యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భవిష్యత్తులో అంతర్జాతీయ మల్టీ స్పోర్టింగ్ కార్యక్రమాల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి మరియు క్రిందిస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో శ్రీ అనురాగ్ ఠాకూర్ సంభాషించారు.
భారతదేశంలో క్రీడా మౌలిక సదుపాయాల కోసం ఇంటిగ్రేటెడ్ డాష్‌బోర్డ్ సృష్టించబడుతుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
20 SEP 2021 6:13PM by PIB Hyderabad
ప్రధానాంశాలు:
- అథ్లెట్లకు నగదు పురస్కారాలను అందించడానికి కామన్ పూల్ ఏర్పాటుపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ అభిప్రాయాన్ని పంపాలని మంత్రిత్వ శాఖ కోరింది. తద్వారా అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పతకాలు సాధించిన తర్వాత సమాన ప్రయోజనం పొందుతారు
- క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన డేటా ప్రతి రాష్ట్రం, జిల్లా మరియు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటుంది
- భవిష్యత్ ఛాంపియన్‌షిప్‌ల కోసం మన క్రీడాకారులను సిద్ధం చేయడానికి జాతీయ క్రీడా సమాఖ్యలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర వాటాదారులతో పాటు అన్ని రాష్ట్రాలు కలిసి వస్తాయి: కేంద్ర క్రీడా మంత్రి
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో వర్చువల్‌గా సంభాషించారు. టోక్యోలో ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ విజయాల తరువాత భవిష్యత్తు ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్ మరియు కామన్వెల్త్ గేమ్‌ల కోసం మన అథ్లెట్లను సిద్ధం చేయడానికి రోడ్ మ్యాప్‌ని రూపొందించడం మరియు గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్రాలు ఏవిధంగా సహకరిస్తున్నాయని అనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ రవి మిట్టల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
చర్చ సమయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమీకరించుకునే అథ్లెట్లకు ఉమ్మడి నగదు పురస్కారాలను అందించడంపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు తమ అభిప్రాయాన్ని పంపాలని మంత్రి కోరారు. తద్వారా పతకాలు సాధించిన అన్ని రాష్ట్రాల క్రీడాకారులకు సమాన ప్రయోజనం లభిస్తుంది. క్రీడలు రాష్ట్రాలకు సంబంధించిన ఆంశం మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో క్రీడాకారులు మరియు పారా అథ్లెట్‌ల కోసం క్రీడా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అట్టడుగు స్థాయిలోని ప్రతిభావంతులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాలని వారిని ప్రోత్సహించడమే పరస్పర చర్య యొక్క మొత్తం ఉద్దేశ్యం. పాఠశాల స్థాయి క్రీడలను ప్రోత్సహించడం మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఎఫ్‌ఐ) కి మద్దతు ఇవ్వడం మరొక ముఖ్య చర్చనీయాంశం.
సమావేశం తరువాత శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ "ఈరోజు సమావేశం చాలా ఫలవంతమైనది మరియు పురోగతిని అంచనా వేయడానికి సంవత్సరంలో కనీసం రెండుసార్లు సమావేశం కావాలని మరియు మెరుగైన మౌలిక సదుపాయాలు, మరిన్ని కోచ్‌లు మరియు ఎక్కువ మంది ట్రైనర్లు మరియు ఫిజియోథెరపిస్ట్‌తో ఎలా రావాలో మేము అంగీకరించాము. మేము వివిధ జోన్లలో ప్రాంతీయ సమావేశాలను నిర్వహిస్తున్నామని" తెలిపారు. అంతే కాకుండా మేము డాష్‌బోర్డ్‌ను సృష్టించాలని చూస్తున్నాము. ఇందులోప్రతి రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌లో క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంటుంది. ఎంతమంది కోచ్‌లు అందుబాటులో ఉన్నారు, ఇండోర్ స్టేడియం లేదా అవుట్‌డోర్ గేమ్‌సెట్‌లో ఎలాంటి క్రీడలు ఆడతారు మరియు వంటి వివరాలు డాష్‌బోర్డ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వివిధ క్రీడల కోసం టాలెంట్ హంట్ ప్రోగ్రాం ఉంటుందని, తద్వారా మనం గుర్తించిన పిల్లలకు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల కోసం బాగా శిక్షణ ఇస్తామని కూడా శ్రీ ఠాకూర్ తెలిపారు. అలాగే అథ్లెట్లకు ఎక్కువ ఎక్స్‌పోజర్ ఇవ్వడానికి రాష్ట్రాలు మరిన్ని ఈవెంట్‌లు మరియు పోటీలను నిర్వహించాలని మేము అభ్యర్థించాము, తద్వారా వారు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మరిన్ని ఈవెంట్‌లలో పాల్గొనవచ్చుని కూడా శ్రీ ఠాకూర్ తెలిపారు.
సహకార ఫెడరలిజం గురించి ప్రధాని చెప్పినట్లుగా అన్ని రాష్ట్రాల, జాతీయ క్రీడా సమాఖ్యలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర వాటాదారులతో కలిసి భవిష్యత్ ఛాంపియన్‌షిప్‌ల కోసం మన అథ్లెట్లను సిద్ధం చేయడానికి మరియు మెరుగైన మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు కూడా కలసి వస్తాయని శ్రీ ఠాకూర్ తెలిపారు.
ప్రస్తుతం 23 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 24 కెఐఎస్‌సిఈలు ఉండగా, దేశంలోని వివిధ జిల్లాలలో 360 కిఐసిలు ప్రారంభించబడ్డాయి. ఉత్తమ కోచింగ్, మౌలిక సదుపాయాలు, వైద్య సదుపాయాలతో సహా అన్ని కీలకమైన సదుపాయాలతో భారతదేశ భవిష్యత్తు ఛాంపియన్లను అందించడంలో రాష్ట్రాలు తమ పూర్తి సామర్థ్యానికి సహకరించాలని శ్రీ ఠాకూర్ కోరారు.
2019 జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. వీటితో పాటు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా మొబైల్ యాప్, ఫిట్ ఇండియా క్విజ్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఫిట్‌నెస్ అలవాటును పెంపొందించడంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచారు.పైన పేర్కొన్న ప్రచారాలలో పాల్గొనడంతో పాటు వాటిని ప్రోత్సహించమని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంత క్రీడా మంత్రులను శ్రీ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో క్రీడాలకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేయడానికి కెఐఎస్‌సిఈ లు, కెఐసిలు అలాగే అకాడమీలను తెరవడానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా శ్రీ ఠాకూర్ కోరారు.
****
(Release ID: 1756563)
Visitor Counter : 183