ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌త - అమెరికా నేత‌ల సంయుక్త ప్ర‌క‌ట‌న‌: ప్ర‌పంచం మంచి కోసం భాగ‌స్వామ్యం (సెప్టెంబ‌ర్ 24,2021)

Posted On: 25 SEP 2021 10:48AM by PIB Hyderabad

అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ ఆర్‌.బైడెన్‌, భార‌త ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ఈరోజు వైట్ హౌస్‌కు తొలి ముఖాముఖి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు.  ఈ సంద‌ర్భంగా త‌మ మ‌ధ్యగ‌ల స‌న్నిహిత‌ ప‌ర‌స్ప‌ర సంబంధాన్ని పునఃకొన‌సాగిస్తూ,  ప్ర‌పంచంలోని రెండు అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోయేందుకు నూత‌న చ‌ర్య‌ల‌ను చ‌ర్చించారు.
భార‌త - అమెరికా సంబంధాల‌ను మ‌రింత ముందుకు తీసుకుపోగ‌ల స్ప‌ష్ట‌మైన దార్శ‌నిక‌త‌ను ఇరువురు నాయ‌కులు పున‌రుద్ఘాటించారు. అందుకు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని నిర్మించ‌డం, ఏసియాన్‌, క్వాడ్ స‌భ్యుల‌వంటి ప్రాంతీయ‌ గ్రూప్‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం, ఇండో- ప‌సిఫిక్ ప్రాంతంలో, అంత‌కు మించీ ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డం, ఇరుదేశాల‌లో ప‌నిచేస్తున్న కుటుంబాల సుసంపన్న‌త‌ను పెంపొందించే వాణిజ్య‌, పెట్టుబ‌డుల భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయ‌డం, కోవిడ్ -19 మ‌హ‌మ్మారి పై పోరాటాన్ని తుదివ‌ర‌కూ తీసుకువెళ్ల‌డం, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగించ‌డం, వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌పై అంత‌ర్జాతీయ కృషిని మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డం , ప్ర‌జాస్వామిక విలువ‌ల‌ను, సంస్థ‌ల‌ను ఇరు దేశాల‌కు చెందిన వారి వారి ప్ర‌జ‌ల కోసం బ‌లోపేతం చేయ‌డం,
ఇరు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బలోపేతం చేసే విధంగా ప్ర‌జ‌ల‌కు - ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాన్ని మ‌రింత పెంపొందించడానికి ఆ దార్శ‌నిక‌త దోహ‌దం చేయ‌నుంది.

గ‌త ఏడాది కాలంగా   కోవిడ్-19 మ‌హ‌మ్మారిపై పోరాటానికి త‌మ దేశాల సన్నిహిత స‌హ‌కారం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అంటూ  ఇందుకు  అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్‌, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌శంస‌లు తెలియ‌జేశారు. ప్ర‌భుత్వాలు, పౌర‌స‌మాజం, వ్యాపార‌వ‌ర్గాలు, ప్ర‌జ‌లు ,వివిధ క‌మ్యూనిటీలు ఆయా దేశాల అత్య‌వ‌స‌ర స‌మ‌యాల‌లో ,అత్య‌వ‌స‌ర స‌హాయాన్ని , స‌ర‌ఫ‌రాల‌ను అపూర్వ‌మైన రీతిలో అందించాయ‌న్నారు.
దేశంలోను, విదేశాల‌లోనూ కోట్లాది మంది తమ దేశ పౌరుల ర‌క్ష‌ణ‌కు వంద‌ల మిలియన్ల డొస్‌ల‌ వాక్సిన్‌ను వేసిన‌ట్టు వారు పునరుద్ఘాటించారు.ఈ కోవిడ్ మ‌హమ్మారిని అంతం చేసేందుకు అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న కృషికి నాయ‌క‌త్వం వ‌హించేందుకు ఇరువురు నాయ‌కులు త‌మ చిత్త‌శుద్ధిని పున‌రుద్ఘాటించారు. కోవాక్స్ తో స‌హా సుర‌క్షిత‌మైన , స‌మ‌ర్ధ‌మైన కోవిడ్ -19 వాక్సిన్‌ల ఎగుమ‌తుల‌ను పున‌రుద్ధ‌రించేందుకు ఇండియా చేసిన ప్ర‌క‌ట‌న‌ను అధ్య‌క్ష‌డు జో బైడెన్ స్వాగ‌తించారు.

భ‌విష్య‌త్ మ‌హమ్మారుల నుంచి రిస్క్‌ను త‌గ్గించేందుకు బ‌యో మెడిక‌ల్ రిసెర్చి, మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కొనే స‌న్న‌ద్ధ‌త‌తోపాటు, అంత‌ర్జాతీయంగా ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తున్న  ఆరోగ్య‌, బ‌యోమెడిక‌ల్ సైన్సెస్‌కు సంబంధించిన కీల‌క రంగాల‌లో స‌హ‌కారానికి సంబంధించి అవ‌గాహ‌నాఒప్పందం ఖ‌రారు కావ‌డం ప‌ట్ల ఇరువురు నాయ‌కులు ప్ర‌శంసించారు.

కోవిడ్ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు, త‌దుప‌రి  కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసేందుకు స‌న్న‌ద్థ‌త‌, కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు ఉమ్మ‌డి చిత్త‌శుద్ధిని దృష్టిలో ఉంచుకుని అంత‌ర్జాతీయ కోవిడ్ -19 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నాన్ని ఏర్పాటుచేసేందుకు అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ చూపిన చొర‌వ‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ స్వాగ‌తించారు.

అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలోకి రావ‌డంతోపాటు వాతావ‌ర‌ణ కార్యాచ‌ర‌ణ‌పై అమెరికా నాయ‌క‌త్వ చొర‌వ‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వాగ‌తించారు. 2030 నాటికి 450 గిగావాట్ల పున‌రుత్పాద‌క విద్యుత్ స్థాపిత సామర్ధ్యాన్నిదేశీయంగా సాధించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంక‌ల్పానికి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌ద్ద‌తు తెలిపారు. అలాగే ప‌రిశుభ్ర‌మైన‌, న‌మ్మ‌క‌మైన విద్యుత్‌ను కోట్లాది భార‌తీయ కుటుంబాల‌కు అందించ‌గ‌ల‌   పున‌రుత్పాద‌క‌, స్టోరేజ్‌, గ్రిడ్ మౌలిక స‌దుపాయాల‌కు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆర్దిక వ‌న‌రులు స‌మీక‌రించుకోవ‌ల‌సిన ప్రాధాన్య‌త‌ను గుర్తించారు.

రెండు ప్ర‌ధాన మార్గాలైన వ్యూ హాత్మ‌క ప‌రిశుద్ధ ఇంధ‌న భాగ‌స్వామ్యం (ఎస్‌సిఇపి) , వాతావ‌ర‌ణ కార్యాచ‌ర‌ణ‌, అమెరికా- ఇండియా వాతావ‌ర‌ణ‌, ప‌రిశుద్ధ ఇంధ‌న అజెండా 2030  భాగ‌స్వామ్యం కింద ఆర్ధిక వ‌న‌రుల మొబిలైజేష‌న్ చ‌ర్చ‌లలో భాగంగా ఇండియా అమెరికాలు, ప‌రిశుభ్ర ఇంధ‌న ప‌రివ‌ర్త‌నను ముందుకు తీసుకువెళ్లేందుకు కీల‌క సాంకేతిక ప‌రిజ్ఞానాన్నిఇండియా అమెరికాలు అభివృద్ధి  చేసి  వినియోగించ‌నున్నాయి. లీడ‌ర్‌షిప్ గ్రూప్ ఫ‌ర్ ఇండ‌స్ట్రీ ట్రాన్సిష‌న్ (లీడ్ ఐటి)లో అమెరికా చేరినందుకు ఇండియా స్వాగ‌తించింది. 

ఇండియా, అమెరికా ల మ‌ధ్య బ‌ల‌మైన ర‌క్ష‌ణ సంబంధాల‌ను అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ పున‌రుద్ఘాటించారు. ప‌ర‌స్ప‌రం స‌మాచార మార్పిడి, లాజిస్టిక్‌ల‌ను వాడుకోవ‌డం, మిల‌ట‌రీ- మిల‌ట‌రీ మ‌ధ్య సంబంధాలు, అధునాత‌న మిల‌ట‌రీ సాంకేతిక ప‌రిజ్ఞానం విష‌యంలో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డం, ప్రాంతీయ భాగ‌స్వాముల‌తోపాటు బ‌హుళ‌ప‌క్షఫ్రేమ్‌వ‌ర్క్‌కు సంబంధించి ప‌ర‌స్ప‌ర  కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేసే విష‌యంలొ అలాగే ఇండియా ప్ర‌ముఖ ర‌క్ష‌ణ భాగ‌స్వాగా ఇండియాప‌ట్ల త‌మ చిత్త‌శుద్ధిని పున‌రుద్ఘాటిస్తున్న‌ట్టు అధ్య‌క్షుడు బైడెన్ ప్ర‌క‌టించారు.

లోతైన అధునాత‌న పారిశ్రామిక స‌హ‌కారాన్ని ఇరువురు నాయ‌కులు స్వాగ‌తించారు. ఈ నేప‌థ్యంలో, డిఫెన్స్ టెక్నాల‌జీ , ట్రేడ్ ఇనిషియేటివ్ కింద మాన‌వ ర‌హిత ఏరియ‌ల్ వాహ‌నాలు (యుఎవి)లు ఉమ్మ‌డి గా అభివృద్ది చేయ‌డానికి సంబంధించిన ఇటీవ‌లి ప్రాజెక్టును వారు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ఇటువంటి వాటి సంయుక్త కృషిని మ‌నం మ‌రింత ప్రోత్స‌హించనున్నామ‌న్నారు.

ఉమ్మ‌డి అభివృద్ధి, ఉమ్మ‌డి ఉత్ప‌త్తి, ఉమ్మ‌డిగా ర‌క్ష‌ణ వాణిజ్యాన్ని ముందుకు తీసుకుపోవ‌డం, ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌లో ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌షిప్‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి ప్ర‌స్తుత వాతావర‌ణాన్ని ప్ర‌భుత్వ , ప్రైవేటు స్టేక్‌హోల్డ‌ర్లు వాడుకోవాల్సిందిగా ఇరువురు నాయ‌కులు పిలుపునిచ్చారు. అత్యున్న‌త‌స్థాయి ర‌క్ష‌ణ పారిశ్రామిక స‌హ‌కారానికి సంబంధించి ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ స‌మ్మిట్‌కు సంబంధించిన ప్రారంభ స‌మావేశానికి ఆస‌క్తితో ఎదురుచూస్తున్న‌ట్టు తెలిపారు.


గ్లోబల్ టెర్రరిజంపై సంయుక్త పోరాటంలో అమెరికా, ఇండియా కలిసి నిలబడతాయని ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అలాగే యుఎన్ ఎస్‌సిఆర్ 1267 ఆంక్ష‌ల క‌మిటీ నిషేధించిన గ్రూపుల‌తో పాటు ,స‌రిహ‌ద్దుల‌కుఆవ‌ల గ‌ల  నిషేధిత ఉగ్ర‌వాద గ్రూపులతోపాటు అన్ని ఉగ్ర‌వాత గ్రూపుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల తీసుకోనున్న‌ట్టు వారు పున‌రుద్ఘాటించారు. అలాగే 26/11 ముంబ‌యి ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డిన‌వారిని చ‌ట్టం ముందు నిల‌బెట్టేందుకు   వారు  పిలుపునిచ్చారు. ప‌రోక్షంగా ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డాన్ని కూడా వారు ఖండించారు. ఉగ్ర‌వాద గ్రూపుల‌కు లాజిస్టిక్‌, ఆర్దిక‌, సైనిక మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఉండాల్సిన అంశానికిగ‌ల ప్రాధాన్య‌త‌ను వారు నొక్కి చెప్పారు. ఈ స‌దుపాయాల‌ను ఉగ్ర‌వాదులు ఉగ్ర‌దాడుల‌కు వాడుకునే అవకాశం ఉంద‌న్నారు. రానున్న‌ అమెరికా - ఇండియా కౌంట‌ర్ టెర్ర‌రిజం జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్‌, డిజిగ్నేష‌న్స్ డైలాగ్‌, అమెరికా- ఇండియా హోంలాండ్ సెక్యూరిటీ డైలాగ్‌లు ఇండియా , అమెరికా మ‌ధ్య ఉగ్ర‌వాద వ్య‌తిరేక స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్నాయ‌ని అన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ స‌మాచారం అందిపుచ్చుకోవ‌డం, చ‌ట్ట అమ‌లలో స‌హ‌కారాన్ని ఇది మ‌రింత ముందుకు తీసుకుపోనున్న‌ది. ఉగ్ర‌వాద వ్య‌తిరేక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను వారు స్వాగ‌తించారు. అమెరికా- ఇండియా కౌంట‌ర్ నార్కొటిక్ వ‌ర్కింగ్ గ్రూప్ సేవ‌ల‌ను వారు ప్ర‌శంసించారు. అలాగే కొత్త ద్వైపాక్షిక ఫ్రేమ్‌వ‌ర్క్‌ను ఖ‌రారు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇది మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, నార్కోటిక్ ల అక్ర‌మ ఉత్ప‌త్తి , వాటి  త‌యారీకి ఉప‌యోగ‌ప‌డే ర‌సాయ‌నాల స‌ర‌ఫ‌రా చెయిన్‌ను ఎదుర్కోనేందుకు  సంయుక్త కృషికి ఇది వీలు క‌ల్పించ‌నుంది.

తాలిబాన్లు యుఎన్ ఎస్ సి తీర్మానం 2593 (2021)కి క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఇరువురు నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. ఇది ఆప్ఘ‌న్ భూభాగం, ఇక ముందెప్పుడూ ఏ దేశంపై దాడికి లేదా బెదిరింపున‌కు ఉప‌యోగ‌ప‌డ‌రాద‌ని, లేదా ఉగ్ర‌వాదుల శిక్ష‌ణ‌కు, వారికి త‌ల‌దాల్చుకోవ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌రాదని, లేదా ఉగ్ర‌దాడుల‌కు ప్ర‌ణాళిక వేయ‌డానికి , ఆర్థిక‌మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌రాద‌ని స్ప‌ష్టం చేశారు. ఆప్ఘ‌నిస్థాన్‌లో ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌ల‌సిన ప్రాధాన్య‌త‌ను వారు స్ప‌ష్టం చేశారు. తాలిబ‌న్ నాయ‌క‌త్వం దీనికి , ఇత‌ర అన్ని హామీల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని , ఆప్ఘ‌నిస్థాన్ నుంచి ఆప్ఘ‌న్ లు, విదేశీయులు,  సుర‌క్షితంగా, ప‌ద్ధ‌తి ప్ర‌కారం,  భ‌ద్రంగా ఆప్ఘ‌నిస్థాన్‌ను విడిచిపెట్టి వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని, ఆప్ఘ‌న్‌లు
మ‌హిళ‌లు, పిల్లలు , మైనారిటీ గ్రూపుల మాన‌వ హ‌క్కుల‌ను గౌర‌వించాల‌ని వారు పిలుపునిచ్చారు. ఆప్ఘ‌నిస్థాన్‌కు మాన‌వ‌తా స‌హాయాన్ని అందిచేందుకు జ‌రుగుతున్న కృషికి గ‌ల ప్రాధాన్య‌త‌ను వారు ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అంత‌ర్గ‌తంగా నిర్వాసితులైన వారిప‌ట్ల గౌర‌వం క‌లిగి ఉండ‌డంతోపాటు, ఐక్యరాజ్య‌స‌మితి, దాని ప్ర‌త్యేక ఏజెన్సీలు, మాన‌వ‌తా స‌హాయాన్ని అమ‌లు చేస్తున్న భాగ‌స్వాములు, మాన‌వతా స‌హాయాన్ని అందిస్తున్న అన్ని సంస్థ‌లు, అవి నిర్వ‌హిస్తున్న కార్య‌క‌లాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొన‌సాగేందుకు తాలిబ‌న్లు వీలు  క‌ల్పించాల‌ని వారు పిలుపునిచ్చారు.

ఆప్ఘ‌నిస్థాన్‌లోని అంద‌రి శాంతియుత భ‌విష్య‌త్ కోసం కృషిని కొన‌సాగించేందుకు దీర్ఘ‌కాలిక క‌ట్టుబాటును ప్ర‌తిఫ‌లింప‌చేస్తూ, ఆఫ్ఘ‌నిస్థాన్ ప్ర‌జ‌లకు  ఆర్ధిక అవ‌కాశాలు, అభివృద్ధిని ప్రోత్స‌హించేందుకు త‌మ  స‌న్నిహిత స‌మ‌న్వ‌యంతో , భాగ‌స్వాముల‌తో సంయుక్తంగా క‌ల‌సి ప‌నిచేసేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు తెలిపారు.
హింస‌కు స్వ‌స్తిప‌ల‌కాల‌ని, రాజ‌కీయ నిర్బంధితుల‌ను అంద‌రినీ విడుద‌ల చేయాల‌ని, మ‌య‌న్మార్  స‌త్వ‌రం ప్ర‌జాస్వామ్యానికి మ‌ళ్లాల‌ని ఇరువురు నాయ‌కులు పిలుపునిచ్చారు. ఏసియాన్ ఐదు అంశాల ఏకాభిప్రాయాన్ని స‌త్వ‌రం అమ‌లు చేసేందుకు వారు పిలుపునిచ్చారు.

క్వాద్ కింద స‌హ‌కారం మ‌రింత పెంపొందడాన్ని ఇరువురు నాయ‌క‌లు స్వాగ‌తించారు.  ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌త్వం, అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు సంబంధించి  స్వేచ్ఛాయుత‌, బ‌హ‌ర్గ‌త‌, స‌మ్మిళిత ఇండో - ప‌సిఫిక్ ప్రాంత ఉమ్మ‌డి దార్శ‌నికత‌కు సంబంధించి బ‌హుళ ప‌క్ష అంశాల‌లో స‌హ‌కారం మ‌రింత పెర‌గ‌డాన్ని నాయ‌కులు స్వాగ‌తించారు. 2021 ఆగ‌స్టులో ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష‌త‌కు సంబంధించి ఇండియా బ‌ల‌మైన నాయ‌కత్వాన్ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌శంసించారు. సంస్క‌రించిన ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో ఇండియా శాస్వ‌త స‌భ్య‌త్వానికి, అలాగే ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి శాస్వ‌త స‌భ్య‌త్వాన్ని కోరుకుంటూ బ‌హుళ ప‌క్ష స‌హ‌కారానికి కీల‌క ఛాంపియ‌న్లుగా ఉన్న ఇత‌ర దేశాల‌కు అమెరికా త‌న మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని  అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ పున‌రుద్ఘాటించారు.
అణు స‌ర‌ఫ‌రా గ్రూప్‌లో ప్ర‌వేశానికి ఇండియాకు అమెరికా మద్ద‌తు నిస్తుంద‌ని కూడా ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ఇండో ప‌సిఫిక్‌, ఆఫ్రికా ప్రాంతంలో అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభివృద్ధి స‌వాళ్ల‌ను ఎదుర్కోనేందుకు ఇండియా, అమెరికా ల సంయుక్త సామ‌ర్ధ్యాల‌ను పెంచేందుకు ట్ర‌యాంగుల‌ర్ కో ఆప‌రేష‌న్ ఫ‌ర్ గ్లోబ‌ల్‌డ‌వ‌ల‌ప్‌మెంట్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌క‌ట‌న కొన‌సాగింపును వారు స్వాగ‌తించారు. దీనికి తోడు,ఆరోగ్యం, విద్య‌, ప‌ర్యావ‌ర‌ణం వంటి వాటిలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారినికి నిర్దేశించిన‌ అమెరికా - ఇండియా గాంధీ - కింగ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఫౌండేష‌న్‌ను ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్న‌ట్టు వారు  తెలిపారు.

2021 చివ‌రి నాటికి ఇండియా - అమెరికా వాణిజ్య విధాన వేదిక‌ను తిరిగి స‌మావేశ ప‌ర‌చాల‌ని ఆస‌క్తి తో ఎదురు చూస్తున్న‌ట్టు ఇరువురు నాయ‌కులు పేర్కొన్నారు. వాణిజ్య సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి,  మ‌రింత విస్తృత అంశాల‌ను గుర్తించ‌డానికి , మ‌రింత ఉన్న‌త‌, ఉమ్మ‌డి వాణిజ్య సంబంధాల‌కు సంబంధించిన దార్శ‌నిక‌త‌కు దీనిని ముందుకు తీసుకుపోనున్నారు. అమెరికా- ఇండియా సిఇఒ ఫోర‌మ్‌, వాణిజ్య చ‌ర్చ‌ల‌ను 2022 తొలినాళ్ల‌లో  నిర్వ‌హించేందుకు ఎదురుచూస్తున్న‌ట్టు ఇరువురు నాయ‌కులు తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రోత్సాహ‌క ఒప్పందానికి సంబంధించి ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న సంప్ర‌దింపుల‌ను ఇరువురు నాయ‌కులు ప్ర‌స్తావించారు. ఇది అభివృద్ధి ప్రాజెక్టుల‌లో పెట్టుబ‌డులకు వీలు క‌ల్పిస్తుంద‌ని, దీని స‌త్వ‌ర ముగింపున‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. అమెరికా, ఇండియాలు సుస్థిర‌, పార‌ద‌ర్శ‌క నిబంధ‌న‌లు రూపొందించేందుకు ఇరు దేశాలు ఎలా క‌ల‌సి ప‌నిచేయాల‌న్న‌దానిపై మావ‌రు మ‌రింత‌గా చ‌ర్చించారు. ఇది ఇండో ప‌సిఫిక్ అంత‌టా ఆర్ధిక ఆంక్ష‌లు ఎత్తివేసేందుకు మార్గం సుగ‌మం చేస్తుంది. విప‌త్తుల‌ను త‌ట్టుకునే మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు స‌హ‌కారాన్ని మ‌రింత పెంపొందించేందుకు , రానున్న ఇండో ప‌సిఫిక్ బిజినెస్ ఫోరం కు సంబంధించి మ‌రింత స‌హ‌కారాన్ని వారు స్వాగతించారు.

అత్యున్న‌త నైపుణ్యాలు క‌లిగిన ప్రొఫెష‌న‌ల్స్‌, విద్యార్థులు, ఇన్వెస్ట‌ర్లు, బిజినెస్ ట్రావెల‌ర్లు రెండు దేశాల మ‌ధ్య ప‌ర్య‌టించ‌డంలో పెరుగుద‌ల త‌మ ఆర్దిక , సాంకేతిక భాగ‌స్వామ్యాన్ని పెంపొందించ‌గ‌ల‌ద‌ని ఇరువురు నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇరుదేశాల మ‌ధ్య భ‌ద్ర‌మైన  ప‌టిష్ట‌మైన స‌ర‌ఫ‌రా చెయిన్‌లు ఉండాల్సిన అవ‌స‌రాన్ని ఇరువురు నాయ‌కులు ప్ర‌స్తావించారు. ఫార్మాసూటిక‌ల్స్‌, బ‌యో టెక్నాల‌జిచ సెమీ కండ‌క్ట‌ర్లు, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వంటి కీల‌క రంగాల‌లో బ‌ల‌మైన సంబంధాల‌ను నెల‌కొల్ప‌డానికి ప్రైవేటు రంగం భాగ‌స్వామ్యాన్ని వారు స్వాగ‌తించారు. ఆర్ధిక వృద్ధి సాధించ‌డానికి ,వ్యూహాత్మ‌క ప్రాధాన్య‌త‌ల‌ను సాధించ‌డానికి కీల‌క‌, అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం అవ‌స‌రాన్ని ఇరువురు నాయ‌కులు గుర్తించారు.కీల‌క రంగాల‌లో ఉన్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వేగ‌వంతం చేసే ల‌క్ష్యంతో
హై టెక్నాల‌జీ కో ఆపరేష‌న్ గ్రూప్ (హెచ్‌టిసిజి)ని 2022 కొత్త‌లో పున‌రుద్ధ‌రించ‌డానికి మ‌రింత ఆస‌క్తితో ఎదురుచూస్తున్న‌ట్టు వారు ప్ర‌క‌టించారు.
.
నూత‌న రంగాల‌లో త‌మ భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించ‌డంతోపాట దానిని మ‌రింత విస్త‌రింప‌చేయాల‌ని ఇరువురు నాయ‌కులు నిర్ణ‌యించారు. అలాగే ప‌లు ఇత‌ర రంగాలైన అంత‌రిక్షం, సైబ‌ర్‌, ఆరోగ్య భ‌ద్ర‌త‌, సెమీకండ‌క్ట‌ర్లు, కృత్రిమ మేధ‌, 5జి, 6 జి, ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్ టెలిక‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ, బ్లాక్‌చెయిన్ ల‌లో భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఇవి వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల ప్ర‌క్రియ‌ను నిర్వ‌చించ‌నున్నాయి. త‌దుప‌రి శ‌తాబ్ద‌పు ఆర్ధిక‌,భ‌ద్ర‌తా అంశాల‌ను నిర్దేశించ‌నుంది.

సైబ‌ర్ రంగంలో ఉన్న ముప్పు, ఈ రంగానికి సంబంధించిన ప్రాథ‌మిక అవ‌స‌రాలు, కీల‌క మౌలిక స‌దుపాయాల అవ‌స‌రాన్ని ఇరువురు నాయ‌కులు గుర్తించారు . సైబ‌ర్ నేరాల‌ను ఎదుర్కొవడంలో ప్ర‌భుత్వాల మ‌ధ్య భాగ‌స్వామ్యాన్ని పెంచేందుకు, త‌మ త‌మ సరిహ‌ద్దుల‌నుంచి కార్య‌క‌లాపాలు సాగించే సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను ఎదుర్కొనేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. సామ‌ర్ధ్యాల‌ను క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిర్మించ‌డం, ప‌ర‌స్ప‌ర సాంకేతిక స‌హాయం అందించుకోవ‌డం, సైబ‌ర్ ముప్పున‌కు స్పందించ‌డాన్ని ప్రాధాన్య‌తాంశంగా చేప‌ట్టాల‌ని, ప‌ర‌స్ప‌ర చ‌ర్చ‌లు, సంయుక్త స‌మావేశాలు, శిక్ష‌ణ‌, ప‌ర‌స్ప‌ర ఉత్త‌మ విధానాల‌ను తెలియ‌జేసుకోవ‌డం వంటి వాటిని ఇరువురునేత‌లు పున‌రుద్ఘాటించారు. ఔట‌ర్ స్పేస్ కార్య‌క‌లాపాల‌కు సంబంధించి డాటా, సేవ‌ల  విష‌యంలో అవ‌గాహ‌న‌కు సంబంధించిన అవ‌గాహ‌నా ఒప్పందాన్ని ఈ సంవ‌త్స‌రం ఆఖ‌రుకు ఖ‌రారు చేసేందుకు ఎదురుచూస్తున్న‌ట్టు తెలిపారు.

 అంత‌ర్జాతీయ భాగ‌స్వాములుగా విద్య‌, శాస్త్ర సాంకేతిక రంగం, ప్ర‌జ‌ల‌కు- ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంప్ర‌దింపులను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి అమెరికా, ఇండియాలు నిర్ణ‌యించాయి.  ఈ ఏడాది చివ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఇండియా, అమెరికాల  2+2 మినిస్టీరియ‌ల్ చ‌ర్చ‌ల ద్వారా స‌న్నిహిత సంప్ర‌దింపులు జ‌రిపే అంశాన్ని ఇరువురు నాయ‌కులు స్వాగ‌తించారు.


ఇండియా, అమెరికాల ప్ర‌జ‌ల మ‌ధ్య లోతైన‌, అద్భుత‌మైన బంధాలు ఉండ‌డంప‌ట్ల ఇరువురు నాయ‌కులు సంతోషం వ్య‌క్తం చేశారు. అలాగే ఇరు దేశాల మ‌ధ్య 75 సంవ‌త్స‌రాలుగా నిరంత‌ర భాగ‌స్వామ్యం ఉండ‌డాన్నివారు ప్ర‌స్తావించారు. స్వేచ్ఛ, ప్ర‌జాస్వామ్యం, సార్వ‌త్రిక మాన‌వ హ‌క్కులు, స‌హిష్ణుత‌, బ‌హుళ‌త్వం, పౌరులంద‌రికీ స‌మాన అవ‌కాశాలు, సుస్థిర అభివృద్ధి అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త దిశ‌గా కృషి చేసేందుకు క‌ట్టుబాటు వంటి వాటిని వారు పున‌రుద్ఘాటించారు. ఇత‌రులు ఈ మార్గాన్ని అనుస‌రించాల‌ని సూచించారు.
 పురాత‌న వ‌స్తువుల‌ను అమెరికా, ఇండియాకు తిరిగి పంపించినందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అమెరికాను ప్ర‌శంసించారు.  సంస్కృతికి సంబంధించిన వ‌స్తువుల దొంగ‌త‌నం, అక్ర‌మ ర‌వాణా, అక్ర‌మ వ్యాపారాన్ని ఎదుర్కొనేందుకు త‌మ కృషిని బ‌లోపేతం చేసేందుకు నాయ‌కులు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు వారు తెలిపారు.

  ఉమ్మ‌డి విలువ‌లు, సూత్రాలు, పెరుగుతున్న వ్యూహాత్మ‌క స‌మైక్య‌త‌ను ప్ర‌తిబింబి్తూ అమెరికా అధ్య‌క్షుడ జో బైడెన్‌, భార‌త ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లు అమెరికా- ఇండియా స‌మ‌గ్ర అంత‌ర్జాతీయ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు నిశ్చ‌యించారు. అలాగే ఇండియా , అమెరికాలు సంయుక్తంగా సాధించ‌గ‌ల‌దానిపైనా ఆశ‌తో ఎదురు చూస్తున్న‌ట్టు వారు  ప్ర‌క‌టించారు.

 

***

 

 



(Release ID: 1758174) Visitor Counter : 270