సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఒడిషా మొద‌టి ప‌ట్టు నూలు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన కెవిఐసి..


ప‌ట్టు నూలు ఉత్ప‌తి కేంద్రంద్వారా స్థానిక ప‌ట్టు ప‌రిశ్ర‌మ‌కు, ఉపాధికి ప్రోత్సాహం

Posted On: 24 SEP 2021 3:12PM by PIB Hyderabad

ప‌ట్టు బ‌ట్ట‌ల ఉత్ప‌త్తిలో నాలుగు వంద‌ల ఘ‌న చ‌రిత్ర క‌లిగిన రాష్ట్రం ఒడిషా. ముఖ్యంగా తుషార్ ర‌కం ప‌ట్టు బ‌ట్ట‌ల ఉత్ప‌త్తిద్వారా వేలాది మంది గిరిజ‌న ప్ర‌జ‌లు ప్ర‌ధానంగా మ‌హిళ‌లు ల‌బ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో పట్టు బ‌ట్ట నేత‌న్న‌లు త‌మ‌కు కావాల‌సిన ప‌ట్టు నూలు కోసం ప‌శ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, క‌ర్నాట‌క రాష్ట్రాల‌పై ఆధార‌ప‌డుతున్నారు. త‌ద్వారా వారి ఉత్ప‌త్తుల ధ‌ర అధికం కావ‌డం జ‌రుగుతోంది. 
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018IST.jpg   
           
ఖాదీ మ‌రియు గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ( కెవిఐసి) తీసుకున్న చారిత్రాత్మ‌క నిర్ణ‌యం కార‌ణంగా క‌ట‌క్ జిల్లా చౌదార్ లో ఒడిషా మొట్ట‌మొద‌టి తుషార్ ప‌ట్టు నూలు ఉత్ప‌త్తి కేంద్రం ప్రారంభ‌మైంది. ఈ కేంద్రం ద్వారా ఉత్ప‌త్తి అయ్యే ప‌ట్టు నూలు కార‌ణంగా ప‌ట్టు బ‌ట్ట‌ల ఉత్ప‌త్తి వ్య‌యం త‌గ్గుతుంది. స్థానికంగా తుషార్ ర‌కం ప‌ట్టు నూలు ఉత్ప‌త్తి కార‌ణంగా యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంది. తుషార్ ప‌ట్టు అనేది ప‌ట్టు ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌త శ్రేణి ర‌కంగా పేరు సంపాదించుకుంది. ప‌ట్టు నూలుఉత్ప‌త్తి కేంద్రాన్ని కెవిఐసి అధ్య‌క్షులు శ్రీ విన‌య్ కుమార్ స‌క్సేనా ప్రారంభించారు.
 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00246HV.jpg  
ఒడిషాలోని ఖాదీ బ‌ట్ట ఉత్ప‌త్తిలో 75శాతం ప‌ట్టు బ‌ట్ట‌కు ప్రాధాన్యం వుంది. కాబ‌ట్టి ప‌ట్టు నూలు ఉత్ప‌త్తి కేంద్ర ప్రారంభ‌మ‌నేది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ కేంద్రం కార‌ణంగా యాభైమంది క‌ళాకారుల‌కు నేరుగా ఉపాధి ల‌భిస్తుంది. వీరిలో 34 మంది మ‌హిళ‌లున్నారు. అంతే కాదు పట్టు గుడ్ల పెంప‌కం చేప‌ట్టిన 300 మంది గిరిజ‌న రైతుల‌కు కూడా జీవ‌నోపాధి ల‌భిస్తుంది. ఈ కేంద్రం కార‌ణంగా రాష్ట్రంలోని నేత‌న్న‌ల‌కు ప‌రోక్షంగా ల‌బ్ధి చేకూరుతుంది. ప్ర‌తి కిలో ముడి ప‌ట్టు ఉత్ప‌త్తిద్వారా 11 మంది క‌ళాకారుల‌కు ల‌బ్ధి చేకూరుతుంది. అందులో 6 గురు మ‌హిళ‌లుంటారు.   
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన శ్రీ స‌క్సేనా ప‌ట్టు ప‌రిశ్ర‌మ ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. భార‌తీయ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లో ఇది కీల‌కంగా వుంద‌ని అన్నారు. స్థానికంగానే ప‌ట్టు నూలు ఉత్ప‌త్తి కేంద్రం ఏర్పాటు కార‌ణంగా ప‌ట్టు బ‌ట్ట‌ల ఉత్ప‌త్తి వ్య‌యం త‌గ్గ‌డ‌మే కాకుండా అనేక మంది ఉపాధి ల‌భిస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒడిషాకు చెందిన‌ ప్ర‌సిద్ధ తుషార్ ప‌ట్టు సంప్ర‌దాయానికి ఈ కేంద్రంద్వారా ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
ఈ కేంద్రాన్ని రూ. 75 ల‌క్ష‌ల వ్య‌యంతో ఏర్పాటు చేశారు. ఇది ప్ర‌తి ఏడాది రూ. 94 ల‌క్ష‌ల విలువైన 200 కేజీల పట్టు నూలును ఉత్ప‌త్తి చేస్తుంది. డిమాండ్ పెరిగే కొద్దీ ఈ కేంద్రం త‌న ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఆధునిక యంత్రాల‌తో ఈ ప‌ట్టు నూలు ఉత్ప‌త్తి కేంద్రాన్ని నెల‌కొల్ప‌డం జ‌రిగింది. 

 

***


(Release ID: 1758021) Visitor Counter : 264


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil