ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ
Posted On:
21 SEP 2021 1:20PM by PIB Hyderabad
భారతదేశంలో జౌళి, నూలు ఉత్పత్తిలో నిమగ్నమై ఢిల్లీ, పంజాబ్, కోల్‌కతాలో కార్పొరేట్ కార్యాలయాలు కలిగి ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థపై 18.09.2021న ఆదాయపు పన్ను శాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు, స్వాధీనం) ఆపరేషన్‌ను నిర్వహించింది.
సోదాల కార్యకలాపాల క్రమంలో నేరారోపణ పత్రాలు, విడి పత్రాలు, డైరీలు, డిజిటల్ సాక్ష్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా లెక్కల్లోకి రాని నిధులను తిరిగి భారతీయ సంస్థలలోకి మళ్ళించడం, శాఖకు తెలియపరచని విదేశీ బ్యాంకు అకౌంట్లతో గ్రూపుకు సంబంధం ఉన్నట్టు ఈ ఆధారాలు సూచిస్తున్నాయి. బ్యాంకు అకౌంట్ల బయిట లావాదేవీలు, భూ ఒప్పందాలలో నగదు బదలాయింపులు,అకౌంట్ పుస్తకాలలో బోగస్ వ్యయం తగ్గింపు, లెక్కల్లోకి రాని నగదు వ్యయం, ఎంట్రీ ఆపరేటర్ల నుంచి పొందిన వసతి నమోదులు (అకామడేషన్ ఎంట్రీలు)కు సంబంధించి తగిన ఆధారాలను సేకరించారు.
తన విదేశీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.350 కోట్ల మేరకు లెక్కల్లోకి రాని నిధులను నిర్వహించడమే కాక, పన్నుస్థావరాలలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా ఈ నిధులను తిరిగి వ్యాపారంలోకి మళ్ళించింది. గ్రూపు నియంత్రణ కింద ఉన్నవ్యాపారంలో విదేశీ సంస్థల పెట్టుబడుల రూపంలోను, దాని ప్రధాన సంస్థ విడుదల చేసిన విదేశీ కరెన్సీ కన్వర్టటిబుల్ బాండ్ల రూపంలో, అంతిమంగా చెల్లింపుల ఎగవేత ముసుగులో, కంపెనీ వాటాలుగా వాటిని మార్చడానికి సంబంధించి ఉంది. లెక్కల్లోకి రాని నగదును నిర్వహించేందుకు విదేశీ కంపెనీలకు, ట్రస్టులకు మేనేజ్‌మెంట్ ఫీజును కూడా చెల్లిస్తున్నట్టు కనుగొన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుల షెడ్యూల్ ఎఫ్ఎలో కంపెనీలు, బ్యాంకు అకౌంట్ల రూపంలో నిర్వహించబడుతున్న విదేశీ ఆస్తుల యాజమాన్యం / నిర్వహణకు సంబంధించి వివరాలను తెలియపరచాలనే నిర్ధిష్ట షరతు ఉన్నప్పటికీ, ఈ విషయం గురించి గ్రూపు శాఖకు వెల్లడించలేదు.
నగదు రూపంలో వివరించని వ్యక్తిగత ఖర్చులకు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రధాన కార్యాలయాలు ఒక దానిలో నిక్కచ్చిగా నిర్వహిస్తున్నట్టు తేలింది. కంపెనీ అకౌంట్లు, భూమి ఒప్పందాల నగదు బదలాయింపులలో దాదాపు రూ. 100 కో్ట్ల మేరకు బోగస్ వ్యయాన్ని చూపించినట్టు ఆధారాలు సేకరించారు.
సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
***
(Release ID: 1756702)
Visitor Counter : 176