ఆర్థిక మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
25 SEP 2021 10:35AM by PIB Hyderabad
నిఘావర్గాల నుంచి అందిన పన్ను ఎగవేత సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ 22.09.2021వ తేదీన గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల తయారీ, ఎగుమతిదారుల ప్రాంగణాలలో సోదాలు మరియు జప్తు కార్యక్రమాలను నిర్వహించింది. ఈ గ్రూపు
వజ్రాల వ్యాపారంలోనే కాకుండా టైల్స్ తయారీ వ్యాపారంలో కూడా నిమగ్నమై ఉంది. ఈ ఆపరేషన్ గుజరాత్‌లోని సూరత్, నవ్‌సారీ, మోర్బి, వాంకనేర్ మహారాష్ట్రలోని ముంబయిలోని 23 ప్రాంగణాలలో ఏక కాలంలో జరిగాయి. ఈ సోదాలలో పన్ను కట్టని సొమ్ముకు సంబంధించిన సమాచారం కాగితాల రూపంలోనూ డిజిటల్ రూపంలోనూ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముంబయి నవసరి సురత్‌లలోని విశ్వసనీయ ఉద్యోగుల ఆధీనంలోని రహస్య ప్రదేశాల్లో వీటిని దాచడం జరిగింది.
రూ.518 కోట్ల విలువైన లావాదేవీలు..
సోదాలలో లభించిన సమాచారంలో లెక్కలు చూపని కొనుగోళ్లు, లెక్కలు చూపని అమ్మకాలు, నగదు అందుకున్న కొనుగోళ్ల కోసం వసతి నమోదు తీసుకోవడం, అంగడియా సంస్థల ద్వారా అటువంటి నగదు మరియు స్టాక్ తరలింపు, అంగడియాలతో లెక్కించబడని నగదు ఉంచడం, ఆస్తి కొనుగోలు కోసం లెక్కించబడని ఆదాయ పెట్టుబడి, గడిచిన ఐదు సంవత్సరాల స్టాక్ మొదలైనవి వివరాలను గుర్తించడమైంది. సమాచారం ప్రాథమిక విశ్లేషణ ప్రకారం అస్సెస్సీ గత కొంత కాలంగా దాదాపు రూ.518 కోట్ల విలువైన చిన్న పాలిష్ చేసిన వజ్రాల కొనుగోళ్లు మరియు అమ్మకాలు జరిపినట్టుగా తేలింది. దీనికి తోడు అసెస్సీ తయారీ కార్యకలాపాల ద్వారా రూ.95 కోట్ల కంటే అధిక విలువ కలిగిన వజ్రాల స్క్రాప్‌ను కూడా లెక్కకు చూపని ఆదాయంగా నిర్వహించినట్టు గుర్తించడమైంది. అసెస్సీ గడిచిన సంవత్సరాలలో సుమారు రూ. 2,742 కోట్ల చిన్న వజ్రాల అమ్మకాలు మాత్రమే పుస్తకాలలో నమోదు చేశారు. ఈ వజ్రాల కొనుగోళ్లలో అత్యధిక మొత్తం నగదు రూపంలో జరిగాయి, కానీ ఈ కొనుగోలు బిల్లులు ఎకామడేషన్ ఎంట్రీ ప్రొవైడర్ల నుండి తీసుకోబడ్డాయి.
హాంకాంగ్‌లో నమోదైన కంపెనీ ద్వారా ..
మదింపుదారుడు హాంకాంగ్‌లో నమోదైన కంపెనీ ద్వారా పెద్దపెద్ద ముడి వజ్రాలను దిగుమతి మార్గంలో కొనుగోలు చేసి వాటిని భారత్‌లో మేటి వజ్రాలుగా సానపట్టి తిరగి ఎగుమతి మార్గంలో అమ్మకాలు చేస్తున్నట్టుగా కూడా సోదాలలో గుర్తించడమైంది. ఈ కంపెనీ కార్యకలాపాలు భారతదేశం నుండి మాత్రమే సమర్థంగా నియంత్రించబడినట్టుగా కూడా గుర్తించడమైంది. ఈ సోదాలలో లభించిన సమాచారం మేరకు హాంకాంగ్ నమోదిత కంపెనీ ద్వారా గడిచిన రెండేండ్ల కాలంలో సుమారు రూ.189 కోట్ల విలువైన వజ్రాలను కొనుగోలు చేసి.. వాటిని దాదాపు రూ.1040 కోట్లకు విక్రయించినట్టుగా తేలింది. సోదాలలో భాగంగా గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ ఒప్పందాల యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలు కనుగొనబడ్డాయి, ఇందులో లెక్కకు చూపని లావాదేవీలు రూ. 80 కోట్లుగా గుర్తించబడింది. వీటికి తోడు టైల్స్ వ్యాపారానికి సంబంధించిన షేర్ల విక్రయ లావాదేవీలను పరిశీలించారు. ఇందులో రూ. 81 కోట్ల నిధులను లెక్కకు చూపని ఆదాయంగా గుర్తించడమైంది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో లెక్కలోకి చూపని రూ.1.95 కోట్ల నగదు మరియు నగలు స్వాధీనం చేసుకున్నారు. 8900 క్యారెట్ల లెక్క పుస్తకాలలో చూపని రూ.10.98 కోట్ల విలువ గల డైమండ్ నిలువలు కనుగొనబడ్డాయి. ఈ గ్రూపుకు సంబంధించి పెద్ద సంఖ్యలో లాకర్‌లు గుర్తించబడ్డాయి. అవి నిర్బంధంలో ఉంచబడ్డాయి. వీటిని తర్వలో తెరిచి చూడనున్నారు. శోధన ఆపరేషన్‌లు ఇంకా కొనసాగుతున్నాయి. తదుపరి విచారణ కొనసాగుతోంది.
****
(Release ID: 1758171)
Visitor Counter : 190