రక్షణ మంత్రిత్వ శాఖ
అన్ని శ్రేణుల్లో మహిళా సాధికారతకు కట్టుబడిన బిఆర్ఒ
Posted On:
19 SEP 2021 11:53AM by PIB Hyderabad
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా - మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ భగవంతుడు తన దైవిక గుణాలు, సత్కార్యాలు, శాంతి, సౌభ్రాత్వం ఉంటాయి, అది జరగకపోతే, అన్ని చర్యలూ నిష్పలమవుతాయన్న శ్లోక సారాంశానికి అనుగుణంగా భారత సమాజంలో మహిళల పట్ల ఎంతో గౌరవం ఉంది.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత మహోత్సవతో పాటుగా మహిళా సాధికారత దిశగా మన దేశ కృషిని కూడా వేడుక చేసుకుంటోంది. నేడు మహిళలు దేశ నిర్మాణంలో తమ న్యాయమైన, సమాన స్థానాన్ని స్వకరించడమే కాక బలమైన జాతీయ స్వభావానికి ప్రతినిధులుగా ఉన్నారు.
సరిహద్దు రహదారుల సంస్థ (బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - బిఆర్ఒ) గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో మహిళలను ఆఫీసర్ల స్థాయి నుంచి కమర్షియల్ పైలెట్ లైసెన్స్ హోల్డర్లుగా నియమిస్తోంది. అధికారం, బాధ్యత, గౌరవం అన్న పరికరాలతో వారిని సాధికారం చేయడం ద్వారా దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వాములు అవుతారని బిఆర్ఒ బలంగా విశ్వసిస్తోంది. ఈ విశ్వాసాన్ని ధృవీకరిస్తూ, సంస్థ మహిళలకు ఉన్నత నాయకత్వ స్థానాలను అప్పగించడాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో జిఆర్ఇఎఫ్ ఆఫీసర్ ఇఇ (సివిల్) వైఏశాలి ఎస్ హివాసే సవాళ్ళు, ప్రతికూలతలు నిండిన ప్రాంతమైన మునిసైరీ - బగ్ధియార్- మిలాంను అనుసంధానం చేసే కీలకమైన భారత్ - చైనా రహదారి 83 రోడ్ కనస్ట్రక్షన్ కంపెనీ బాధ్యతలను ఏప్రిల్ 28, 2021న స్వీకరించారు. మహిళా అధికారి బాధ్యతలను తీసుకొని, తనకప్పగించిన పనులను అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని పీపల్‌కోటిలోని 75 ఆర్‌సిసికి ఆఫీసర్ కమాండింగ్ గా ప్రాజెక్టు శివాలిక్‌కు చెందిన మేజర్ అంజనా 30 ఆగస్టు 2021న బాధ్యతలు స్వకరించిన సందర్భంలో బిఆర్ఒ తిరిగి చరిత్రను సృష్టించింది. ఒక రోడ్డు నిర్మాణ కంపెనీకి అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ సైనిక ఇంజనీర్ అధికారి ఆమె. అంతేకాదు, కెప్టెన్ అంజనా కింద ఉన్న ముగ్గురు ప్లెటూన్ కమాండర్లు ఎఇఇ (సివిల్) భావనా జోషి, ఎఇఇ (సివిల్) విష్ణుమాయ కె మహిళా అధికారులు. వారు ముగ్గురూ కలిసి తొలి మహిళా ఆర్‌సిసిని సృష్టించారు. అలా మహిళా నాయకత్ంలో నాలుగు ఆర్‌సిసిలను ఈశాన్య ప్రాంతంలో రెండు, పశ్చిమ సెక్టర్లో రెండు చొప్పున ఏర్పాటు చేయాలని బార్డర్ రోడ్ ప్రయత్నం చేస్తోంది.
గత ఆరు దశాబ్దాలలో క్రమ పద్దతిలో బిఆర్ఒ రహదారుల నిర్మాణంలో వివిధ బాధ్యతలను పాత్రలను నిర్వహించేందుకు మహిళల సంఖ్యను పెంచుతూ వచ్చింది. స్వతంత్రంగా పని చేపట్టేందుకు అవసరమైన అధికారాన్ని, బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని సాధికారం చేసే యత్నం జరుగుతోంది. తమతమ రంగాలలో నారీశక్తికి చిహ్నంగా ఈ మహిళలు నిలిచారు.
మహిళలు అన్ని రంగాలలో ప్రధాన పాత్రలను పోషిస్తుండగా, మహిళా సాధికారతకు బిఆర్ఒ చేపట్టిన బహుముఖ పద్ధతిలో వివిధ ఉద్యోగ పాత్రలు, ఉన్నత విద్యకు అవకాశాలు, అందుబాటులో సరైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, సాహసాలకు అవకాశాలు, క్రీడలు, సంపూర్ణ అభివృద్ధికి ప్రోత్సాహం ఉన్నాయి.
నిజమైన భావంలో మహిళా సాధికారత అన్నది వైఖరిలో మార్పులను పొందుపరచడం ద్వారా సాధించారు.
వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాక, సరైన గౌరవంతో, న్యాయంగా, సమానంగా చూడడం ద్వారా సాధించారు. వృత్తిపరమైన రంగంలోనే కాక సంక్షేమ చొరవలలో భాగంగా మహిళలకు తమ ఆర్థిక వ్యవహారాలను, పత్రాలను నిర్వహించే విద్యను అందిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో మహిళా సాధికారత కోసం నిబద్ధతతో కూడిన విద్యా కార్యక్రమాలను బిఆర్ఒ ప్రాజెక్టు ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారాన్ని చేపట్టింది. ఆడపిల్లలకు సమాన అవకాశాలు అన్న దానిపై దృష్టి పెట్టడం అన్నది బిఆర్ఒకు కీలకం. కోవిడ్ మహమ్మారి కాలంలో పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు విద్యా కార్యక్రమాలను బిఆర్ఒ అధికారులు చేపట్టారు.
నేటి ప్రపంచంలో విద్య, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, తగిన ఆదాయం, అందుబాటులో ఇంటర్నెట్ అన్నవి సాధికారతకు ముఖ్యమైన మాధ్యమాలు. రహదారుల నిర్మాణంలో అంతర్గత శక్తిగా ఉన్న మహిళా అధికారుల సమాన వృద్ధికి బిఆర్ఒ అవకాశాలను కల్పిస్తోంది. మారుతున్న కాలంలో పెరుగుతున్న ఆకాంక్షల నేపథ్యంలో మహిళా సాధికారత అన్న మూల విశ్వాసానికి బిఆర్ఒ కట్టుబడి ఉంది.
***
(Release ID: 1756325)
Visitor Counter : 467