష్టించింది.  శారీరిక సవాళ్లు ఉన్నప్పటికీ కూడాను మన ఈ దివ్యాంగులు చేసి చూపెట్టిన అబ్బురం యావత్తు దేశాని కి ప్రేరణ ను ఇచ్చేది గా ఉంది.  ఈ బృందంలోని సభ్యుల ను గురించి మీరు విన్నారనుకోండి, మీరు కూడా నా లాగానే మనస్సు లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపివేసుకొంటారు.  ఈ ధైర్యవంతులైన దివ్యాంగుల పేరు లు ఏమిటి అంటే- మహేశ్ నెహ్ రా గారు, ఉత్తరాఖండ్‌ కు చెందిన అక్షత్ రావత్ గారు, మహారాష్ట్ర కు చెందిన పుష్పక్ గవాండే గారు, హరియాణా కు చెందిన అజయ్ కుమార్ గారు, లద్దాఖ్‌ కు చెందిన  లోబ్సాంగ్ చోస్పెల్ గారు, తమిళ నాడు కు చెందిన మేజర్ ద్వారకేశ్ గారు, జమ్ము- కశ్మీర్‌ కు చెందిన ఇర్ ఫాన్ అహమద్ మీర్ గారు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన చొన్జిన్ ఎన్గ్ మో గారు.  సియాచిన్ హిమానీనదాన్ని జయించే ఈ ఆపరేశన్ భారతీయ సైన్యాని కి చెందిన ప్రత్యేక దళాలకు చెందిన చిరకాల అనుభవజ్ఞుల కారణం గా సఫలం అయింది.  ఈ చరిత్రాత్మకమైన, అపూర్వమైన విజయాని కి గాను ఈ బృందాని కి నేను అభినందనల ను తెలియజేస్తున్నాను.  ఇది మన దేశప్రజల యొక్క ‘‘నేను చేయగలను అనేసంస్కృతి”, ‘‘నేను చేయగలను అనే దృఢదీక్ష’’, ‘‘నేను చేయగలను అనే దృక్పథం’’తో ప్రతి సవాలు ను ఎదుర్కొనే భావన ను కూడా  తెలియజేస్తుంది.

సహచరులారా, ఈ రోజు దేశం లో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘వన్ టీచర్-వన్ కాల్’ అనే పేరు తో ఉత్తర్ ప్రదేశ్‌ లో చేస్తున్న అలాంటి ఒక ప్రయత్నాన్ని గురించి తెలుసుకొనే అవకాశం నాకు లభించింది.  బరేలీ లో ఈ ప్రత్యేక ప్రయత్నం దివ్యాంగ బాలల కు కొత్త మార్గాన్ని చూపుతోంది.  ఈ ఉద్యమానికి డభౌరా గంగాపుర్‌ లోని ఒక పాఠశాల ప్రిన్సిపల్ దీప మాలా పాండేయ గారు నాయకత్వం వహిస్తున్నారు.  కరోనా కాలం లో ఈ ఉద్యమం కారణం గా పెద్ద సంఖ్య లో పిల్లల ప్రవేశం సాధ్యం కావడమే కాకుండా 350 మంది కి పైగా ఉపాధ్యాయులు సేవా భావం తో చేరారు.  ఈ ఉపాధ్యాయులు దివ్యాంగ బాలల ను పిలుస్తూ,  గ్రామ గ్రామానికి వెళ్లి వెతుకుతారు.  ఆ బాల లు ఏదో ఒక పాఠశాల లో చేరేటట్టు పూచీపడతారు.  దివ్యాంగ జనుల కోసం దీపమాల గారు, వారి తోటి ఉపాధ్యాయులు చేస్తున్న ఈ నిజాయతీభరిత ప్రయాస ను నేను ఎంతగానో అభినందిస్తున్నాను.  విద్య రంగం లో ఇటువంటి ప్రతి ప్రయత్నమూ మన దేశం భవిష్యత్తు ను తీర్చిదిద్దబోతోంది.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజు న మన జీవితాల పరిస్థితి ఏమిటంటే రోజు లో వందల సార్లు కరోనా అనే పదం మన చెవులలో మారుమోగుతున్నది.  వంద సంవత్సరాల లో వచ్చిన అతి పెద్దదైన విశ్వమారి అయిన కోవిడ్-19 దేశం లో ప్రతి  పౌరునికి/ పౌరురాలికి చాలా విషయాల ను నేర్పింది.  ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ, వెల్ నెస్ లపై జిజ్ఞ‌ాస పెరిగింది.  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం గా ఉండే సాంప్రదాయక, సహజ ఉత్పత్తులు మన దేశం లో సమృద్ధి గా లభిస్తాయి.  ఒడిశా లోని కలాహండీ ప్రాంతం లోని నాందోల్ లో నివసించే పతాయత్ సాహూ గారు ఎన్నో  సంవత్సరాలు గా ఈ ప్రాంతం లో ఒక ప్రత్యేకమైన పని ని చేస్తున్నారు. ఆయన ఒకటిన్నర ఎకరాల భూమి లో ఔషధీయ మొక్కల ను పెంచుతున్నారు.  ఇది మాత్రమే కాదు-  సాహూ గారు ఈ ఔషధీయ మొక్క ల తాలూకు డాక్యుమెంటేశన్ ను కూడా చేశారు.  రాంచీ కి చెందిన సతీశ్ గారు ఇటువంటి ఒక సమాచారాన్ని గురించి నాకు రాసిన ఒక ఉత్తరం లో తెలియజేశారు.  ఝార్ ఖండ్‌ లో కలబంద సాగు అవుతున్న ఓ గ్రామం ఉందని సతీశ్ గారు నాకు వెల్లడించారు.  రాంచీ సమీపం లోని దేవరి గ్రామం లో మహిళ లు మంజు కచ్ఛప్ గారి నాయకత్వం లో బిర్ సా వ్యవసాయ విద్యాసంస్థ ద్వారా కలబంద సాగు లో శిక్షణ ను స్వీకరించారు.  తరువాత కలబంద పెంపకాన్ని వారు మొదలుపెట్టారు.  ఈ సాగు కారణం గా ఆరోగ్య రంగం లో ప్రయోజనం కలగడమే కాకుండా ఈ మహిళ ల ఆదాయం కూడా పెరిగింది.  కోవిడ్ మహమ్మారి కాలం లో కూడా వారికి మంచి ఆదాయం వచ్చింది.  దీనికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే శానిటైజర్ ను తయారు చేసే కంపెనీ లు కలబంద ను వారి నుంచి నేరు గా కొనుగోలు చేయడమే.  ప్రస్తుతం దాదాపు నలభై మంది మహిళ ల బృందం ఈ పని లో పాలుపంచుకొంటోంది.  కలబంద అనేక ఎకరాల లో సాగు అవుతోంది.  ఒడిశా కు చెందిన పతాయత్ సాహూ గారి కృషి లేదా దేవరీ లోని ఈ మహిళ ల బృందం కృషి వ్యవసాయ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రం తో ముడిపెట్టడానికి ఉదాహరణలు గా చెప్పవచ్చును.

సహచరులారా, రాబోయే అక్టోబర్ 2 న లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి కూడా ను.  ఆయన  జ్ఞాపకార్థం ఈ రోజు మనకు వ్యవసాయ రంగం లో కొత్త కొత్త ప్రయోగాల ను గురించి కూడా తెలియజెప్తుంది.  ఔషధీయ మొక్కల రంగంలో స్టార్ట్-అప్‌ స్ ను ప్రోత్సహించడానికి గుజరాత్‌ లోని ఆనన్ద్ లో మెడి-హబ్ టిబిఐ పేరు తో ఇంక్యుబేటర్ పనిచేస్తోంది.  ఔషధీయ మొక్కల తో, సుగంధ మొక్కల తో ముడిపడ్డ ఈ ఇంక్యుబేటర్ చాలా తక్కువ సమయం లో 15 మంది నవ పారిశ్రామిక వేత్త ల వ్యాపార ఆలోచనల కు సమర్ధన ను అందించింది.  ఈ ఇంక్యుబేటర్ ద్వారా సహాయాన్ని పొందిన తరువాతే సుధా చేబ్రోలు గారు తన స్టార్ట్- అప్‌ ను ప్రారంభించారు.  ఆమె కంపెనీ లో మహిళల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతున్నది.  మరి వారి పైనే వినూత్నమైనటువంటి మూలిక ల సూత్రీకరణ ల బాధ్యత ఉంది.  సుభాశ్రీ గారు మరొక నవ పారిశ్రామికురాలు.  ఈమెకు కూడా ఔషధీయ మొక్కల, సుగంధ మొక్కల ఇంక్యుబేటర్ నుంచి సహాయం అందింది.  సుభాశ్రీ గారికంపెనీ హెర్బల్ రూమ్, కార్ ఫ్రెష్ నర్ ల రంగం లో పని చేస్తోంది.  ఆవిడ 400 కు పైగా ఔషధీయ మూలికలు ఉన్న హెర్బల్ టెరస్ గార్డెన్ ను కూడా ఏర్పాటు చేశారు.

సహచరులారా, ఔషధీయ మొక్కల గురించి, మూలికా మొక్కల గురించి బాలల్లో అవగాహన ను పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ఆసక్తికరమైన కార్యక్రమాన్ని తీసుకొంది.  మన ప్రొఫెసర్ ఆయుష్మాన్ గారు ఈ విషయం లో బాధ్యత ను తీసుకొన్నారు.  ప్రొఫెసర్ ఆయుష్మాన్ ఎవరు ? అని మీరు అనుకోవచ్చు.  నిజాని కి ప్రొఫెసర్ ఆయుష్మాన్ ఒక హాస్య పుస్తకం పేరు.  ఇందులో విభిన్న కార్టూన్ పాత్ర ల ద్వారా చిన్న కథల ను సిద్ధం చేశారు.  వీటితో పాటు కలబంద, తులసి, ఉసిరి, తిప్పతీగ, వేప, అశ్వగంధ, బ్రాహ్మి ల వంటి ఆరోగ్యకరమైన ఔషధీయ మొక్కల ఉపయోగాలను గురించి కూడా ఈ పుస్తకం లో పొందుపరిచారు.

సహచరులారా, నేటి పరిస్థితి లో ఔషధీయ మొక్క ల, మూలిక ల ఉత్పత్తుల కు సంబంధించి ప్రపంచవ్యాప్తం గా ప్రజల అవగాహన పెరిగింది.  అందు వల్ల భారతదేశాని కి అపారమైన అవకాశాలు ఉన్నాయి.  గత కాలం లో ఆయుర్వేదిక మరియు మూలికా ఉత్పత్తుల ను ఎగుమతి చేయడం లో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది.

శాస్త్రవేత్త లు, పరిశోధకులు మరియు స్టార్ట్- అప్ జగతి తో సంబంధం ఉన్న వ్యక్తులు అటువంటి ఉత్పత్తులపైన దృష్టి పెట్టాలి అని నేను కోరుతున్నాను.  ఇది ప్రజల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తి ని పెంచడమే కాకుండా మన రైతుల ఆదాయాన్ని, యువతీయువకుల ఆదాయాన్ని పెంచడం లో కూడా సహాయపడుతుంది.

సహచరులారా, సాంప్రదాయక వ్యవసాయం దశ ను అధిగమించి, వ్యవసాయం రంగం లో కొత్త ప్రయోగాలు  జరుగుతున్నాయి.  కొత్త పరికల్పన లు నిరంతరం నూతనమైన స్వతంత్రోపాధి సాధనాల ను రూపొందిస్తున్నాయి.  పుల్ వామా కు చెందిన ఇద్దరు సోదరుల కథ కూడా దీనికి ఒక ఉదాహరణ గా నిలచింది.  జమ్ము- కశ్మీర్‌ లోని పుల్ వామా లో బిలాల్ అహమద్ శేఖ్ గారు, మునీర్ అహ్మద్ శేఖ్ గారు లు వారి కోసం కొత్త మార్గాల ను అన్వేషించిన విధానం న్యూ ఇండియా కు ఒక ఉదాహరణ గా నిలచింది.  39 ఏళ్ల బిలాల్ అహమద్ గారు అత్యంత అధిక అర్హత లు కలిగిన వారు.  ఆయన అనేక డిగ్రీల ను సాధించారు.  ప్రస్తుతం వ్యవసాయం లో సొంత గా స్టార్ట్-అప్ ను ప్రారంభించి ఉన్నత విద్య కు సంబంధించిన తన అనుభవాన్ని ఆ స్టార్ట్- అప్ లో ఉపయోగిస్తున్నారు.  బిలాల్ గారు తన ఇంట్లో వర్మీ కంపోస్టింగ్ యూనిట్‌ ను ఏర్పాటు చేశారు.  ఈ యూనిట్ నుంచి తయారు చేసిన బాయో ఫర్టిలైజర్ వ్యవసాయం లో ఎంతో ప్రయోజనాన్ని అందించడంతో పాటు ప్రజల కు ఉపాధి అవకాశాల ను కూడా తీసుకువచ్చింది.  ప్రతి సంవత్సరం ఈ సోదరుల యూనిట్ల నుంచి రైతుల కు సుమారు మూడు వేల క్వింటల్స్ వర్మీ కంపోస్ట్ లభిస్తున్నది.  ఇవాళ వారి వర్మి కంపోస్టింగ్ యూనిట్‌ లో 15 మంది పని చేస్తున్నారు కూడాను.
ఈ యూనిట్‌ ను చూడడం కోసం పెద్ద సంఖ్య లో ప్రజలు వస్తున్నారు.  వారి లో అధిక భాగం వ్యవసాయ రంగం లో ఏదైనా సాధించాలి అనుకొనే యువత యే.  పుల్ వామా కు చెందిన శేఖ్ సోదరులు ఉద్యోగార్ధులు గా ఉండే బదులు ఉద్యోగాల సృష్టికర్తలం అవుతామంటూ సంకల్పం చెప్పుకొన్నారు.  నేడు వారు జమ్ము- కశ్మీర్‌ కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తం గా కూడా ప్రజల కు కొత్త దారి ని చూపుతున్నారు.

ప్రియమైన నా దేశ ప్రజలారా, సెప్టెంబర్ 25 న దేశం గొప్ప బిడ్డ అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి.  దీన్ దయాళ్ గారు, గత శతాబ్దం లో అందరి కన్నా గొప్ప ఆలోచనాపరుల లో ఒకరు గా ఉన్నారు.  ఆయన ఆర్థిక దర్శనం, సమాజాన్ని శక్తిమంతం చేయడానికి ఆయన చూపిన విధానాలు, ఆయన చూపిన అంత్యోదయ మార్గం ఈనాటికీ ఎంతటి ప్రాసంగికత ను కలిగి ఉన్నాయో, అంతే ప్రేరణదాయకమైనవి గా కూడా ఉన్నాయి.  మూడు సంవత్సరాల కిందట సెప్టెంబర్ 25 న ఆయన జయంతి సందర్భం లో ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఆరోగ్య హామీ పథకం అయిన ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ను ప్రారంభించడం జరిగింది.  ప్రస్తుతం దేశం లో రెండు కోట్లు- రెండుంబావు కోట్ల మంది కి పైగా పేదల కు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఆసుపత్రుల లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స ను అందించడమైంది.  పేద ల కోసం ప్రారంభించిన ఇంత భారీ పథకం దీన్ దయాళ్ గారి అంత్యోదయ తత్వాని కి అంకితమైంది.  ఆయన విలువల ను, ఆయన ఆదర్శాల ను ఈనాటి యువత తమ జీవితాలలో ఆచరించిందా అంటే గనక అది యువత కు గొప్ప సహాయకారి గా ఉండగలదు.  ఒకసారి లఖ్ నవూ లో దీన్ దయాళ్ గారు “ఎన్ని మంచి విషయాలు, మంచి మంచి గుణాలు ఉన్నాయో - ఇవి అన్నీ కూడాను మనకు సమాజం నుంచే ప్రాప్తిస్తాయి. మనం సమాజం రుణాన్ని తీర్చివేయాలి, ఈ రకం గా మనం ఆలోచించాలి.” అన్నారు.  అంటే దీన్ దయాళ్ గారు మనకు ఒక పాఠాన్ని బోధించారు అన్న మాట. అది ఏమిటి అంటే అది మనం సమాజం నుంచి, దేశం నుంచి ఎంతో తీసుకొంటున్నాం, ఏది ఉన్నప్పటికీ అది దేశం కారణం గానే కాబట్టి దేశం పట్ల మన రుణాన్ని ఏ విధం గా తీర్చుకొందాం, ఈ విషయమై మనం ఆలోచించాలి అనేదే. ఇది నేటి కాలం యువత కు చాలా పెద్ద సందేశం గా ఉంది.

సహచరులారా, మనం ఎన్నటికీ ఓటమి ని అంగీకరించకూడదు అనే పాఠం సైతం దీన్ దయాళ్ గారి జీవితం నుంచి మనకు లభిస్తుంది.  ప్రతికూల రాజకీయ, సైద్ధాంతిక పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశం అభివృద్ధి కై స్వదేశీ నమూనా తాలూకు దృష్టికోణం నుంచి వారు మళ్లిపోలేదు.  ఇవాళ చాలా మంది యువతీయువకులు సిద్ధం గా ఉన్న దారుల నుంచి బయటపడి ముందుకు సాగాలని కోరుకొంటున్నారు.  వారు పనుల ను తమదైన శైలి లో చేయాలని తలపోస్తున్నారు.  దీన్ దయాళ్  గారి జీవనం నుంచి వారి కి చాలా సహాయం అందగలదు.  ఈ కారణం గా యువత ను నేను కోరేది ఏమిటి అంటే వారు ఆయన ను గురించి తప్పక తెలుసుకోవాలి అనేదే.

ప్రియమైన నా దేశ వాసులారా, మనం ఈరోజు న అనేక అంశాల పై చర్చించాం.  మనం మాట్లాడుకున్నట్టుగా, రాబోయే సమయం పండుగ ల కాలం.  యావత్తు దేశం అసత్యం పైన విజయాన్ని సాధించిన మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని పండుగ ను జరుపుకోబోతోంది.  కానీ ఈ పండుగ లో మనం మరో పోరాటాన్ని గురించి గుర్తు పెట్టుకోవాలి- అది దేశం కరోనా తోశం చేసిన పోరాటం.  ఈ పోరాటం లో టీమ్ ఇండియా రోజూ కొత్త రికార్డుల ను నమోదు చేస్తోంది. టీకామందు ను ఇప్పించడం లో దేశం నెలకొల్పిన రికార్డుల ను గురించి ప్రపంచం అంతటా చర్చ జరుగుతోంది.  ఈ పోరాటం లో భారతదేశం లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కి ముఖ్య పాత్ర ఉంది.  మనం మన వంతు వచ్చినప్పుడు టీకామందు ను తప్పక వేయించుకోవాలి. అంతేకాదు, ఎవ్వరూ ఈ భద్రత వలయం బయటే మిగిలిపోరాదనే విషయం పైనా మనం దృష్టి పెట్టాలి.  మన చుట్టుపక్కల ఎవరికి అయినా వ్యాక్సీన్ తీసుకోలేదో వారికి  కూడా టీకా కేంద్రం చెంతకు తీసుకుపోవాలి.  టీకా తీసుకొన్న తరువాత సైతం అవసరమైన నిబంధనల ను పాటించాలి.  ఈ పోరాటం లో మరోసారి టీమ్ ఇండియా తన జెండా ను ఎగురవేస్తుంది అని నేను ఆశపడుతున్నాను.  మనం వచ్చే సారి మరికొన్ని ఇతర అంశాల పైన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) ను చెప్పుకొందాం.  మీ అందరి కి, దేశం లోని ప్రతి ఒక్కరి కి, పండుగల తాలూకు చాలా చాలా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.



 

 

***

 


(Release ID: 1758320) Visitor Counter : 369