ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించిన - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ


"రోగుల భద్రతకు భరోసా ఇవ్వడం అనేది - పురాతన ఆరోగ్య సంరక్షణ విధానాల కొనసాగింపు"


"రోగుల పట్ల ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రవర్తన కూడా చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం"

Posted On: 17 SEP 2021 5:07PM by PIB Hyderabad

ఈ రోజు ప్రపంచ రోగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమంలో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు. 

భారతదేశంలో 2021 సెప్టెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే "రోగి సురక్షా వారోత్సవాల" వేడుక, ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవంతో ముగుస్తుంది.  ‘‘మాతృ మరియు నవజాత సంరక్షణలో భద్రత’’ అనే అంశాన్ని, ఈ ఏడాది "ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం" ఇతివృత్తంగా నిర్ణయించారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ సందర్భంగా ప్రజారోగ్య సదుపాయాలలో నాణ్యత భరోసా కోసం కార్యాచరణ మార్గదర్శకాలు-2021 విడుదల చేశారు.  దీనితో పాటు,   కీలక విజయాలపై ఆరు నెలలకు ఒకసారి విడుదల చేసే, "క్వాలిటీ దర్పణ్" పేరుతో తాజా సమాచారాన్నీ;  ఎన్.క్యూ.ఏ.ఎస్. కార్యక్రమాలు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, శ్రేయస్సు కేంద్రాల కింద తెలుసుకున్న విషయాలను వివరించే, 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసిక పురోగతి నివేదికపై ఈ-బుక్ లెట్;  ఇంటిగ్రేటెడ్ ఆర్.ఎమ్.ఎన్.సి.ఏ.హెచ్+ఎన్.  కౌన్సెలింగ్ కోసం రిఫరెన్స్ మాన్యువల్ ను కూడా కేంద్ర మంత్రి విడుదల చేశారు. 

ప్రసవ సమయంలో మాతా శిశు మరణాల పర్యవేక్షణ ప్రతిస్పందన (ఎమ్.పి.సి.డి.ఎస్.ఆర్) కోసం రూపొందించిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ తో పాటు,  ఆరోగ్య సౌకర్యాల విషయంలో పిల్లలకు నాణ్యమైన సేవలను అందించాలనే లక్ష్యంతో రూపొందించిన "ముస్కాన్" అనే పథకాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రారంభించారు.

'ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం' సందర్భంగా, 'మాతా శిశు మరియు నవజాత సంరక్షణ లో భద్రత' అనే అంశంపై ప్రసంగించారు. 

పిల్లలు, ఇతర రోగులకు ఆరోగ్య సేవల్లో సమర్థత, నాణ్యతను నిర్ధారించడానికి మార్గదర్శకాలు, పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించారు.

 (1/2) pic.twitter.com/BElGKpHteZ

- మన్సుఖ్ మాండవీయ (@mansukhmandviya) 17 సెప్టెంబర్, 2021

జాతీయ నాణ్యత భరోసా ప్రమాణాల (ఎన్.క్యూ.ఏ.ఎస్) మరియు లక్ష్య అమలులో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను శ్రీ మాండవీయ, ఈ కార్యక్రమంలో అభినందించారు.

ఈ అవార్డు పొందిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 

క్రమ సంఖ్య

         విభాగం

 

ప్రథమ స్థానం 

ద్వితీయ స్థానం 

1

జిల్లా ఆసుపత్రులు 

(డి.హెచ్.లు) & 

సబ్-డివిజినల్ 

ఆసుపత్రులు 

(ఎస్.డి.హెచ్.లు)

మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ 

జమ్మూ -కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు

2

సామాజిక 

ఆరోగ్య కేంద్రాలు (సి.హెచ్.సి.లు)

 

హర్యానా, ఆంధ్రప్రదేశ్, 

తమిళనాడు

జమ్మూ-కశ్మీర్,  ఛత్తీస్‌గఢ్, 

పశ్చిమ బెంగాల్

3

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 

మణిపూర్, హర్యానా,

తెలంగాణ

త్రిపుర, కేరళ,

మధ్యప్రదేశ్

4

పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు 

నాగాలాండ్, కేరళ, గుజరాత్

మిజోరం, హర్యానా, తెలంగాణ

 

లక్ష్య పథకం కింద అవార్డు పొందిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 

 

క్రమ సంఖ్య 

విభాగం 

ప్రథమ స్థానం

ద్వితీయ స్థానం 

తృతీయ స్థానం 

1

చిన్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో 

ప్రసూతి కేంద్రాలు 

 

చండీగఢ్

 

 

గోవా 

దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ  

2

పెద్ద రాష్ట్రాల విభాగంలో 

ప్రసూతి కేంద్రాలు 

 

గుజరాత్ 

 

ఉత్తరాఖండ్

 

మహారాష్ట్ర 

3

చిన్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో ప్రసూతి ఓ.టి.లు. 

 

చండీగఢ్ 

 

పుదుచ్చేరి 

 

గోవా 

4

పెద్ద రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో ప్రసూతి ఓ.టి.లు.  

 

గుజరాత్ 

 

మధ్యప్రదేశ్ 

 

మహారాష్ట్ర 

 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అవార్డు గ్రహీతలను ప్రశంసిస్తూ, నాణ్యత అనేది ఒక నిరంతర ప్రక్రియ అనీ, ఇది ఒక్కసారి మాత్రమే చేస్తే సరిపోయే పని కాదనీ, ఇది మన దైనందిన కార్యకలాపాలలో ఒక భాగం కావాలనీ, పేర్కొన్నారు.  "ఇది ఒక అలవాటుగా మారాలి. రోగుల భద్రతకు భరోసా ఇవ్వడం అనేది ప్రాచీన ఆరోగ్య సంరక్షణ పద్ధతి యొక్క కొనసాగింపు. సుశ్రుతుడు రచించిన చరక సంహితలో అనేక వైద్య పరికరాల ప్రస్తావన ఉంది. అవి నేటికీ కనీస మార్పులతో ఉపయోగించబడుతున్నాయి." అని ఆయన చెప్పారు.  ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడాలనే మన పూర్వీకుల అంకితభావానికి ఇవి నిదర్శనమని కూడా ఆయన పేర్కొన్నారు.

రోగి భద్రతపై దృష్టి పెట్టి అన్ని ప్రక్రియలు చేపట్టాలని, శ్రీ మాండవీయ వివిధ సంస్థల నిర్వాహకులు అందరినీ కోరారు.   "రోగుల పట్ల ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రవర్తన కూడా చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం" అని ఆయన అన్నారు.

ఎన్.క్యూ.ఏ.ఎస్.; లక్ష్య, కాయకల్ప, మేరా-హాస్పటల్ వంటి పథకాలు ప్రజారోగ్య సదుపాయాలపై సమాజం యొక్క విశ్వాసాన్నీ, భరోసాన్నీ పునః స్థాపించడంలో, పునః నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గమనించినట్లు, ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.   రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన అభిరుచి, అత్యుత్సాహంతో పాటు, సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడంలో వారి సమిష్టి ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

భారతదేశంతో పాటు ప్రపంచంలోని ప్రసవాల గణాంకాలను డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వివరిస్తూ, రక్తహీనత, రక్తపోటు, సెప్సిస్ మొదలైన అనారోగ్యాల కారణంగా నివారించగల అన్ని మాతా, శిశు మరణాలను అంతం చేయాల్సిన అవసరం గురించి మాట్లాడారు.  వైద్య వృత్తిలో ఉన్నప్పుడు తమ స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అనాగరికమైన వాతావరణంలో  బిడ్డకు జన్మనివ్వడం భావోద్వేగమైన గాయానికి ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.  గౌరవప్రదమైన ప్రసవం పొందడం, ప్రతి మహిళ హక్కు అని ఆమె నొక్కి చెప్పారు.   ప్రసవ సమయంలో, ప్రసవానంతర సమయంలో సంరక్షణ అందించడంలో లక్ష్య పథకం ద్వారా అందిస్తున్న సహకారం గురించి, ఆమె వివరిస్తూ,  ముస్కాన్ ద్వారా కూడా అదేవిధంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల సంతృప్తి కోసం ఆరోగ్య సంరక్షణను సులభతరం చేస్తున్నట్లు తెలియజేశారు.  భారతీయ సంస్కృతిలో మాతృత్వానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గురించి ఆమె పేర్కొంటూ, "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అని, రామాయణాన్ని ఉటంకించారు. 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్;   కేంద్ర ఆరోగ్య శాఖ  అదనపు కార్యదర్శి మరియు ఎన్.హెచ్.ఎం. మిషన్ డైరెక్టర్, శ్రీ వికాస్ షీల్;  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి (పాలసీ), శ్రీ విశాల్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతదేశంలో డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రతినిధి, డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్ ఇసంతే;  డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రధాన కార్యాలయం సమగ్ర ఆరోగ్య సేవలకు చెందిన డాక్టర్ ఇరినా పాపియేవా;  ఫెర్నాండెజ్ ఫౌండేషన్, ఛైర్-పర్సన్, డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్;   జాన్-హాప్‌-కిన్స్ విశ్వవిద్యాలయం, సీనియర్ శాస్త్రవేత్త, డాక్టర్ అనితా షెట్;  ఎయిమ్స్ భోపాల్ మరియు ఎయిమ్స్ జమ్మూ, అధ్యక్షుడు, డాక్టర్ వై.కె. గుప్తా;  సి-క్యూర్-మీ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక-డైరెక్టర్, శ్రీ తరుణ్ గోయల్ ప్రభృతులు వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలియజేశారు. 

 

*****



(Release ID: 1756066) Visitor Counter : 165